Friday 27 March 2015

ప్రభుత్వ పధకాలు

ప్రభుత్వ పధకాలు
1. ప్రధాని రోజ్‌గార్ యోజన:
ఈ పధకంలో పరిశ్రమలు, సేవా సంస్ధలకే కాకుండా, వ్యాపారం చేసుకోవటానికి కూడా ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఒక్కరు గానీ లేక 5 గురు గానీ సమ్యుక్త భాగస్వామ్యంతో ఋణం పొందవచ్చు. ఎటువంటి హామీ అవసరం లేకుండా, రూ. 1.00లక్ష వరకు ఋణపరిమితి కల్గి ఉంటుంది. ఈ పధకం. మొత్తం ప్రాజెక్టు విలువలో అభ్యర్ధి / అభ్యర్ధిని 5% మార్జిన్ మనీని భరించాలి. 'మార్జిన్ మనీ' అంటే పరిశ్రమ ప్రారంభించే వ్యక్తి పెట్టే పెట్టుబడి. సదరు ప్రాజెక్టు విలువలో 15% రు. 7,500/- లు మించకుండా రాయితీ ఇవ్వబడుతుంది. బ్యాంకు నిర్దేశము మేరకు ఋణమును 3 నుండి 7 సంవత్సరాల కాల పరిమితిలో వాయిదాల పద్ధతిన చెల్లింపవచ్చును.

ఈ పధకంలో లోన్ మంజూరు అయిన తరువాత ఆయా అభ్యర్ధులకు వారు ఎంచుకున్న పరిశ్రమ/ వ్యాపారానికి అవసరమయ్యే స్వల్పకాలిక శిక్షణ యివ్వబడుతుంది. అందులో వ్యాపారము, సేవా సంస్ధల వారికి రూ. 150/- లు మరియు పరిశ్రమ వారికి రూ. 300/- లు స్టైఫండ్‌గా ఇవ్వబడుతుంది. ఈ పధకం క్రింద కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లోన్ శాంక్షన్ అవుతుంది. అదే కుటుంబంలోని మరో సభ్యుడికి రెండవసారి ఋణం మంజూరు చేయబడదు.

ఈ లోన్ ఎవరికి లభిస్తుంది ? కనీస అర్హతలేమిటి ?
విద్యార్హతలు : ఎస్.ఎస్.సి. / మెట్రిక్ (పాస్ లేదా ఫెయిల్) లేక ఐ.టి.ఐ. కనీస విద్యార్హతలు కల్గి ఉండాలి.
వయసు : దరఖాస్తు చేయు అభ్యర్ధికి 18-35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఆదాయం : అన్ని వనరుల నుండి కుటుంబ వార్షిక ఆదాయం రు.24,000/- లకు మించరాదు.
నివాసం : దరఖాస్తు చేయు అభ్యర్ధులు కనీసం 3 సంవత్సరాల కాలం సంబంధిత జిల్లా నివాసి అయి ఉండాలి.
రిజర్వేషన్ : ఎస్.సి.,ఎస్.టి.లకు 22.5 శాతము, బి.సి.లకు 27 శాతము జిల్లా లక్ష్యములో రిజర్వేషన్ మరియు మహిళలకు ప్రాధాన్యత యివ్వబడుతుంది.
అపరాధము: అభ్యర్ధి ఏ జాతీయ బ్యాంకు లేదా కో - ఆపరేటివ్ బ్యాంకు ఆర్ధిక సంస్ధకు ఋణం చెల్లించకుండా అపరాధం చేసి ఉండరాదు. దరఖాస్తు నమూనాలను జిల్లా పరిశ్రమల కేంద్రాలను నుండి, మండల రెవిన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులను కావలసిన సర్టిఫికేట్ల డూప్లికేట్‌లతో జతపర్చి అభ్యర్ధులు ఏజిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా పరిశ్రమల కేంద్రానికి స్వయంగా కానీ, పోస్టు ద్వారా గానీ పంపవచ్చును.
మరిన్ని వివరాలకు: జిల్లా పరిశ్రమల కేంద్రం (లేదా)

కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వము

2. చీఫ్ మినిష్టర్స్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ యూత్ (సి.ఎం.ఇ.వై. పధకం) :
యువజన సంఘం అంటే: ఈ కార్యక్రమం "గ్రూప్ స్ట్రేటజీ" పై ఆధారపడి ఉంది. 18 - 35 సం||రాల వయోవర్గంలోని 5 నుండి 15 యువజనుల కలయికే ఇది రిజిస్ట్రేషన్ - అధిక లాభాలు: ఆంధ్రప్రదేశ్ సొసైటీల చట్టం, 1995 పరస్పర సహాయక సహకార చట్టం / కంపెనీల చట్టం / భాగస్వామ్య పత్రం క్రింద రిజిష్టరు అయిన యువజన సంఘం, తన పేరు మీద ఋణాన్ని పొందడానికి ఏదైనా బ్యాంకును కోరవచ్చును. అంతేకాక, ఈ విధంగా రిజిష్టరైన యువజన సంఘం మార్జిను మనీ / సబ్సిడీ వంటివి పొందడానికి ఎస్.సి / ఎస్.టి / బి.సి. / మైనారిటీలు / మహిళా ఆర్ధిక సంస్ధలు / డి.ఆర్.డి.ఏ. / కె.వి.ఐ.బి. వంటి ఏజన్సీలతో తన కార్య కలాపాలను విస్తరించుకోవచ్చు.
అమలు విధానం: రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు యువజన సేవలను, ప్రయోజనాలను విస్తరింపచేయాలనేది ప్రభుత్వ విధానం. దీన్ని మూడు దశలుగా విభజించారు.
మొదటి దశ: మొదటి దశలో "పైలటు" ప్రాతిపదికన ఒక్కొక్క మండలంలోనూ రెండు గ్రామాలను ఎంపిక చేస్తారు. మొదటి దశలో మున్సిపల్ ప్రాంతాలు తప్ప, ఇతర అన్ని మండల ప్రధాన కార్యాలయ ప్రాంతాల్లో చేపడతారు. ఒక మండలంలో అదనంగా మరో గ్రామాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రితో సంప్రదించి ఎంపిక చేయవచ్చు. ఆ గ్రామ జనాభా 2,500 - 3,000 మధ్య ఉండాలి.
రెండవ దశ: దీనిలో మొదట చేపట్టని 5 - 10 గ్రామాలను ఎంపిక చేస్తారు.
మూడవ దశ: ఈ దశను పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపచేస్తారు.
ప్రాజెక్టుల ఎంపిక: ఎట్టి పరిస్ధితిలోనూ ఒకే గ్రామానికి పదికి మించి యువజన సంఘాలు ఉండరాదు. సంఘం ఏర్పడ్డాక గుర్తింపు నిమిత్తం జిల్లా యువజన సంక్షేమ అధికారికి, మండల యువజన ఎంపవర్‌మెంటు ఆఫీసరు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామానికి చెందిన స్వాభావిక పరిస్థితులు, సాంఘిక - ఆర్ధిక స్ధితిగతులు, స్ధలాకృతిని బట్టి ప్రాజెక్టును ఎంపిక చేసుకోవాలి. యువజన సంఘానికి సేవింగ్స్ బ్యాంక్ అక్కౌంట్ ఉండాలి. బ్యాంకులో వేసే డిపాజిట్లు, విత్‌డ్రాయల్సు, సమావేశపు తీర్మానాల ద్వారా మాత్రమే చేయాలి.

ఆర్ధిక సహాయం వివరాలు:
యువజన సంఘం సభ్యులు గ్రూప్ సేవింగ్స్ ద్వారా 15,000 రూపాయలు జమ చేయాలి. దానికి మ్యాచింగ్ గ్రాంట్‌గా 15,000 రూపాయలు లభిస్తాయి. యువజన సంఘానికి గ్రూప్ లోన్ సబ్సిడీగా 50,000 రూపాయలను సమకూర్చుతుంది ప్రభుత్వం. ఇదే కాకుండా, ఎస్.సి./ ఎస్.టి./బి.సి./ మైనారిటీలు / వికలాంగులు / మహిళలకు "మార్జిన్ మనీ"గా మరో 20 వేల రూపాయలు అందిస్తుంది. ఈ వర్గాలకు చెందని ఇతర యువజన సంఘాలకు యువజన సంక్షేమ శాఖ ద్వారా 20,000 రూపాయల మార్జిన్ మనీ లభిస్తుంది.
ఆర్ధిక వనరులుS.C./S.T./B.C./Min/P.H./Ladiesఇతర యువజన సంఘాలు
1. గ్రూప్ సేవింగ్స్2. మ్యాచింగ్ గ్రాంట్
3. గ్రూప్‌లోన్ సబ్సిడీ
4. మార్జిన్ మనీ
5. యువజన సంక్షేమ శాఖ మార్జిన్ మనీ
 రూ. 15,000-00
రూ. 15,000-00
రూ. 50,000-00
రూ. 20,000-00
పరిస్థితిని బట్టి మారును
రూ. 15,000-00
రూ. 15,000-00
రూ. 50,000-00
పరిస్థితిని బట్టి మారును
 రూ. 20,000-00

శిక్షణ: అవసరమైన శిక్షణను మండలం, జిల్లా స్ధాయిలో ఒక మాస్టర్ క్రాప్ట్స్మెమెన్ ద్వారా గానీ, ఏదైనా సంస్థ ద్వారా కానీ ట్రైసెం కింద ఇప్పించబడుతుంది.
ప్రాజెక్టుల మంజూరు: మండల యువజన ఎంపవర్‌మెంటు ఆఫీసరు దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి మంజూరు సంఘానికి దాఖలుపరుస్తారు. ఈ సంఘంలో జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. ఇంకా పి.డి., డి.ఆర్.డి.ఏ., ఇ.డి., డి.ఎస్. బి.సి. / మైనారిటీలు / మహిళలు, జి.ఎం., డి.ఐ.సి., జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేతృత్వం వహించే బ్యాంకు మేనేజరు, స్థానిక పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సి.ఎం.ఇ.వై.లో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు:
1.విత్తన ఉత్పత్తి: మార్కెటింగ్ 2. పండ్లతోటల పెంపకం - ఉత్పత్తి 3. పండ్ల చెట్ల ప్రూనింగు, అందులో శిక్షణ 4. తోటపని పువ్వుల పెంపకం 5. పుట్టగొడుగుల ఉత్పత్తి 6. మంచినీటి కొలనులు, చెరువుల్లో చేపల పెంపెకం 7. చేపపిల్లల ఉత్పత్తి పెంపకం 8. ఉప్పునీటి కయ్యల్లో చేపలు, రొయ్యల పెంపకం 9. చేపల, రోయ్య పిల్లల సేకరణ 10. తేనె తయారీ 11. వైద్య ప్రయోజనాల నిమిత్తం ఓషధి మూలికలు, మొక్కల సాగు 12. కోళ్ళ పెంపకం 13. పందుల పెంపకం 14. గొర్రెలు, మేకల పెంపకం 15. వ్యవసాయం 16. చిన్నతరహా సాగునీటి పధకం 17. భూమి కొనుగోలు

రెండవ ప్రాధాన్యత రంగాలు:
1. అగ్గిపెట్టెల తయారీ 2. బాణాసంచా తయారీ 3. అగర్ఒత్తుల తయారీ 4. వంట నూనెలు కాని తైలాల తయారీ 5. సబ్బుల పరిశ్రమ 6. చర్మ ఉత్పత్తుల పరిశ్రమ 7. గ్రామీణ కుమ్మరి పరిశ్రమ 8. గానుగనూనె పరిశ్రమ 9. చేతితో చేసిన కాగితం 10. చెరకు బెల్లం తయారీ 11. తాటిబెల్లం, ఇతర తాటి ఆధార ఉత్పత్తుల తయారీ 12. అటవీ ఉత్పత్తుల నుండి ఇతర పదార్ధాల తయారీ 13. పప్పు, తృణ ధాన్యాల ప్రాసెసింగ్ 14. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, పరిరక్షణ క్యానింగ్ 15. రొట్టెలు, మిఠాయిల తయారీ 16. తేనె ప్రాసెసింగ్ 17. చేతి వృతులు 18. సున్నపు ఉత్పత్తుల పరిశ్రమ 19. వెదురు, పేముపరిశ్రమ 20. అల్యూమినియంతో గృహోపకర పాత్రలు తయారీ 21. పట్టు పరిశ్రమ.

ఇవే కాకుండా పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమలు, నిర్మాణాలు, రవాణా, చిల్లర వర్తకం, బ్యాంకింగ్, బీమాంశాలకు చెందిన ప్రాజెక్టులను కూడా మంజూరుచేస్తారు. పైన చూపిన జాబితా ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక రంగాల ప్రాజెక్టులను సాధించుకోవచ్చును.

మరిన్ని వివరాలకు:స్పెషల్ కమీషనర్, యువజన సంక్షేమ సర్వీసెస్, బోట్స్ క్లబ్, సికింద్రాబాద్
3.స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణా కార్యక్రమం(ట్రైసం)
ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అనే జాతీయ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ స్కీమ్‌.
ఆదాయం : వార్షిక ఆదాయం 3,500 రూపాయల కన్నా తక్కువ ఉండాలి.
వయసు : 13-35 సంవత్సరాల మధ్యవారై ఉండాలి.
విద్యార్హత : కనీసం పదవ తరగతి చదివి ఉండాలి.

స్థానిక సర్వీసింగ్ యూనిట్‌లు, పారిశ్రామీక యూనిట్‌ల ద్వారానూ, వృత్తి పనివారు, నైపుణ్యం గల వారితోనూ శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ కాలంలో స్టైఫండ్, అనంతరం టూల్‌కిట్‌ను అందజేస్తారు. చదువురాని వారికి సైకిల్ రిపేర్, పాదరక్షల తయారీ లాంటివి నేర్పిస్తారు. కనీసం 10వ తరగతి చదివిన అభ్యర్హులకు రేడియో టెక్నాలజీ, ఎయిర్ కండిషనింగ్, ఫిట్లర్, ఫ్లంబర్, మోటార్ మెకానిజం, మోటార్ రీవైండింగ్, ముద్రణ లాంటివి ఎన్నో కోర్సుల్లో శిక్షణనిచ్చి, సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తారు. పరిశ్రమను బట్టి ఋణం మంజూరవుతుంది.

కూల్‌డ్రింక్స్ షాపుకు 9 వేలు, చిన్న బట్టల దుకాణం 10వేలు, పుస్తకాల షాపు 10వేలు, నోట్‌బుక్ తయారీ 6 వేలు, తేనెటీగల పెంపకం 6 వేలు, సైకిల్ షాపు 8 వేలు, లాండ్రీ షాపు 3 వేలు ఇలా ఋణం మంజూరవుతుంది. యూనిట్ విలువలో మూడో వంతు సబ్సిడీ లభిస్తుంది.

మరిన్ని వివరాలకు: సంబంధిత మండల కార్యాలయం.

4.నెహ్రూ రోజ్‌గార్ యోజన
ఈ పధకం ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 11,800 లు మాత్రమే ఉండాలి. అలాంటి కుటుంబ సభ్యునికే ఇది వర్తిస్తుంది. దీనిలో టి.వి. మెకానిజం, రేడియో మెకానిజం, రిఫ్రిజిరేషన్ కోర్సుల్లో, ఇంకా అనేక కోర్సుల్లో శిక్షణనిస్తారు. ఇవే కాక డ్రై క్లీనింగ్, లాండ్రీ, రెడీమెడ్ గార్మెంట్స్, బుక్ బైండింగ్, వెల్డింగ్ వర్క్ మొదలైన వాటికి సంబంధిత బ్యాంకులు ఋణాన్ని అందిస్తాయి. అభ్యర్ధి 3 సంవత్సరాలు ఒకేచోట నివాసం ఉండాలి. తమ ఆదాయాన్ని రూఢీపరుస్తూ తెల్ల రేషను కార్డు ప్రతిని అధికారులకు అందించాలి.

ఈ పధకం క్రింద లబ్ది పొందగోరు వ్యక్తి ఏ బ్యాంకుకు గానీ, సంస్ధకు గానీ బకాయి ఉండరాదు. అంతకు ముందు రుణం పొంది ఉండరాదు. బ్యాంకు వారు ఇచ్చే ఋణంలో 25% సబ్సిడీ లభిస్తుంది. స్త్రీలకు, ఎస్.సి., ఎస్.టి.లకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు.


5.ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం):
(సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకం)
ఈ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. గ్రామసభ, సర్పంచ్, సమితిస్థాయి అధికారుల సహాయంతో కుటుంబాలను ఎంపిక చేసి ఋణం అందజేస్తారు. జాతీయ బ్యాంకులు ఇచ్చే ఋణాలతో మూడింట ఒక వంతు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలకు ఈ ఋణాన్ని వినియోగించవచ్చు. ఈ పధకానికి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ఆర్ధిక సహకారం అందించేలా ' రీఫైనాన్స్ ' అనే కొత్త పధకం ప్రారంభించారు. దీని వల్ల వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్న గ్రామీణులు వస్తువును ఉత్పత్తి చేయడమే కాక, దీని పంపిణీని సైతం సులభంగా చేపడుతున్నారు.

ఐ.ఆర్.డి.పి. పధకంలో లభించిన ఋణంతో వ్యవసాయం, పశుసంవర్ధనకు చెందిన పనులు చేసుకోవచ్చు. పంపుసెట్లు, పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు కొనుగోలు చేయవచ్చు. పశుసంవర్ధన ఆధారంగా పాలు, పాల ఉత్పత్తుల అమ్మకం, గ్రుడ్లు, మాంసం వంటివి పరిశ్రమలుగా అభివృద్ధి చేయవచ్చు. ఇవే కాక మరెన్నో కుటీర పరిశ్రమలను నెలకొల్పవచ్చు. ముఖ్యంగా ఈ ఐ.ఆర్.డి.పి. పధకం మహిళల పాలిట ఆశాకిరణంగా చెప్పవచ్చును. ఈ పధకం క్రింద ౠణాన్ని పొందగోరే వారు తమ గ్రామ సర్పంచ్ లేదా సమితిస్ధాయి అధికారులను కలవాలి.

మరిన్ని వివరాలకు:సంబంధిత మండల కార్యాలయంలో సంప్రదించాలి.

Wednesday 25 March 2015

ఇంటివైద్యం -- పల్లేరు

ఇంటివైద్యం -- పల్లేరు

పల్లేరు చెట్టు వేర్లు, ఆముదం చెట్టు వేర్లు, పెద్ద ములక వేర్లు, చిన్నములక వేర్లు వీటిని సమంగా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి 30 గ్రాముల యవకుట చూర్ణాన్ని 1 కప్పు పాలకు కలిపి 1 కప్పు నీళ్లు చేర్చి, పాలు మాత్రమే మిగిలేంత వరకూ మరిగించి తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల్లోని రాళ్లు పడిపోతాయి. (చరకసంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని తేనెతోనూ, మేకపాలతోనూ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి. (సుశృత సంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని స్వర్ణమాక్షీక భస్మాన్ని గేదె పాలతో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగి పడిపోతాయి. (హారీత సంహిత)
ఒక కప్పు పాలకు 5 గ్రా. ద్రాక్ష పండ్లను, 5 గ్రా. పల్లేరు కాయలను వేసి మరిగించి, 3 గ్రాముల శతావరి వేరు చూర్ణాన్ని కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలోపల జరిగే రక్తస్రావాలు తగ్గుతాయి. (వృందమాధవ)
శతావరి వేరు చూర్ణాన్ని, పల్లేరు కాయలను పాలకు కలిపి మరిగించి, వడపోసి తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం అనే సమస్య తగ్గుతుంది. (చరక సంహిత)
పల్లేరు కాయలను, కంటకారి మొక్కను బెల్లంతో కలిపి పాయసంలాగా చేసుకొని తీసుకుంటే మూత్ర విసర్జనలో నొప్పి తగ్గుతుంది. (చరక సంహిత, అష్టాంగ సంగ్రహం)
పల్లేరు కాయల కషాయం, బెల్లం, పాలు, శొంఠి, వీటిని 4 రెట్లు నువ్వుల నూనెతో కలిపి, 16 రెట్లు నీళ్లు చేర్చి తైలం మాత్రమే మిగిలేంత వరకూ మరిగించి, చల్లార్చి వడపోసి కడుపు లోపలకు, వస్తికర్మల రూపంలోనూ తీసుకుంటే మూత్రంలో నొప్పి తగ్గుతుంది. (సుశృత సంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని యవక్షారంతో కలిపి తీసుకుంటే మూత్రంలో నొప్పి, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గుతాయి. (వృంద మాధవ, భావప్రకాశ)
పల్లేరు కాయల కషాయాన్ని తేనె, పంచదారతో కలిపి తీసుకుంటే మూత్రాశయ దోషాలు తగ్గుతాయి. (వంగసేన సంహిత)
పల్లేరు కాయలను పాలతోనూ, ఆముదం వేర్లతోనూ, శతావరి వేర్లతోనూ కలిపి పాలు, బెల్లం చేర్చి తీసుకుంటే మూత్రంలో నొప్పి తగ్గుతుంది. (వృంద మాధవ)
పల్లేరు మొక్క కషాయాన్ని పంచదార, తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల మూత్ర సంబంధ సమస్యలూ తగ్గుతాయి. (శారంగధర సంహిత, భావప్రకాశ)
పల్లేరు, ఉలిమిరిచెక్క, శొంఠి వీటి మిశ్రమంతో కషాయం తయారుచేసుకొని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గుతాయి. (్భవప్రకాశ)
పల్లేరు కాయల పేస్టును కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకుంటే మూత్ర వ్యవస్థలో నొప్పి తగ్గుతుంది. (వేద్యమనోరమ)
పల్లేరు కాయలను నువ్వు పువ్వులను సమంగా తీసుకొని తేనె, నెయ్యితో కలిపి పేస్టులాగ చేసి తలకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. (శారంగధర సంహిత)
పల్లేరు కాయల చూర్ణం, ఉసిరి చూర్ణం, తిప్పతీగ చూర్ణం వీటిని నెయ్యి, తేనెతో కలిపి తీసుకుంటే రసాది దాతువులను శక్తివంతం అవుతాయి. (అష్టాంగ హృదయం)
పల్లేరు కాయలు, చెరకు, శతావరి, దూలగొండి గింజలు, నాగబల, అతిబల వీటి చూర్ణాలను పాలతో కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది. (వృందమాధవ)
పల్లేరును పాలతో కలిపి ఉడికించి తీసుకుంటే ముసలితనంలో కూడా యవ్వనపు శక్తి వస్తుంది. (గద నిగ్రహం)
పల్లేరు కాయలను శొంఠిని నీళ్లకు వేసి మరిగించి క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ఆమవాతం, వాపులతో కూడిన కీళ్లనొప్పి తగ్గుతాయి. (చక్రదత్త)
*
పి.రమేష్ (సూర్యాపేట)
ప్రశ్న: స్వయంతృప్తి మంచిదేనని డాక్టర్లు చెబుతున్నారు. హోమోసెక్స్‌ని కూడా అలాగే భావించవచ్చా? ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో హోమోసెక్స్ అనేది కూడా సెక్సువల్ ఇన్‌స్టింక్స్ట్‌లో ఒక భాగమేనని, దీనిలో అసహజమేదీ లేదనీ రాశారు. ఆయుర్వేదంలో దీనిని గురించి ఏదన్నా వివరణ ఉందా?
జ: కొంతమంది డాక్టర్లు స్వయంతృప్తి (హస్తప్రయోగం) వల్ల హాని లేదని చెప్పటానికి కారణం వేరే ప్రత్యామ్నాయం లేకపోవటమే. ఈ సృష్టిని గమనించినపుడు లైంగికపరమైన కలయిక పరమావధి సంతాన జనకం కోసమేనని తెలుస్తుంది. దాంపత్య జీవనం గురించి ఆయుర్వేద వైద్యశాస్తప్రు అభిప్రాయం కూడా అదే. అందుకే సంహితా గ్రంథాలు స్వయంతృప్తిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ప్రొక్రియేషన్ (సంతానోత్పత్తి) సృష్టి ధర్మం. అది సజావుగా జరగటం కోసం రిక్రియేషన్ అనేది బైప్రొడక్ట్‌గా ఉంటుంది. ఇదంతా స్ర్తి పురుషుల సమాగంతో జరుగుతుంది గాని స్వయంతృప్తితో కాదు.
చాలాకాలం నుంచి వైద్య వర్గాల్లో హస్తప్రయోగం గురించి, దానిలోని శాస్ర్తియత గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గతంలో స్ర్తిల తాలూకు హిస్టీరియా, మానియా వంటి మనో సంబంధ వ్యాధులకు కారణం వారు అనారోగ్య ధోరణుల్లో చేసుకునే స్వయంతృప్తేనని భావించేవారు. అందుకే స్ర్తిలకు క్లిటోరిస్‌ను తొలగించే ‘క్లైటోరిడెక్టమీ’ని, పురుషులలో వృషణాలను తొలగించే ‘క్యాస్ట్రేషన్’నూ చేసేవారు.
ఐతే, ఇటీవలి కాలంలో, ఇతర లైంగిక దురాచారాలతో పోలిస్తే హస్తప్రయోగం లేదా మాస్టర్ బేషన్‌ని హానిలేని ప్రక్రియగా కొంతమంది డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. దీని అర్థం రోజంతా హస్తప్రయోగంతో గడపమని కాదు. ఆయుర్వేదం దీనికో చక్కని ఉదాహరణ నిస్తుంది. మలం, మూత్రం, స్వేదం వంటివి మలాలు. ఇవి శరీరానికి అవసరం లేనివి. విసర్జింపబడాల్సినవి. అలా అని ఇవి విరేచనాలు, అతిమూత్రం, అతి స్వేదం వంటి వాటి ద్వారా ఎక్కువగా విసర్జింపబడితే ఏం జరుగుతుందో తెలిసిందే. హస్తప్రయోగం కూడా అంతే. హద్దుమీరితే దానిని మానసిక రుగ్మతగా భావించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఇహ, హోమోసెక్స్ విషయానికి వస్తే - యుక్త వయసు వచ్చిన తరువాత శరీరం, మనసు లైంగికావసరాల కోసం పరితపించడం సహజం. ఐతే, దానిని తీర్చుకోవడం కోసం అసహజమైన దారులను వెదుక్కోవటం మంచిది కాదు. హోమోసెక్స్ కూడా అంతే. ఇది పూర్తిగా అసహజమైనది. కాబట్టి అసహజమైన లైంగిక ప్రవర్తనలు - హోమోసెక్సువలిజం, వాయిరిజం, ట్రాన్స్‌వేస్టిజం వంటి వాటి జోలికి పోకుండా మనసును ఇతర వ్యాపకాలు - ఆటలు, లలిత కళలు, చదువు, కవిత్వం, రచనా వ్యాసంగం వంటి వాటి మీదకు మళ్లించటం మంచిది.
*
మీ సమస్యలు, సందేహాలు పంపించాల్సిన చిరునామా:
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, యూసఫ్‌గుడ, మెయన్ రోడ్,
అమీర్‌పేట, హైదరాబాద్.
ఫోన్ నెం. 924 657 5510

మూత్రపిండాల్లో రాళ్ళు , Kidney Stones

మూత్రపిండాల్లో రాళ్ళు , Kidney Stones





ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంతకాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం.

  • మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరిక్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ అంతా పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.

ఈ మధ్య మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటిశాతం తగ్గి, లవణాల గాఢత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండడటమే.

  • మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మూత్రపిండాలు శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి, శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గకుండా చూస్తు జీవక్రియ నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి.

  • కారణాలు :
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మూత్రవయావాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌. నీరు తగినంత తాగకపోవడం. ఆహారపు అలవాట్లు. కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు.

  • రాళ్లలో రకాలు :
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో కొన్ని ప్రధాన రకాలు కాల్షియం ఆగ్జలేట్స్‌, కాల్షియం ఫాస్పేట్‌, సిలికాన్‌ స్టోన్స్‌, యూరిక్‌ యాసిడ్‌ స్టోన్స్‌. మూత్రపిండాల్లో రాళ్లను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే యూరినరీ ట్రాక్ట్‌లో ఆటంకం ఏర్పడి మూత్రవ్యవస్థ సమస్యలు తీవ్రం అవుతాయి.

  • మూత్రంలోని లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్ళు మూత్రప్రవాహాన్ని అడ్డగించినపుడు ఇన్‌ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలే కాకుండా మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా చోటుచేసుకోవచ్చు. జనాభాలో 4-8 శాతం మంది వ్యక్తులు మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నారని అంచనా. దీనిని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య స్ర్తి పురుషుల్లో ఒకే మాదిరిగా కాకుండా కొద్దిపాటి తేడాలతో వ్యక్తమవుతుంది. ఉదాహరణకు పురుషుల విషయానికి వస్తే ప్రతి పదిమందిలోనూ ఒకరికి రాళ్లు వస్తాయి. అదే మహిళల్లో అయితే ప్రతి 35 మందిలోనూ ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

మూత్రమార్గం అనేది మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం, మూత్రప్రసేకం(urethra) తదితర భాగాలతో నిర్మితమవుతుంది. మూత్రపిండాలు రక్తంలోని అదనపు నీటిని, వ్యర్థాలను వడపోస్తాయి. అంతేకాకుండా రక్తంలో ఉండే లవణాలకు, ఇతర పదార్థాలకు మధ్య సమతుల్యతను మూత్రపిండాలు కాపాడతాయి. మూత్రపిండాల్లో తయారైన మూత్రాన్ని కిడ్నీలనుంచి బయల్దేరే మూత్రనాళాలు మూత్రకోశానికి చేరవేస్తాయి. మూత్రకోశం అనేది ఒక తిత్తివంటి నిర్మాణం. వ్యాకోచం చెందటం ద్వారా మూత్రాన్ని విసర్జన సమయం వరకూ నిల్వ చేస్తుంది. మూత్రకోశం పూర్తిస్థాయి సామర్థ్యం వరకూ నిండిన తరువాత నాడీ సంకేతాలను అనుసరించి మూత్రప్రసేకం తెరుచుకొని మూత్రాన్ని వెలుపలకు పంపిస్తుంది.

  • మూత్రంలో సహజంగా ఉండే కొన్ని రకాల జీవరసాయన పదార్థాలవల్ల రాళ్లు తయారవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే ప్రక్రియను వైద్య పరిభాషలో ‘యూరోలిథియాసిస్’ అంటారు. మూత్రపిండాల్లో తయారైన రాళ్లు, చిన్న ఆకృతిలో ఉంటే మూత్రప్రవాహం ద్వారా వెలుపలకు మూత్రంతో సహా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటి ఆకారం పెద్దగా తయారైతే మూత్రమార్గాన్ని అడ్డగించి తదనుగుణమైన సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల పరిమాణం నుంచి పెద్ద రేగు కాయంత పరిమాణం వరకూ తయారయ్యే అవకాశం ఉంది. ఇవి చూడ్డానికి నునుపుగాగాని లేక గగ్గురుగా గాని ఉండవచ్చు. సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. ఈ రాళ్లు ప్రాథమికంగా మూత్రపిండాల్లో తయారవుతాయి. అయితే తయారీ తరువాత స్వస్థానంలోనే కాకుండా మూత్రమార్గంలోని ఇతర ప్రదేశాల్లో కూడా పెరగవచ్చు.


పరీక్షలు

  • 1. అల్ట్రాసౌండు - కడుపు పరీక్షలు
  • 2. ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)
  • 3. ‘X’ రే కడుపు మూత్రనాళము - మూత్రాశయ భాగాలు (కె.ము.బి)
  • 4. యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు
  • 5. మూత్ర పరీక్షలు

ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును.

  • నివారణ
రోజుకు 8-13 గ్లాసుల నీళ్లు తాగాలి.
కాల్షియం, ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్‌క్రీమ్, విటమిన్ సి కలిగిన పండ్లు, పెరుగు, టమటా, కమలాపండ్లను మానేయటం గాని బాగా తగ్గించటం గాని చేయాలి.
ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి.
ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి.
విటమిన్-సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యధేచ్చగా తీసుకోవద్దు.
మద్యం అలవాటు ఉంటే మానేయాలి.

  • గృహ చికిత్సలు
*పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
*పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి
*కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
*దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
*పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి
*కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది
*దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి
*చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి


  • చికిత్స

1. మూత్రపిండాలలో రాయి సైజు 5 mm లోపు వుందని నిర్దారించినపుడు, సాధారణంగా మూత్రం
ద్వారా వెలుపలకు వస్తుంది

  • 2.శస్త్రచికిత్స :
కొన్ని మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం. మూత్రకోశ వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్స చేయించుకుని, రాళ్ళను తొలగించుకోవాలి. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల పాటు ఆస్పత్రిలో వుండాలి. ఆరు నుండి పన్నెండు వారాల విశ్రాంతి అవసరం. తరువాత మూత్రపిండంలో రాళ్లు తయారవకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
3. ఐదు (5) mm కన్నా పెద్దగా వున్న రాళ్ళు తనంత తానుగా వెలుపలకు రావు కాబట్టి తప్పని సరిగా లితోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయవలసిన అవసరం ఉంటుంది
4. యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, లితోక్లాస్ట్, లేజర్స్ అనే అధునాతన పద్దతుల ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును

  • ఔషధాలు
నొప్పి తగ్గడానికి :
అవసరాన్ని బట్టి నొప్పితగ్గడానికి ఇంజక్షన్లు , మాత్రలు తీసుకోవాలి . Tramadal , Fortwin , Morphin -injections ... , Urispas , Drotin-M , colinol-M మున్నగు Tablets వాడ వచ్చును .
దీర్ఘకాలము ఉన్న ప్రోబ్లం అయితే ..
Cystone 2 tabs 3 times daily for 4-6 weeks ,
Urispas 1 tab 3 times daily for 2-3 weeks
Alakaline citrate liquid 5ml in 30 ml water 3 times /day


కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స లేకుండా తొలగించడమెలా?
  • ఇఎస్‌డబ్ల్యుఎల్‌ : ఇది జర్మనీ రూపొందించిన యంత్రం. దీని ద్వారా రోగిని ఒక నీటితొట్టిలో పడుకోబెడ్తారు. మూత్రపిండంలోని రాళ్ల వద్దకు తరంగ ఘాతములును పంపడం ద్వారా బాగా చిన్న చిన్న రాళ్లుగా మార్చవచ్చును. మూత్రం ఎక్కువగా వచ్చే మందులు వాడినవాటిని మూత్రము ద్వారా బయటకు పంపవచ్చు. దీనికి మూడు రోజులు పడుతుంది. ఇలా కత్తితో పనిలేకుండా మూత్రపిండంలోని రాళ్లను తొలగించుకోవచ్చు.

మూత్రపిండంలో చేరిన రాళ్ళలో ఏ ఒకటికో చికిత్స అవసరమొస్తుంది. మిగతావి కరిగిపోవడమో, మూత్రం ద్వారా బయటకు రావటమో జరుగుతుంది. ఇవి రీనెల్‌ మార్గంలో పెద్దవిగా లేదా వికృతంగా ఏర్పడ్డ రాళ్ళ వల్లనే ప్రమాదానికి లోనవడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కలిగే నొప్పిని సర్జికల్‌ పుస్తకాల్లో లోయిన్‌- టు- గ్రోయిన్‌ అని పేర్కొన్నారు. కొంతమంది యూరాలజిస్టులు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను విద్యుదయస్కాంత తరంగాలను ప్రయోగించి రాళ్ళను ఇసుకంత పరిమాణం ఉన్న చిన్న కణాలుగా చేస్తుంటారు. దీనిని ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్సీ అని అంటారు. కేవలం 3 రోజుల్లో ఈ పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్ళను తొలగిం చుకోవడం జరుగుతుంది. డయాబెటిస్‌, బి.పి., గుండెజబ్బులున్న ఎవరైనా ఈ పద్ధతి ద్వారా సులువుగా కిడ్నీలోని రాళ్ళను తొలగించుకోవచ్చు.

  • కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను పగలగొట్టేందుకు మరోపద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబును కిడ్నీలోనికి లోతుగా పంపి దాని మొనభాగాన్ని అతి వేగంగా త్రిప్పుతారు. దాని నుండి అతి ధ్వని ప్రకంపనాలు వెలువడతాయి. దీనివల్ల రాళ్ళు చిన్నముక్కలుగా పగిలిపోతాయి. వాటిని ఆపరేషన్‌ ద్వారా తీస్తారు. దీనినే 'పర్క్యుటేనియస్‌ సెప్రోలిథోటోనమి' అని అంటారు. ఈ చికిత్సలో రోగి శరీరానికి గాటుపెట్టడం జరుగుతుంది. అప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం. ఈ చికిత్స చేయించుకుంటున్న రోగిని పట్టుకునేందుకు కనీసం ఇద్దరు వ్యక్తులకైనా అవసరమొస్తుంది. ఈ కష్టమైన చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ద్వారా చేస్తూ విద్యుదయస్కాంత తరంగా లను కావలసిన చోటికి పంపుతారు. టాన్యుడ్యూజర్‌ ద్వారా సుమారు నూరు స్పందనాలను ఒక్కసారిగా రోగిలోనికి పంప బడతాయి. తరంగాలు ఒకదాని వెనుక ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు 100 పీడనాల వత్తిడి కిడ్నీలో రాళ్ళున్న ప్రాంతంపై కలుగుతుంది. దానివల్ల కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్ళుబ్రద్ధలై చిన్నముక్కలవుతాయి. కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్‌టర్‌ పద్ధతి వల్ల ప్రయో జనం పొందారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు.

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

phototake_rm_photo_of_kidney_stone_destruction
మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర విసర్జనలో అవరోధం, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వంటి సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. నీళ్లు తక్కువగా తాగేవారిలో, చెమటలు అధికంగా పోసేవారిలో రక్తంలో లవణాల సాంద్రత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య సాధారణంగా 30 ఏళ్లపైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీలలోకంటే పురుషుల్లో మూడు రెట్లు అధికం. వైద్య పరిభాషలో ఈ రాళ్లను ‘రీనల్‌ కాల్సిక్‌’ అంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో మూత్రనాళంలోగానీ, మూత్రాశయంలోగానీ ఏర్పడవచ్చు.
కారణాలు
రక్తంలో కాల్షియం, ఫాస్పరస్‌, యూరిక్‌ యాసిడ్‌ లవణాలు, అధికంగా ఉండటంవల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. శరీరానికి సరిపోను నీళ్లు తాగకపోవడం, తాగిన నీరు కూడా ఎక్కువగా చెమట రూపంలో బయటకు వెళ్లడం, లవణాల శాతం అధికం అవడం కూడా సమస్యకు దారితీస్తుంది. ఇలాంటప్పుడు సాంద్రత పెరిగి అవి క్రిస్టల్స్‌గా మారి రాళ్లుగా మారతాయి. ఇవి కిడ్నీలో లోపలి భాగంలో నిల్వ ఉంటాయి. మనం తినే ఆహారంలోని రాళ్లకు, కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదు.
రాళ్ల రకాలు
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు ఐదు రకాలుగా ఉంటాయి. కాల్షియం ఆక్సలైట్‌ రాళ్లు, కాల్షియం ఫాస్పేట్‌ రాళ్లు, యూరేట్‌ రాళ్లు, ట్రిపుల్‌ ఫాస్ఫేట్‌ రాళ్లు. సిస్టిన్‌ రాళ్లు. ఈ రాళ్లు చిన్న గింజ సైజు మొదలుకొని, చిన్న పండు సైజు దాకా ఏర్పడవచ్చు. ఇవి కిడ్నీలోగానీ, మూత్రాశయంలోగానీ కదలకుండా ఉంటే బాధకలిగించవు.
ఆక్సిలైట్‌ కాల్షియం రాళ్లు : మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఉండటం, మూత్ర విసర్జనలో అవరోధం ఏర్పడటం, ప్రొస్టేట్‌ గ్రంథి (పురుషుల్లో) పెద్దదైనప్పుడు మంచం మీద చాలా కాలంగా ఉండే వారిలో, శారీరక శ్రమలేని వారిలో, వ్యాయామం లేని వారిలో, బద్ధకంగా ఒకే చోట కూర్చునే వారిలో ఈ రాళ్లు ఏర్పడతాయి.
సిస్టన్‌ రాళ్లు : నీళ్లు తక్కువగా తాగే వారిలో, అతిగా చెమటలు పోసేవారిలో, రక్తంలో లవణాల సాంద్రత పెరిగి ఈ రాళ్లుఏర్పడతాయి. విటమిన్‌-సి, విటమిన్‌-డి అధికంగా తీసుకునే వారిలో, ఎక్కువ గా చెమట పోసే ఉష్ణమండలంలో ఉండే వారిలో, రాళ్లు ఏర్పడే శరీర తత్వం గలవారిలో ఇవి ఏర్పడతాయి.
లక్షణాలు
నడుము పైభాగాన నొప్పి మొదలవుతుంది. పొత్తికడుపు దాకా వ్యాపించి, అక్కడి నుంచి వృషణాల దాకగానీ, పురుషాంగం దాకగానీ వ్యాపిస్తుంది. స్త్రీలలో జననేంద్రియాల దాకా కూడా వ్యాపిస్తుంది. మూత్రపిండం నుండి, మూత్రనాళం ద్వారా మూత్రాశయం వరకు వెళ్లేటప్పుడు అలలు, అలలుగా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. నొప్పితోపాటు వాంతులవుతాయి. చెమటలుపోస్తాయి. మూత్ర విసర్జనలో మంటగా ఉంటుంది. వణుకుతో కూడిన జ్వరం, మూత్రంలో రక్తం, మాటిమాటికీ మూత్రం రావడం వంటివి ప్రధాన లక్షణాలు. చిన్న సైజు రాళ్లు ఏర్పడటానికి నెల, రెండు నెలలు పడితే, పెద్దసైజు రాళ్లకు సంవత్సరాలు పట్టవచ్చు.
నిర్ధారణ: మూత్రపరీక్ష, మూత్రంలో రక్తంలో, చీము, క్రిస్టల్స్‌ కనిపించడం, ఎక్స్‌రే, కె.యు.బి., సి.టి స్కాన్‌, ఎంఆర్‌ఐ ద్వారా నిర్ధారించవచ్చు.
అనర్ధాలు: మూత్రపిండంలో చీము చేరి కిడ్నీలు పాడవుతాయి.
చికిత్స
కిడ్నీరాళ్లు 5 మిల్లీమీటర్ల సైజులో ఉంటే గనుక, ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి బయటికి వెళ్తాయి. 5 నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటే బయటికి వెళ్లడం కష్టం. శస్త్రచికిత్స ద్వారా వీటిని బయటికి తీస్తారు.
శస్త్రచికిత్స
లితోట్రిప్సి, యురిటిరో స్కోపి ద్వారా పర్‌కుటేనియస్‌ నెఫ్రొలిథాటమి ద్వారా, ఎక్స్‌ట్రా కార్పొరియల్‌, షాక్‌వేవ్‌ లిథొట్రిప్సి ద్వారా లేదా ఓపెన్‌ సర్జరీ ద్వారా రాళ్లను తొలగిస్తారు. ఇప్పుడు లేజర్‌ చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు సూచించిన యాంటీ బయాటిక్స్‌ వాడాలి.
జాగ్రత్తలు
రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగాలి.వ్యాయామం అవసరం. కాల్షియం పదార్థాలు పాలు, వెన్న, నెయ్యి, పాల ఉత్పత్తులు, టమాట, పాలకూర, క్యాబేజి వాడకం తగ్గించాలి. కిడ్నీ ఫెయిల్యూర్‌లో పొటాషియం ఎక్కువ ఉంటే కొబ్బరి నీళ్లు తాగకూడదు.

మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే..?

మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే..?


         మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కువగా మంచి నీరు తాగాలి. అలాగే ఇతర ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఎముకలు గుల్లబారినప్పుడు లేదా ఎముకలు విరిగినప్పుడు కాల్షియం మాత్రలను వాడితే, అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి, తరువాత రాళ్లవుతాయి. అలాగే కాల్షియం, ఫాస్పేట్స్‌, ఆక్సిలేట్స్‌, ఇతర రసాయనాలు ఉండే ఆహారాలను తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి తులసి ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చెంచా తులసి ఆకుల రసం, ఒక చెంచా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా కనీసం ఆరు నెలలపాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. ఉలవచారు కూడా మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. దీనిలో బాగా నీళ్లు పోసి ఉడికించాలి. మరిగిన తరువాత పై నీటిని తీసుకుని చారు చేసుకోవాలి. ఇలా ఉలవచారు చేసుకుని రోజూ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

మూత్రపిండాల్లో రాళ్లు పోయేదెలా

మూత్రపిండాల్లో రాళ్లు పోయేదెలా?
ఆయుర్వేద శాస్త్ర రీత్యా మూత్రపిండాల్లో రాళ్ల వ్యాధిని ‘ మూత్రాశ్మరి ’ అంటారు. వాతం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఆ తర్వాత కణాల లోపలి భాగాలపై కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలు పేరుకొని పోయి మూత్రపిండాల్లో రాళ్లుగా పరిణామం చెందుతాయి. మూత్రపిండాల్లోని రాళ్లు కొద్ది కొద్దిగా కరిగి, మూత్రనాళంలోకి దిగి ఇరుకైన సన్నని భాగాల్లో చిక్కుకుపోతాయి. ఇవి ప్రమాదకరం.
వ్యాధిలక్షణాలు- విపరీతమైన నొప్పి వీపు వెనుక వైపు నుంచి కిందికి దిగుతూ గజ్జల్లోకి , జననేంద్రియాల్లోకి పాకుతుంది. అలాంటి సమయంలో జ్వరం, వాంతి, ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, మూత్రం పోసేటపుడు మంట కలుగుతుంది. మూత్రంలో రక్తం కూడా పోయే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో రాళ్లు కిడ్నీలో పూర్తిగా నిండిపోయి కిడ్నీ రాయిలా తయారవుతుంది. కొందరిలో మూత్రపిండాల్లోని రాళ్లు ఏరకమైన ఇబ్బందినీ కలగజేయకున్నా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్యకారణాలు ?
ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే ?
ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువశాతం తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
పెరటి మొక్కల వైద్యం
అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోని పెరటిమొక్కలతో కిడ్నీల్లోని రాళ్లను కరిగించే అవకాశాలున్నాయి. అవేంటో తెల్సుకుందాం.
తులసి రసం
కావాల్సినవి - కొన్ని తులసిఆకులు, తేనె
తయారీ విధానం - ముందుగా తులసి ఆకు రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆర్నెళ్లు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
కొండపిండి కషాయం
కావాల్సినవి- కొండపిండి మూలిక, నీరు
తయారీ విధానం- కొండపిండినే పాషాణభేది అంటారు. ఈ మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటితో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30 మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడుపూటలా తీసుకోవాలి. లేకుంటే కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకు తినటం అలవాటు చేసుకోవాలి. మూడునెలల తర్వాత కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
ఉలవచారు
కావాల్సిన పదార్థాలు - ఉలవలు, ముల్లంగి ఆకులు, నీరు
తయారీ విధానం - ఉలవల్లో ముల్లంగి ఆకులు సన్నగా తరిగి కలిపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారు రోజూ తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
గలిజేరు పులుసు
కావాల్సిన పదార్థాలు - తెల్ల గలిజేరు వేరు, నీరు.
తయారీ విధానం - తెల్ల గలిజేరు వేరును నీటిలో మెత్తగా నూరాలి. ఒక కప్పు నీటిలో ఒక రోజు రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే వడబోసి తర్వాత తాగాలి. దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.
గమనిక- కిడ్నీల్లో రాళ్లు బాగా పెద్దవిగా ఉన్నా, అవి బయటకు రావటం వీలుకాని సందర్భాల్లో ఆయుర్వేద వైద్యులను సంప్రదించటం మంచిది.
డాక్టర్‌ కందమూరి
ఆయుర్విజ్ఞాన కేంద్రం, ఫోన్‌ : 9866482598

టమాట, పాలకూర తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయా?

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని అందరికీ తెలుసు. కానీ మూత్రపిండాల్లోనే కాక మూత్రపిండాల నుంచి వచ్చే రెండు నాళాల్లో, మూత్రనాళంలో కూడా ఏర్పడవచ్చు. మహిళల కన్నా పురుషులే ఎక్కువగా మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడతారు. వీటి గురించి చాలా మందిలో అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా టమాట, పాలకూర కలిపి తింటే రాళ్లు ఏర్పడతాయని చాలా మందిలో ఉన్న అపోహ. ఇవి వాస్తవం కాదు. సాధారణంగా మూత్రపిండాల్లో ఏర్పడే 90 శాతం రాళ్లను (ఐదు నుంచి ఆరు మిల్లీమీటర్లు) పట్టించుకోనవసరం లేదు. ఇవి వాటంతటవే మూత్రంలోనే వెళ్లిపోతాయి. సరిపడినన్ని నీళ్లను తాగితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు.
లక్షణాలు ఏమిటి?
మూత్రపిండాల్లో రాళ్లు చేరిన వాళ్లందరికి లక్షణాలు ఒకేలా ఉండవు. రాళ్లు ఏర్పడే భాగాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స విధానం కూడా రాళ్ల సైజు, భాగాన్ని బట్టి ఉంటుంది. మూత్రనాళంలో రాళ్లు అడ్డంపడితే కిడ్నీ నుంచి వచ్చే మూత్రం కిందకు సులువుగా జారదు. దీంతో మూత్రపిండంపై ఒత్తిడి పెరిగి కిడ్నీ దెబ్బతినే అవకాశముంది. మూత్రపిండంలోనూ రాళ్లు ఉంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. కిడ్నీ నుంచి వచ్చే నాళంలో రాళ్లు ఉంటే కిడ్నీ, ఆ నాళంలో వాపు వచ్చే అవకాశముంది. కిడ్నీలు, నాళంలో రాళ్లు ఉంటే కడుపుపైభాగంలో నొప్పి, చలితో జ్వరం, మూత్రంలో రక్తం, వాంతులు, అకస్మాత్తుగా నొప్పిరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా రోజులు కిడ్నీలో రాళ్లు ఉంటే కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశముంది. చాలా వరకు మూత్రపిండాల్లో తయారైన రాళ్లు మూత్రాశయంలో పడి క్రమంగా ఇవి పెరుగుతాయి. మూత్రాశయంలో రాళ్లు ఉంటే మూత్రవిసర్జనలో మంట, రక్తం రావడం, తరచుగా మూత్రం రావడం జరుగుతాయి. మూత్రనాళంలో రాళ్లు అడ్డంపడితే మూత్రవిసర్జన ఇబ్బందిగా ఉండి, మూత్రం ఆగి చాలా అవస్థలు పడతారు. మూత్రనాళంలో రాళ్లు తయారయ్యే అవకాశాలు తక్కువ.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కచ్చితమైన కారణం లేదు. శరీర తత్వం, జన్యుపరమైన కారణాలు, మన అలవాట్లలో మార్పులు వల్ల ఇవి తయారవుతాయి.మూత్రంలో రాళ్లు తయారవడానికి ప్రధాన కారణం లవణాలు. అవి కాల్షియం, యూరిక్‌యాసిడ్‌, ఆక్సలేట్స్‌. ఇవి అందరిలో ఉంటాయి. మూత్రం శాతం తగ్గడం వల్ల, లేదా అవసరమైనంత మూత్రం ఉన్నా లవణాల సాంధ్రత పెరిగి క్రిస్టలైజేషన్‌ వల్ల రాళ్లుగా మారే అవకాశముంది. రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం నీళ్లను తక్కువ తాగడమే. రోజుకు రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల మూత్రం వస్తే వారిలోని లవణాలు స్పటికాలుగా ఏర్పడడం తక్కువ. ముఖ్యంగా మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్లలో యూరిక్‌ యాసిడ్‌, కొన్ని కారణాల వల్ల కాల్షియం సప్లిమెంట్స్‌ అధికంగా తీసుకుంటారు. వీళ్లలో రాళ్లు ఏర్పడే అవకాశముంది.
ఏం మానెయ్యాలి?
టమాట, పాలకూర తింటే రాళ్లు ఏర్పడతాయనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. వైద్యశాస్త్రంలో టమాట వల్ల రాళ్లు ఏర్పడతాయన్న విషయం గురించి ఎక్కడే పేర్కొనలేదు. ఏ ఆకుకూరలోనైనా ఆక్సలేట్స్‌ ఉంటాయి. వీటిని కలిపిగానీ, విడిగా కాని తినడం వల్ల రాళ్లు ఏర్పడవు. అందరూ ఒకే రకమైన భోజనం చేస్తున్నా కొందరిలో మాత్రమే మూత్రపిండాల్లోనే రాళ్లు ఏర్పడతాయి. జన్యుపరమైన కారణాల్లో శరీరంలో కంటికి కనపడని కొన్ని లోపాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే అవకాశముంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడమనేది చాలా అరుదు. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం ఎక్కువ. ఎందుకంటే చలి కాలం చాలా చల్లగా ఉంటుంది, ఎండ కాలం చాలా ఎండగా ఉంటుంది. ఈ వాతావరణాలకు సర్దుకోవడానికి వీరికి చాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయి.
నివారణ:
కొత్తిమీర రసం తో కిడ్నీ లో రాళ్ళను కరిగించవచ్చు. ఒక కట్ట కొత్తిమీర తీసుకుని దానిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని నీటిలో వేసి ఓ పది నిముషాలు బాగా మరగనివ్వాలి. తరువాత ఆ నీటిని చల్లర్చి కొంత సేపు రిఫ్రిజిరేటర్ లో పెట్టి ఆ రసం కొద్దిగా కొద్దిగా రోజూ తీసుకుంటూ ఉంటే కిడ్నీ లో రాళ్ళు కరుగుతాయి. లేదా కొత్తిమేర ను మిక్సీ లో వేసి జ్యూస్ లా చేసి మనం తాగే నీళ్ళలో ఓ టీ స్పూన్ కలుపుకుని తాగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి.
పైన చెప్పినట్లుగా లవణాల వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఆ లవణాలను శుద్ధిచేసి బయటకు పంపే లక్షణాలు కొత్తిమేరలో ఉన్నట్లు ఆయుర్వేదం చెపుతున్నది.
సంఘం సభ్యులందరికి  ఆదివారం అనగా తేడి 29. 03. 2015 న మీటింగ్ ఉంటుంది . అందరు తప్పకుండా హాజరు కావాలి . రాత్రి 8 గంటలకు 

Monday 23 March 2015

శ్రీ సాయిబాబా హారతులు



శ్రీ సాయిబాబా కాకడ హారతి
Shri Saibaba Kakada Haarathi
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
కరములు మోడ్చి నీ సన్నిథిలో సాయి గురుదేవ విన్నపాలె వినుపింతుమయ పండరినాథ
తెలియగ లేని భక్తి ప్రపత్తుల తెలియగ జేసి కరుణను యేలి కృపతోచూడుము సద్గురు రాయ
అనంతమగు నీ సేవ చేయగ ఆర్తిగ వేడితిమి ఆపద్భాందవ అల్పులమయ్య అవలోకించకయ
భక్త తుకారామ్ వేడిన వేదన వింటివిగా స్వామి మన్నన చేసి మా బంధములను త్రెంచుము దేవ
లెమ్ము పాండురంగ ప్రభాత సమయమ్మాయెగా వైష్ణవ భక్తులు వరుసలు తీరి ముందుగ నిలిచారు
సురవర గణమె నిలిచె మహాద్వార పర్యంతమ్ గరుడ స్తంభం నుండె కొలిచేరు ఆద్యంతమ్
నారద తుంబుర శుకశనకాదులు వేచిరి నీకోసమ్ మధుర గానముల మేలుకొలుప కాచిరి నీకోసమ్
భక్తశ్రేష్ఠుడు నామదేవుడు అరుదెంచెను పాడ సేవించగ నీ పదముల వ్రాల జనాభా ఇదేచే
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ

మోహాంబుధిలో తిరిగే జీవుల దారిచూపు చరణమ్ పాపనివారణ పరిహారమ్ముకు పరమపదమె చరణమ్
ఎన్ని జన్మల పుణ్యఫలము నీ పదములంటు తరుణమ్ కూడదయ్య ఇక జన్మమాకిల నీదు చరణుశరణమ్
ఓం సాయినాధ మహరాజ భవతినిరనాశకరవి అజ్ఞానాంధకారమణచి వెలుగు నింపుమాహరి నీదుమహిమ వర్ణింపమాతరమా దేవదేవ మరి
ఉనికిని తెలిపె మహిమాన్వితమె నీదు చరణ కమలమ్ భవతాపములను హరియించె అ పదమె మాకు శరణమ్
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ

భక్తిగనిలిచిరి నీముంగిటయే భక్తకోటి అంత జ్ఞానయోగుని దర్శనమ్ముకై సర్వప్రాణియంత
దివ్యధాముని కరుణరాముని కనగ వేచిరంత దర్శనమ్ముతో పరవశించగా సకల భువనమంత
వరమై వెలసినావె దీనబంధు రమాకాంత పాహి పాహి పరంధామ పాహిమామ్ పండరీశ
మధురనామ కలియుగేశ పాహిమామ్ సాయినాథ
జయతు జయతు చిద్విలాస జయతు సాయిరామ
బ్రహ్మ పాదమె ముక్తిమార్గమె నీదుపాదయుగళమ్
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ

లెమ్ము పాండురంగ లెమ్ము దర్శనమౌ ఫలమిమ్ము
అరుణమ్మాయె ఆకాశమె నిదురలేచి రమ్ము
సాధు పుంగవులు మునివరేణ్యులె వేచి నిలిచినారు
శయన సుఃఖమునె వదలి చూపుమా శుభకరవదనమునే
రంగ మండపమ్ మహాద్వారమున ఎదురుతెన్నులె చూసి
నిన్ను గాంచగా మా మది ఊగె దర్శనమీయవయ
అమ్మా రుక్మిణి కనవమ్మా నీ ప్రేమమీదుగా మమ్ము
విఠలరూపుని దర్శనమొసగె భాగ్యమ్మును ఇమ్ము
గరుఢ్మంతుడు ఆంజనేయుడె ఎదురులు చూసేరు
సురలోకపు ఘణదేవులంత కొలువై వేచారు
హారతిలివ్వగ భక్తిగ నిలిచె సర్వలోకమంత
కాకడ హారతి పాడగ వేచిరి విష్ణుదాసునామా
పంచహారతుల హారతులివ్వరె ఘనముగ సాయికి
రండి రండి జయ సాయికి సేయ కాకడ హారతి
స్థిలచిత్తములతొ ధ్యానము చేసె వైభవ హారతి
కృష్ణనాథునకు దత్తసాయికి మనసుల హారతి
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ

కామక్రోధమదమత్సరంబులె వత్తిగ మలచితిమి
వైరాగ్యమనె నేతిని తడిపి శుధ్ధిగ చేసితిమి
సాయిభక్తినే జ్వాలగ చేసి వెలిగించగ చూడ
సాయిసద్గురుని విశ్వరూపమె సాక్షాత్కరించె కనుల
తత్త్వసారమె వేదరూపమె సాయిసర్వరూపమ్
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ

భూమ్యాకాశము వ్యాపించితివో హృదయకమలవాస
దత్తరూపమై వెలుగుచుంటివో షిరిడీ పురవాస
నీవే దైవము నీవే సర్వము నీవే జీవమయ
ఆపదలందె దయమున కాచి అక్కునచేర్తువయ
ఎన్నగ తరమా వేల్పులకైన నీ లీలల మహిమ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ

నీ యశ కీర్తులు దుండుగులై మామోగెను విశ్వమున
పావన చరితుని పరంథామగన షిరిడి చేరె జనులె
నీ వచనామృత సారముసోకి దేహభ్రాంతి వీడె
వదలె మనసున దురభిమానమె పదములంటె నేడె
కృపను జూపి కరుణించరావయ దాసులమేమయ్య
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ

భక్తిభావపు జ్యోతియె ఈ కాకడ జ్యోతి
పంచప్రాణములు నిండియున్న జీవమీజ్యోతి
చేకొనుమయ్య ఈ హారతి పండరినాథ సాయిసద్గురునాథ
కరములు చాచి శరణంటిమయ నీపదపద్మముల
నీదు మహిమలు వర్ణింపగ లేరంతవారైన
నిను దర్శించగ తొలగునయ ఏ పాతకమైన
రాయిరఘుమ వాయి చేరి ఇరువంకల నిలిచి
మయూరపించపు చామరములతో వీచుటకై నిలిచె
తుకారాముడె దీపముపట్టి ప్రణమిల్లుతుపాడె
పాండురంగడు విఠలేశ్వరుడు శోభిల్లగ నిలిచె
రండి సాధుభక్తులారా పుణ్యమౌరండి ప్రాణమునిలిచిన కొలువగలేము ఆ పరమాత్ముడనే
ఇటుకపైన నిలిచేను దేవుడె దర్శింతము రండి విఠలదేవుని పాదకమలము ప్రార్ధించగ రండి
చేరగరండి దేవళమందున సాయిని చూడగనే
సర్వపాపములు పరిహరించు ఆ కాకడ హారతిలో
రుక్మిణి ప్రియునకు నివేదించగ వెన్నలు ఇచ్చెదము
ఆలసించిన దోషము కలుగును స్వామి నివేదనకు
మ్రోగుచుండెగ ద్వారమందున భజంత్రీల హోరు
పంచప్రాణముల కాకడ హారతి ప్రజ్వరిల్లె చూడు
శంఖనాదముల సింహభేరులె దిక్కులెల్లమ్రోగ
వందనమ్మయ వందనమిదిగో పాండురంగనీకు
సాయినాథగురు తల్లివినీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
దత్తరాజగురు దైవమునీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
సాయినాథగురు సర్వమునీవె దత్తరాజగురు సద్గురునీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
శ్రీసత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

ప్రభాతమాయె శుభమ్ముగ రవి ప్రభాకరుదయించె
స్మరించి గురువుని పదమ్ములంటిన కలిదరిరాదాయె
జోడించి కరధ్వజమ్ము భక్తిగ సలుపగురు ప్రార్ధన
సమర్ధసద్గురువా సాయినాథుడె మనోవాంఛతీర్చు

చీకటిబాపును భానుడె గురువుబాపు అజ్ఞానమె
కాని గురవుకి సాటిరాడుగ సూర్యదేవుడెపుడు
చీకటి మరల వచ్చును తిరిగిగాదు అజ్ఞానము
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు

రవి అరుదెంచిన పటాపంచలౌ అంధకారమంత
గురుకృపతాకిన దుష్కృత్యములె అంతరించునంత
వదలిపోవుగా పాదమంటగ దురితమ్ములె అంత
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు

త్రిమూర్తి రూపమె సాయినాథునిగ అవతరించె భువిలో
జీవులనిలలో ఉధ్ధరించగ తలచె సాయి మదిలో
అనంతమయమౌ మహిమరూపమె సాయి సద్గురుండు
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు

సమాథినొదిలి మసీదు చేర రమ్ము సాయినాథ
మథురవచనముల ఊరడించ మము తిరిగి సాయినాథ
ఆఖిల పాపముల బాపగనిలిచె నిఖిల జనావనుడె
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు

ఆహా ఎంతటి భాగ్యము కనులె తెరచె స్వామి
ఆశ్రితవదనుడె తానై ఆపదలను తీర్చగ
ఇంతటి ఉపకారి ఈ జగతిన వేరే లేరుగ
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు

ఎంతటి జ్ఞానైన గురుదేవుల కృపయేలేకున్న
వ్యర్ధము సుమ్మా జీవించగ ఈ ధరిలో బ్రతికున్న
గురుపదచరణమ్మె భవ శరణం తిరుగేలేదన్న
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు

హృదయమందున నిలిచియుండుమా స్వామిసాయినాథ
సమస్తజగమె గురుస్వరూపమని తెలియచూపరాద
సద్గుణమ్ముతో సాగిపోవు సద్బుధ్ధిని మాకిమ్మ
సమర్ధసద్గురుసాయినాథ నిను చేరుదారినిమ్మ

ప్రభాత సమయంలో ఎవరయితే భక్తిశ్రధ్ధలతో ఈ అష్టకాన్ని పఠించెదరో వారి భ్రమలు తొలగి మహత్తరమయిన మనశ్శాంతి పొంది సాయి కృపాకటాక్షవీక్షణాలు కలిగి సుఃఖజీవనులగుదురు

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి
Shri Saibaba Madhyahna Haarathi
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి
ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి
భక్తులార రారండి కలసి ఇవ్వగ సాయికి హారతి
సాయిరామాథవ స్వామి నీకే హారతి
నిశ్చలమున మనసుంచి మదిని ధ్యానించే మంత్రమ్
సాయిరాముని స్మరణమ్ సర్వజీవాధారమె మంత్రమ్
కృష్ణనాథ దత్తసాయి మా చిత్తము నీదోయి
స్వామి సాయినాథ స్వామి మా సర్వము నీవోయి

హారతి సాయిబాబా

సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా

కామక్రోధమొదిలించు సత్యమేదో వచించు
ముముక్ష మానవుల వసియించేవు రంగ నీవే శ్రీరంగ
హారతి సాయిబాబా

భావన ఏదైతే అదే అనుగ్రహించె దయాధనా సాయి
ఇది ఏమి మాయ ఇది నీ మాయ
హారతి సాయిబాబా

స్వామి సాయి నామమే సుఖః సంతోష తీరమ్
అనాధ జీవులకే అదె ఆశ్రయసదనమ్ ఆనంద సదనమ్
హారతి సాయిబాబా

కలియుగ అవతార పరబ్రహ్మావతార అవధరించినావయ్య
ఇల దత్తస్వరూప సాయి స్వరూప
హారతి సాయిబాబా

ప్రియమాయె గురువారమ్ పర్వదినమాయె భక్తుల ప్రభుపదసేవలలో
భవభయములు బాపగ నీవే బాసట
హారతి సాయిబాబా

కోరము ఏ వరమూ నీ పదసేవ తప్ప
ఆ అభయముమీద స్వామి సాయిస్వరూప ప్రేమస్వరూప
హారతి సాయిబాబా

దీనుల మము దయతో పాలింపుము దేవ
ఆశ్రిత వదనుడవై ఆలింపుము దేవ మమ్ముల బ్రోవ
హారతి సాయిబాబా

సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా

జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ ధర్మము నిలకావగనే అవతారము దాల్చి
నాస్తికులను సైతము తన ఆస్తికులుగ జేసె
నీలీలు సాగె ఎన్నెన్నో రూపాలై దీనులను కాచేనిక సంకటములు బాపి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ యవన రూపమున మాకు దర్శనమే ఇచ్చి
సంశయముల పిడదీసి సాగిల పడవేసి
మూఢులను కరుణించి తరియింపగజేసి
మోవిన వంశీ జన్ముడ లోకము పాలించె
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ భేధములెంచక హిందు ముస్లీమ్ ఒకటంటు
నరులంత ఒకటేయని పరభేధము వలదంటు
పలువురిని ఒకపరినే చూసేవుగ స్వామి
పరమాత్మవు నీవై సర్వమ్ముకు సాయి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ దేవా సాయీనాథ వందనము స్వామి
మాయామోహమునుండి మరలించుము మమ్ము
సంకటములనెల్ల నీ కృపతో తొలగించి
సేవించే భాగ్యమ్మును శక్తిని మాకిమ్మ
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత

జయదేవ జయదేవ శిరిడి మా పండరీపురమ్ సాయిబాబా రమావరుడు
బాబా రమావరుడు సాయిబాబా రమావరుడు
శుధ్ధభక్తియె చంద్రభాగ భావరూపుడే పుండరీకుడు
పుండరీకునీ భాగ నా భావరూపమె కాగ
రండు రండి భక్తుల్లార చేయగ సాయికి వందనమ్
సాయికి వందనమనరె స్వామి సాయికి వందనమనరె
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
సాయికి సాష్టాంగ వందనము పావనమూర్తికి వందనము
పండరినాథ వందనము జయ జయ సాయికి వందనము
త్వమేవమాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్య సఖత్వమేవ
త్వమేవవిద్యా దర్యంత్వమేవ త్వమేవ సర్వమ్ మమదేవ దేవ
సాయేనవాచ మనసేంద్రియైవ ఉద్యాత్మనావ ప్రకృతి స్వభావ
తరీనియద్యత్ సకలమ్ పరస్మయ్ నారాయణాయైచి సమర్పయామి
అచ్యుతమ్ కేశవమ్ రామనారాయణమ్ కృష్ణ దామోదరమ్ వాసుదేవంభని
శ్రీధరమ్ మాధవమ్ గోపికా వల్లభమ్ జానకీ నాయకమ్ రామచంద్రమ్ భజే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిహి ఓం గురుదేవదత్త హరిహి ఓం


శ్రీ సాయిబాబా ధూప్ హారతి
Shri Saibaba Dhoop Haarathi (Sandhya Haarathi) హారతి సాయిబాబా

సౌఖ్య దతామదేవ శరణమయ్య స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా

కామక్రోధమొదిలించు సత్యమేదోవచించు
ముముక్షమానవుల వసియించేవు రంగ నీవే శ్రీ రంగ
హారతి సాయిబాబా

భావన ఏదైతే అదే అనుగ్రహించె
దయాధనా సాయి
ఇది ఏమి మాయ ఇది నీ మాయ
హారతి సాయిబాబా

స్వామి సాయి నామమే
సుఃఖ సంతోష తీరం
అనాథ జీవులకె అదె ఆశ్రయ సదనమ్ ఆనంద సదనమ్
హారతి సాయిబాబా

కలియుగ అవతార పద బ్రహ్మావతార
అవథరించినావయ్య ఇల దత్తాస్వరూప
సాయి స్వరూప ప్రేమ స్వరూప
హారతి సాయిబాబా

ప్రియమాయె గురువారమ్ పర్వదినమాయె భక్తుల
ప్రభుపద సేవలలో భవభయములు బాపగ నివే బాసట
హారతి సాయిబాబా

కోరము ఏ వరము నీ పదసేవ తప్ప ఆ అభయము మీద
స్వామి సాయి స్వరూప ప్రేమ స్వరూప
హారతి సాయిబాబా

దీనుల మము దయతో పాలింపుము దేవ
ఆశ్రిత వదనుడవై ఆలింపుము దేవ మమ్ముల బ్రోవ
హారతి సాయిబాబా

సౌఖ్య దతామదేవ శరణమయ్య స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
శిరిడి మా పండరీపురమ్ సాయిబాబా రమావరుడు
బాబా రమావరుడు సాయిబాబా రమావరుడు
శుధ్ధభక్తియె చంద్రభాగ భావరూపుడే పుండరీకుడు
పుండరీకునీ భాగ నా భావరూపమె కాగ
రండి రండి భక్తుల్లార చేయగ సాయికి వందనమ్
సాయికి వందనమనరె స్వామి సాయికి వందనమనరె
పరుగునజేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
పరుగునజేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
సాయికి సాష్టాంగ వందనము పావనమూర్తికి వందనము
పండరినాథ వందనము జయ జయ సాయికి వందనము
త్వమేవమాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్య సఖత్వమేవ
త్వమేవవిద్యా దర్యంత్వమేవ త్వమేవ సర్వమ్ మమదేవ దేవ
సాయేనవాచ మనసేంద్రియైవ ఉద్యాత్మనావ ప్రకృతి స్వభావ
తరోనియద్యత్ సకలమ్ పరస్మయ్ నారాయణాయైచి సమర్పయామి
అచ్యుతమ్ కేశవమ్ రామనారాయణమ్ కృష్ణ దామోదరమ్ వాసుదేవంభని
శ్రీధరమ్ మాధవమ్ గోపికా వల్లభమ్ జానకీ నాయకమ్ రామచంద్రమ్ భజే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిహి ఓం గురుదేవదత్త|


శ్రీ సాయిబాబా షేజ్ హారతి
Shri Saibaba Shej Haarathi
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

నిరాకారమౌ దైవముమాకై రూపముదాల్చె బాబా రూపముదాల్చె
విశ్వరూపమై సర్వమంతట సాయిగ మారే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

సత్త్వరజోస్తమోగుణమ్ములె మాయాశృజనములె బాబా మాయాశృజనములె
మాయలలోని మర్మములేవో తెలియును నీకే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

సప్తసాగరములె మీ ఆటలస్థానములాయె బాబా స్థానములాయె
ఆడుచుంటివట అనంతమౌనీ లీలలతోటి
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

భ్రహ్మాండమ్మును సృష్టించెనుగా బాబా మాకై స్వామి నీవే మాకై
కృపామయుండె నా స్వామి అని తుకారాము పాడే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత సాధు సంత భక్తులంత

హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
పాండురంగడే వెలిసే ఇలజ్ఞానమ్ము తెలుప

హారతి జ్ఞానరాజా

గోపికలే నిలిచే ఘన హారతులివ్వ
నారద తుంబురులే శ్రావ్యగానాలు పాడె
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత మనసానందమొంద
హారతి జ్ఞానరాజా

ఈ సృష్టి మర్మమేలె విశ్వబ్రహ్మవయ్య రామకృష్ణసాయి కనికరించుమయ్య
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత సాధు సంత భక్తులంత
హారతి జ్ఞానరాజా

హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా

రామమహిమ తేలె రాళ్ళసంద్రమెటులో అటుల కాచినావె దివ్య అభంగములనె
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా

పరబ్రహ్మనీవే స్వామి మహిమావతారా రామేశ్వరుడు వేడే నిను శరణమ్ములంటు
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
రంజిల్లునయ్య మామది అంత మథుర వచనముల నీదు పలుకుల (, 2)
వ్యాధుల బాధల తీర్చెదవయ్య నీ నిజ భక్తుల కనికరముంచి (, 2)
ఆపదలందున ఆభయమునీవై ఆశ్రయమొసగి లాలించెదవు (, 2)
ఆలసిపోయె నీ దేహమంత నీ భక్తుల బాధలు తీర్చగ

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి
క్షమాశయనమే నీదుసెయ్య సుందరముగ పుష్పాలకూర్చితిమి(, 2)
సేవించగ నిను చేరితిరయ్య నిను దర్శించగ వేడితిరయ్య(, 2)
పంచప్రాణముల వత్తులు చేసి పంచ హారతులు ఇచ్చితిరయ్య(, 2)
సుగంధ పరిమళ భరితమాయె నీ భక్తకోటి ఆ సేవలు

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి
నీచరణమ్ములె వీడగబోవ మా మది నొచ్చెను మరి మరి స్వామి(, 2)
అనుమతి వేడితి స్వీకరించి నీ ప్రసాదమున నివాసమేగ(, 2)
తెలవారక మునురే తిరిగొచ్చి నీ చరణమ్ముల వ్రాలెదమయ్య(, 2)
సుప్రభాతమ్ నీ సేవ చేయగ శుభములు మాకు కలుగునయ

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి

నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

వైరాగ్యమనే కుంచెను తుడిచి శుచిగా చేసితిమి భవనము శుచిగా ఉంచితిమి
ప్రేమగ మనసున భక్తి జలముమను చుట్టూ జల్లితిమి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

నవవిధ భక్తి పానుపున శయనించుము స్వామి, స్వామి సాయిబాబా
జ్ఞాన జ్యోతియే దివ్వెగ వెలదా శయ్యను నిదురించు
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

సద్భావమనే పువ్వులనే సుఃఖ పాన్పున పరచితిమి, బాబా పాన్పున పరచితిమి
భక్తిశ్రధ్ధలను పానుపు చుట్టూ ఆలంకరించితిమి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

ద్వైతక వాటము భంధన చేసి తెరలను దించితిమి, బాబా తెరలను దించితిమి
మనసుల చెడుల ముడులే తొలగె సుఃఖముగ శయనించు
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

ఆశాకోరిక మోహావేశములన్ని వదలివవి, బాబా అన్ని వదలినవి
దయ క్షమ శాంతి నిను సేవించక వేచినవి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

నిష్కామమనే శాలువ పరచి పవలింపగ జేసి, బాబా పవలింపగ జేసి
సుఃఖముగ నీవే నిదురించవయ స్వామి సాయినాథ
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

శ్రీ సత్ చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రీ గురుదేవ దత్త

దొరికేనయ్య సాయీశ నీ ప్రాసాదమ్మె మాయీశ
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు

వచ్చెదమయ్య సాయీశ సుఃఖ నిదురను పొమ్మా పరమేశ
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు

దర్శన భాగ్యము నిమ్మా తిరిగి వేకువలోనే స్వామి
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు

సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ

తలచిన చాలు తొలగింతు వయ కష్టములెల్ల, మా కష్టములెల్ల
ఆపద్భాందవ స్వామి సాయి హాయిగ నిదురించు

సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ

తీర్చగలేము నీ ఋణములనే సాయి గోపాలా, దేవ సాయి గోపాలా
భాగ్యము నీవే బంగరు తండ్రి హాయిగ నిదురించు

ప్రభో సాయి లేచెదమయ్య వేకువ ఝామునే, స్వామి వేకువ ఝామునే
నీ సుభ దర్శనమొసగుము స్వామి మమ్ములనేలగనే

సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ

శ్రీ సత్ చిదానంద సద్గురి సాయినాథ్ మహారాజ్ కీ జై

రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రీ సత్ చిదానంద సద్గురి సాయినాథ్ మహారాజ్ కీ జై||