10 మంచి అలవాట్లు చేసుకోవటం ఎలా !(3)
మీ జీవితాన్ని ప్రభావితం చేసే 10 మంచి అలవాట్లు చేసుకోవటం ఎలా !(3)
ఇంతకు ముందు వ్యాసంలో చెప్పుకున్న చెడు అలవాట్ల స్థానంలో ఏ అలవాట్లువుంటేమనసు తృప్తి పడ్తుంది,ఏవి ఆరోగ్యానికి మంచిది,ఏవి ఆర్థికంగా సామాజికంగా ఉపయోగపడతాయి, ఏఅలవాట్లు మనకి మన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి?అన్న విషయాలు చూద్దాము.మనిషికిప్రాథమికం గా తృప్తి,హాయి, ఆనందం కలిగించేవి మొదట గమనిద్దాము.
1)మనకున్న పంచేంద్రియాల గురించి మొదట ఆలోచిద్దాము.కంటికి ప్రకృతి,అందమయినదృశ్యాలు ఆనందా న్ని కలిగిస్తాయి . ప్రతిరోజు ఆకాశాన్ని,సూర్యోదయ,సూర్యాస్తమయాలను,చంద్రుని వెన్నెలను ,నక్షత్రాలను ,చెట్లను ,పక్షులను గమనించగలిగితే ఎంతోఆహ్లాదం గా వుంటుంది.అలాగే అందుబాటులో వున్నవారుకాలువలు ,నదులు ,సముద్రాలకు,ఉదయం,సాయంత్రం షికారుకు వెళ్ళగలిగితే నడకలాగా అనుకుంటేఎంత బాగుంటుంది.ప్రకృతిని మనం కళ్ల ద్వారా మనసులో నింపితే మన మనసువిశాలమవుతుంది.దీన్ని మించిన తృప్తి ఇంకోటి లేదు.ఎక్కడికి పోలేని వారు తమ ఇంటి ఫైకెక్కిగమనిస్తే సరి! అవకాశం,పరిస్థితులు అనుకూలించిన వారు వారాంతం లో ఒక ప్రాంతానికి వెళ్లిఅక్కడి దృశ్యాలను మనసు లో నింపుకొని వారం పాటు ఆ ఆనందాన్ని ఫొటోస్,వీడియో ల ద్వారాముచ్చటించుకుంటూఆనం దించవచ్చు.ఇంటర్నెట్ లో అందమయిన ప్రకృతి నివీక్షించవచ్చు.నదులు,సముద్రాలు ,పర్వతాలు లోయ లు,సరస్సులు మొత్తం నెట్ లో వీడియో ల రూపం లోవున్నాయి.అన్ని ప్రాంతాలకు పోవటం కుదరదు కాబట్టి గూగుల్ ఎర్త్ తో హిమాలయాల ఫై విహరించవచ్చు.మీకు ఇంకా ఎన్నో ఆలోచనలు రావచ్చు ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకోండి మనసంతా ఆనందం తోనిండి పోతుంది.ఇదంతా కన్ను తెరిస్తే ఆనందం .కన్ను మూస్తే ఆనందం కలగాలంటే చక్కటి నిద్రకావాలి.సగటు మనిషికి వయసు ను బట్టి నిద్ర అవసర మవుతుంది .చిన్నపిల్లలకి పది నుండి పన్నెండుగంటల నిద్ర అవసరం.కొద్దిగా పెద్ద పిల్లలకి 8-10 గంటల కాలేజీ పిల్లలకి 6-10 గంటల నిద్ర అవసరం.25-45 వయసు గల వారికి ఆరు,లేదా ఏడుగంటలు నిద్ర కావాలి ఇక ఆ ఫైన ఆరుగంటలు నిద్రపట్టిందంటే ఆరోగ్యానికి మంచిది.ఇది నేను సుమారుగా చెప్పాను. అప్పుడప్పుడు పాటించకపోయినా సాధ్యమయినంతవరకు ఒక పద్ధతిలో ఫై అలవాటును గనుక పాటించినట్లయితే మంచి ఆరోగ్యం మీసొంతం.
2)ఇక రెండవ అలవాటు !చెవులకేమి కావాలి!.మధురమైన సంగీతం ,మనసుకు నచ్చిన పాటలు వింటూవుంటే ఆనందలోకాలలో తేలినట్లు ఉండదా!శాస్త్రీయ సంగీతం ,ఇష్ట పడేవారు,మధుర స్వరాలు పాత పాటలు ,ఆధునిక పాటలు నచ్చేవాళ్ళు ఇలా ఏదయినా మీ మనసుకు నచ్చింది వింటుంటే అదే కదాఆనందం దీనితో పాటు సెలయేటి గలగలలు,జలపాతాల హోరు,పక్షుల కిలకిలలు, కోయిల గానాలు ఏటిఒడ్డున నీటి సవ్వడులు ఈ విధంగా ప్రకృతి పలికించే విభిన్న సంగీతాలను వినటం ఓ కళ! .హరిప్రసాద్గారి sound of deserts,sound of rivers లాంటి ప్రకృతి సంగీతాన్ని వినగలిగితే మనసుకెంతహాయి!
3)ఇక నాసిక ద్వారా పొందే తృప్తి ,ఆనందం విషయానికి వస్తే పూల పరిమళం మనసు నెంతమత్తెక్కి స్థాయి సుగంధ ద్రవ్యాలు,అగరుబత్తి,ఇంకా నాసిక కు ఏవి హాయినిస్తాయో వాటి మధ్య నుండగలిగితే ఇక మనసు వేరే వ్యసనాల కోసం ఎందుకు చూస్తుంది.దీనిని ఒక అలవాటుగా మారిస్తే ఎలావుంటుంది.
4)ఇక నోటి రుచుల విషయానికి వస్తే జిహ్వ చాపల్యం మనల్ని ఎన్నో కోరికలను కోరు తుంది.పండ్లు,వాటి రసాలు పచ్చి కూరగాయలు వాటి సలాడ్ లు మొలకలు,త్రుణధాన్యాలు ఆహారం లోభాగంగా చేసుకొంటూ అప్పుడప్పుడు రుచి కోసం విభిన్న రకాల పదార్థాలను ఆస్వాదిస్తుంటేమంచిది.టీ,కాఫీ,కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ,పండ్ల రసాలు అలవాటుగా చేసుకుంటూఎప్పుడై నా రుచికోసం వాటిని తీసుకోవచ్చు.
5)ఇక మనసు చెడ్డ వ్యసనాలనుంచి బయటకు రావాలంటే చివరిది అయిన స్పర్స గురించిఆలోచిద్దాము మొక్కలు , చెట్లు,పూలస్పర్శను పొందటం, ఈత ద్వారా నీటి స్పర్శను,చక్కటి వైవాహికసంబంధం గడుపుతూ మంచి శృంగారాన్ని అనుభవించటం ,బిడ్డల్ని ప్రేమ తో దగ్గరికి తీసుకోవటం,జంతువులను పక్షులను స్పృశిస్తూ వాటి స్పందనలను గమనించటం మనసుకు ఎంతో తృప్తిఆనందాన్ని ఇవి ఇస్తున్నప్పుడు ఇక సమయమెక్కడుంటుంది చెడ్డ వ్యసనాల జోలికి పోవటానికి !
6)ఇక మిగిలిన వాటి గురించి చూద్దాము.ఇవికూడా ఫై వాటి క్రిందకే వస్తాయి.కాకపోతే ప్రత్యేకంగా చెబుతున్నాను. వ్యాయామం ప్రతిరోజు చేయటం ఎంత చక్కని అలవాటు.దీని గురించి ఇంతకు ముందువ్రాసాను.మీ కిష్ట మయినది ఎన్నుకోండి.నడక,ఈత, యోగ ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం మీ కనుకూల ఎన్నుకోండి .క్రమం తప్పకుండా చేయండి. విద్యార్థులకు ఆటలు పెద్ద వారికి ప్రత్యేకవ్యాయామాలు మంచిది.కొంత మంది ఒక నెలరోజులు జిం నకు వెడతారు,మానేస్తారు.అయిన ఆ మరలమరల మొదలు పెడుతూనే వుండండి.
7)పుస్తక పఠనం మీ అభిరుచికి అనుగుణ మైన పుస్తకాలు చదవండి.ఆరోగ్యం,వృత్తి,వ్యక్తిత్వ వికాసం,తత్వం ,మంచి నవలలు ఇలా ఎన్నో విభాగాలున్నాయి .కనీసం నెలకు ఒక పుస్తకమన్నపూర్తి అయ్యే విధంగా రోజుకి కొన్ని పేజీ లు చదివే అలవాటు మంచిది.రచయితలు ఎంతో మధించి వ్రాస్తారు.వారిఅనుభ వాన్ని మనం చదివి మన కనుగుణంగా విశ్లే షింకుంటే బాగుంటుంది.ఇది ఒక చక్కటి అలవాటు.
8)మీకు ఎన్నో చేయాలని వుంటుంది .అన్ని చేస్తూ ఏ ఒక్క దాని మీద పూర్తి దృష్టి పెట్టకుండావుంటారు .అలా కాకుండా మీకు ఏ అభిరుచిలో ప్రావీణ్య మున్నట్లనిపిస్తుందో దాన్నేఅలవాటుగా రోజుచేయగలిగితే ఎంత బాగుం టుంది!ఇది ఎవరికి వారు ఎన్నుకోవాలి.
9)ఇక మీతో మీరు గడపటం ఇదికూడా ఒక అలవాటేనా అనుకోకండి!ఒక్కరు ఎవరు తోడు లేకుండాఇంటి ఫైన గాని, మీ ఏకాంత మందిరం లోగాని ఏమిచేయకుండా గడపటం బహుశా ధ్యానంఅనుకుంటారు.ఓ.కే అది కొంతవరకు మంచిదే!దాని కంటే ఈ ఏకాంతం లోనే మనకు మనం మనమనసును గమనిస్తూవుంటే ఎలా వుంటుందో చూడండి.మీకు తెలియని కొత్త ఆనందం మీ మనసులోకివస్తుంది.ఇంకా ఒక సాయంత్రం అంద మైన చెట్ల దగ్గరికి వెళ్లి ప్రకృతిని గమనిస్తూ ఆ ఏకాంతాన్నిఆనందించండి.
10)ఇక చిట్టచివరిగా మన మనసుకు ఆనందం కలిగించేది సేవ !దీన్ని విభిన్న రకాలుగా చేయవచ్చుడబ్బుతో మాత్రమే కాదు.ఆలోచించండి.ఈ బ్లాగు లో సేవ పేజి చూడండి.మీకే ఎన్నో ఆలోచ నలుమనసులోకి వస్తాయి.అది ఎంత చిన్నదైనా ఒకటి చేయండి.
నేను ఆచరించేవి,గమనిం చినవి కొన్ని మీకు చెప్పాను అన్ని చేయాలని లేదు.లోకో భిన్నరుచి !మీ దగ్గర కూడా అద్భుత మైన అలవాట్లు ఉండవచ్చు.మీరు మీ భావాలను పంచుకోండి.ఇవి అన్నిఒకరకం .మన ప్రవర్తన కు సంబందించినవి వేరే వ్యాసం లో వ్రాస్తాను.
మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమే ఈ మంచి అలవాట్ల లక్ష్యం.
No comments:
Post a Comment