Wednesday 22 April 2015

మూత్రపిండాల్లో రాళ్లు

    ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమేమిటంటే..? ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. క్యాల్షియం, ఫాస్పేట్స్, ఆక్సిలేట్స్, రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి

    కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే.. ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

    మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవాలంటే.. 
    తులసి రసం: ముందుగా తులసీ ఆకులతో రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆరు నెలలు ఇలాగే చేస్చే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి

    కొండపిండి కషాయం:
    కొండపిండినే పాషాణభేది అంటారు. ఈ మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటిలో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30. మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడు పూటలా తీసుకోవాలి. లేదా కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకుని తినటం అలవాటు చేసుకోవాలి. మూడు నెలల్లో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి

    ఉలవచారు: కావలసినవి... ఉలవలు-ముల్లంగి ఆకులు, నీరు. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారును రోజు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.


    నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్లు రావా?
    డాక్టర్‌ ఎం.వి. రమణయ్య
    ఎండాకాలం వడదెబ్బ తగులుతుందని చాలా మందికి తెలుసు. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎండాకాలంలో 30 నుంచి 40 శాతం అధికమని కొద్ది మందికే తెలుసు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలున్నప్పటికీ సరిపోయినన్ని నీళ్లు తాగకపోవడమే ప్రధాన కారణం. ఎక్కువగా చెమట పట్టడం, ఒంటిలోని నీరు ఆవిరి కావడం కారణంగా మన ఒంటిలో నీటి కొరత ఏర్పడి, మూత్రం చిక్కబడి, మూత్రంలోని రసాయనిక పదార్థాలు చిన్న చిన్న స్ఫటికాలుగా ఏర్పడతాయి. స్ఫటికాలు కొన్ని గుంపుగా ఏర్పడి కిడ్నీలో రాళ్లుగా మారతాయి. అందు వల్ల ఎండాకాలం కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. కిడ్నీలో రాళ్లు ఏర్పడడాన్ని తగ్గించాలంటే...
    తగినంత నీళ్లు తాగాలి
    రోజుకు ఎన్ని నీళ్లు తాగాలన్నది మనిషి బరువును బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. చలికాలంలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు సరిపోతే, వేసవి కాలంలో 4 నుంచి 5 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. అందుకే ఎన్ని నీళ్లు తాగామనేదాని కంటే ఎంత మూత్రం పోసుకున్నామనేది గమనించడమే సరైన పద్ధతి. రోజుకు సుమారు 2 లీటర్ల మూత్రం పోసుకుంటే సరిపోయినన్ని
    నీళ్ళు తాగినట్టే. మూత్రాన్ని నీళ్లలో కొలవడం కష్టం. అంత ఊహించుకోవడం చాలా మందికి నచ్చదు. అందుకే మూడు గంటలకు ఒక పర్యాయం మూత్ర విసర్జన చేస్తున్నా, రంగు, వాసన లేని మూత్రాన్ని పోసుకుంటున్నా సరిపోయినన్ని నీళ్లు తాగినట్లుగా భావించవచ్చు. కొందరు ఉదయాన్నే నిద్రలేవగానే రెండు లీటర్ల నీళ్లు తాగడం దినచర్యలో ప్రారంభంగా అలవాటు చేసుకుంటారు. ఇలా ఎక్కువ నీటిని కొద్ది సమయాల్లో తీసుకోవడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. పగలంతా రెండు గంటలకు ఒక్క గ్లాసు, రాత్రి పడుకునే ముందే ఒక గ్లాసు నీళ్లు తాగగలిగితే సరిపోయినన్ని నీళ్లు తాగినట్లు భావించవచ్చు.
    కాఫీ తగ్గించాలి
    కాఫీని అధికం గా సేవించే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి అధికం. కాఫీలో ఉండే రసాయనిక పదార్థాలు మూత్రాన్ని ఎక్కువగా పోయేటట్లు చేసి శరీరానికి నీటి లేమిని కలిగిస్తాయి. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. పదిసార్లు కాఫీ తాగితే సుమారు ఒక లీటరు ద్రపదార్థం తీసుకున్నట్లు కదా అనేది సాధారణంగా వినిపించే వాదన. కాఫీ సేవించడం వల్ల లోనికి వెళ్లే ద్రవపదార్థం కంటే వెలుపలికి వెళ్లే మూత్రం ఎక్కువ.
    శీతల పానీయాలను మానాలి
    ఎండాకాలం సోడాలు, థమ్స్‌అప్‌, కోకొకోలా లాంటి శీతల పానీయాలను తాగడం సర్వసాధారణం. వీటిలో ఉండే ఆమ్ల లక్షణం కారణంగా మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. నిమ్మ కాయలో ఉండే సిట్రికామ్లం కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. నిమ్మరసంలో వీలైనంత తక్కువ ఉప్పును వేసుకుని అవసరమనిపిస్తే చక్కెర కలుపుకోవడం మంచిది. మధు మేహ రోగులకు సలహా వర్తించదని గమనించాలి.
    ఉప్పును తగ్గించుకోవాలి. ఉప్పును పెంచుకుంటే బీపి పెరుగుతుందని తెలిసిందే. ఉప్పు పెరిగే కొద్దీ కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది. శరీరానికి అదనమైన ఉప్పును వెలుపలికి పంపడానికి కిడ్నీ అధికంగా పని చేయాల్సి వస్తుంది. ఉప్పులోని సోడియంను వెలుపలికి పంపే కార్య క్రమంలో భాగంగానే కాల్షియంను కూడా మూత్రం ద్వారా వెలుపలికి పంపుతుంది. కాల్షియమే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం. కాబట్టి, తగినన్ని నీళ్లు తాగుదాం. కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకుందాం.



    మూత్రపిండాల్లో రాళ్లు పోయేదెలా? (03-Dec-2014)
    ఆయుర్వేద శాస్త్ర రీత్యా మూత్రపిండాల్లో రాళ్ల వ్యాధిని మూత్రాశ్మరి అంటారు. వాతం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి తర్వాత కణాల లోపలి భాగాలపై కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలు పేరుకొని పోయి మూత్రపిండాల్లో రాళ్లుగా పరిణామం చెందుతాయి. మూత్రపిండాల్లోని రాళ్లు కొద్ది కొద్దిగా కరిగి, మూత్రనాళంలోకి దిగి ఇరుకైన సన్నని భాగాల్లో చిక్కుకుపోతాయి. ఇవి ప్రమాదకరం.
    వ్యాధిలక్షణాలు- విపరీతమైన నొప్పి వీపు వెనుక వైపు నుంచి కిందికి దిగుతూ గజ్జల్లోకి , జననేంద్రియాల్లోకి పాకుతుంది. అలాంటి సమయంలో జ్వరం, వాంతి, ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, మూత్రం పోసేటపుడు మంట కలుగుతుంది. మూత్రంలో రక్తం కూడా పోయే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో రాళ్లు కిడ్నీలో పూర్తిగా నిండిపోయి కిడ్నీ రాయిలా తయారవుతుంది. కొందరిలో మూత్రపిండాల్లోని రాళ్లు ఏరకమైన ఇబ్బందినీ కలగజేయకున్నా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు.
    కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్యకారణాలు ?
    ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
    కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే ?
    ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువశాతం తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
    పెరటి మొక్కల వైద్యం
    అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోని పెరటిమొక్కలతో కిడ్నీల్లోని రాళ్లను కరిగించే అవకాశాలున్నాయి. అవేంటో తెల్సుకుందాం.
    తులసి రసం
    కావాల్సినవి - కొన్ని తులసిఆకులు, తేనె
    తయారీ విధానం - ముందుగా తులసి ఆకు రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆర్నెళ్లు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
    కొండపిండి కషాయం
    కావాల్సినవి- కొండపిండి మూలిక, నీరు
    తయారీ విధానం- కొండపిండినే పాషాణభేది అంటారు. మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటితో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30 మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడుపూటలా తీసుకోవాలి. లేకుంటే కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకు తినటం అలవాటు చేసుకోవాలి. మూడునెలల తర్వాత కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
    ఉలవచారు
    కావాల్సిన పదార్థాలు - ఉలవలు, ముల్లంగి ఆకులు, నీరు
    తయారీ విధానం - ఉలవల్లో ముల్లంగి ఆకులు సన్నగా తరిగి కలిపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఉలవచారు రోజూ తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
    గలిజేరు పులుసు
    కావాల్సిన పదార్థాలు - తెల్ల గలిజేరు వేరు, నీరు.
    తయారీ విధానం తెల్ల గలిజేరు వేరును నీటిలో మెత్తగా నూరాలి. ఒక కప్పు నీటిలో ఒక రోజు రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే వడబోసి తర్వాత తాగాలి. దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.
    గమనిక- కిడ్నీల్లో రాళ్లు బాగా పెద్దవిగా ఉన్నా, అవి బయటకు రావటం వీలుకాని సందర్భాల్లో ఆయుర్వేద వైద్యులను సంప్రదించటం మంచిది.
    డాక్టర్‌ కందమూరి
    ఆయుర్విజ్ఞాన కేంద్రం, ఫోన్‌ : 9866482598



    కిడ్నీలో రాళ్లను తొలగించే దివ్యౌషధం ''నారింజ''
    Tue, 20 Mar 2012, IST    vv
    సాధారణంగా కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగి పోవటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడు తుంటాయి. ఆపరేషన్‌ ద్వారా వీటిని తొలగించినప్పటికి మళ్లీ, మళ్ళీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. ఇలాంటి వారు రోజుకో గ్లాసెడు నారింజ రసాన్ని తీసుకున్నట్లయితే రాళ్లు క్రమంగా తొలగిపోతాయి. అలాగే పొటాషియం సిట్రేట్‌ సప్లిమెంట్లు వాడకం ద్వారా కూడా సమస్యను నివారించవచ్చు. పొటాషియం సిట్రేట్‌ సప్లిమెంట్లు అధికంగా ఉండే సిట్రస్‌ పండ్లను తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే మిగిలిన సిట్రస్‌ ఫలాల కంటే నారింజ పండ్లలోని సిట్రేట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. నారింజ రసం తీసుకోవటం వల్ల మూత్రంలోని ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లను నివారించేందుకు నిమ్మరసం కంటే నారింజ కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లను నివారించేందుకు నిమ్మరసం కంటే నారింజ పండ్ల రసం తీసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు



    తులసి రసంలో తేనె కలుపుకుని రోజూ పరగడుపున తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
    ధనియాల పొడితో కషాయం కాచి, అందులో కాసిన్ని పాలు కలుపుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది.
    గోరువెచ్చని పాలలో కొద్దిగా వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే నడుంనొప్పి తగ్గుతుంది.