ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఔషధవిలువలు గల మొక్క ఉమ్మెత్త. శివ్ఞనకు ప్రీతిపాత్రమైనది. బంజరు భూములలో ఎక్కువగా పెరుగుతుంది.
అందమైన మొక్క: సుమారు రెండు నుండి మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొడవుగా గరాటు ఆకారంలో వుoడే ఈ పుష్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇవి తెలుపు లేక వంగపండు రంగులో ఉంటాయి. ఈ మొక్క కాయలు ఇంచుమించు గుండ్రంగావుoడి అనేకముళ్ళతో నిండివుoటాయి. ఫలాలు, పుష్పాలు సంవత్సరం పొడవునా లభిస్తాయి.
ఉమ్మెత్త శాస్త్రీయ సమాచారం: ఉమ్మెత్త మొక్కను ఇంగ్లీష్‌లో థార్నీ యాపిల్ అంటారు. శాస్త్రీయనామాలు-దతూరా స్ట్రెమోలియం, దతూరా మెటల్. ఇది సాలనేసీ కుటుంబానికి చెందినది.
మిర్చి, పొగాకు, వంగ, టమాట, బంగాళదుంప, బెల్లడోనా, పెర్‌ట్యూనియా వంటి అనేక ఉపయుక్తమైన మొక్కలు కూడా సాలనేసీ కుటుంబానికి చెందినవే. ఆసియా ఖండానికి చెందిన ఈ ఉమ్మెత్త మొక్క భారతదేశంలో అన్నిచోట్లా పెరుగుతుంది.
పుత్రపాప్తికొరకు: ఉమ్మెత పూలతో శివుని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుందని శివపురాణంలో చెప్పబడి వ్ఞంది. ఉమ్మెత్తకాయలు, ఉమ్మెత్త పూలు శివునికి అత్యంత ఇష్టమైనవి. ఎర్రని కాడగల ఉమ్మెత్త పూలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
ఉమ్మెత్తకాయలతో శివుని పూజిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అనేది శివపురాంతర్గతం. నల్లటి ఉమ్మెత్త మొక్కకు పాలు కలిపిన నీళ్ళు 40రోజులు పోస్తే అపమృత్యుభయం తొలగుతుందనే నమ్మకమూ ఉంది.
రసాయనిక ప్రాముఖ్యత: ఉమ్మెత్త మొక్కలో ఎన్నో విలువైన ఆల్క లాయిడ్స్ ఉన్నాయి. అవేగాక ఎట్రోపైన్,స్కోపోలమైన్, హిస్టోలియమైన్, నికోటినమైన్, హయోసైన్, హయాసయోమిన్ వంటి మరెన్నో రసాయనిక పదార్థాలు కూడా ఉమ్మెత్త మొక్కలో ఉన్నాయి.
మొక్కలోని అన్ని భాగాలు ఔషధాలే: ఉమ్మెత్త మొక్క కాండం, ఆకులు, పుష్పాలు, వేర్లు, కాయలు అన్నీ కూడా చక్కని ఔషధ గుణాలు కలిగివున్నాయి.
ఆకులు-చెవిపోటు, గాయిటర్, కీళ్లనొప్పులు వంటి వ్యాధులను తగ్గిస్తాయి. వేర్లు-పైల్సు, పన్నుపోటులను నయం చేస్తాయి. విత్తనాలు- జ్వరం, పిప్పిపన్నుపోటు, మానసిక రుగ్మతలను అరికడతాయి. పుష్పాలు- పేలు చుండ్రు తగ్గించడంలో ఉపకరిస్తాయి.
సయాటికా నివారణలో: ఉమ్మెత్త, మాదర్, ఎడ్యూజా, నిర్గుండి, జకయాన్, సహజంగా మొక్కల ఆకులు ఒక్కొక్క రకానికి ఆరేసి గ్రాములు తీసుకోవాలి.
వీటిని మెత్తని చూర్ణముగా చేసి ఆవనూనెతో కలిసి సంబంధిత శరీరభాగంపై మర్దనా చేస్తే సయాటికా బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.
పేలు, చుండ్రు, చర్మవ్యాధులు: ఉమ్మెత్త మొక్క కాయలు, ఆకులు, పూలు, వేర్లు, కాండం అన్నీ కలిపి ఎండబెట్టి భస్మం చెయ్యాలి. ఈ భస్మాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే పేలు, చుండ్రు తగ్గుతాయి. ఇదే భస్మాన్ని ఆవనూనెతో కలిపి ఉపయోగిస్తే ఎగ్జిమా వంటి చర్మవ్యాధులు నయమవుతాయి.
వాపులు, నొప్పులు: ఉమ్మెత్త ఆకులపై కొద్దిగా వేరుశనగనూనె రాసి గోరువెచ్చగా చెయ్యాలి. దీనిని నొప్పులపై వేసే కొద్దిగంటలలో వాపులు తగ్గుతాయి. అవసరమైతే తిరిగి వెయ్యవచ్చు. ఆకులపొడిని పసుపుతో కలిపి వేసినా కూడా వాపులు నయమవుతాయి.
పిచ్చికుక్క, కాటుకు విరుగుడు: ఉమ్మెత్త ఆకులు ముద్దగా చేసి కుక్క, కోతి కరిచిన చోట వేస్తే వారంలో గుణం కనబడుతుంది. ఈ ఆకులరసం, బెల్లం, పాలు, నెయ్యి సమపాళ్ళలో తీసుకొని సేవిస్తే పిచ్చికుక్క కాటుకు మంచి విరుగుడు. హైడ్రోఫోబియా రాకుండా కాపాడుతుంది.
ఆస్త్మా: ఎండిన ఉమ్మెత్త ఆకులను, చిలుములో వేసి వెలిగించి పొగపీలిస్తే ఆస్త్మా వ్యాధికి ఉపశమనం కలుగుతుంది. దగ్గుకూడా తగ్గుతుంది.
పిప్పిపన్ను: ఉమ్మెత్త విత్తనాలు బాగా నూరి పిప్పిపన్నులో పెడితే పన్నుపోటు నుంచి స్వస్థత కలుగుతుంది.
మూలశంఖ: ఉమ్మెత్త వేరును మెత్తగా దంచి పేస్ట్‌లా తయారుచేసి రాస్తే ఫైల్సు తగ్గుతాయి.
అన్ని రకాల జ్వరాలకు: ఉమ్మెత్తతో తయారుచేసిన ఆరోగ్యవటి మాత్రలు అన్ని జ్వరాలను హరిస్తాయి.
మానసిక వ్యాధులు: మూడు, నాలుగు ఉమ్మెత్త విత్తనాలను కొద్దిగా నెయ్యితో కలిపి, నూరి తీసుకుంటే అన్ని రకాల మానసిక రుగ్మతలు తగ్గుతాయి.
ఉమ్మెత్త నివారించే మరికొన్ని రోగాలు: చెవిపోటు, అల్సర్, గాయిటర్, గవదబిళ్ళలు, మూర్ఛ, వరిబీజం, సిఫిలిస్, మలేరియా, లైంగిక శక్తి తగ్గుట, జీర్ణశక్తి మందగించుట, కుష్టువ్యాధి వంటి రోగాలకు ఉమ్మెత్త చక్కటి ఔషధం. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతో మాత్రమే ఆయా రోగాల నివారణకు ప్రయత్నించాలి.
రక్తపోటును తగ్గించే ఉమ్మెత్త: ఉమ్మెత్త ఆకులతో కలిపి నూరితో పాదరసంను ఘనీభవిస్తుంది. ఘనరూపంలో ఉండే పాదరసాన్ని పూసలుగా మార్చి నల్లటి సిల్కుదారంతో గుచ్చి మెడలో ధరిస్తే రక్తపోటు స్థిరపడుతుంది.
ఉమ్మెత్తతో తయారుచేసే కొన్ని ఔషధాలు కనకతైలం, మృతసంజీవని, దతుర్ ఫల్‌వస్మ, దతూరాది ప్రలేపం, దుగ్దవిటి, కనకాసనం, దుర్దురాది తైలం, స్వల్ప జరాంకుశరసం, లఘువిషగర్వతైలం.
మందార పువ్వులువేసి వేడిచేసిన కొబ్బరినూనె తలకు పట్టించినచో వెంట్రుకలు ఊడటాన్ని నివారిస్తుం ది. ఇది ముఖ్యంగా స్త్రీలకు ఉపయోగకరంగా ఉంటుంది.
పేను కొరుకుడు, బట్టతల కలవారు ఈ పువ్వులను రుద్దుకొనిన వెంట్రుకలు మరల పెరుగును.
ఈ పువ్వుల కషాయం తీసుకుంటే గుండె జబ్బులు, మూత్ర వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చును
మందార పువ్వులు నేతిలో వేయించి తినిన రక్త విరోచనాలను తగ్గిస్తాయి.
మందార ఆకులను పేస్ట్‌గా చేసి తలకు పట్టిస్తే, శిరో జాలు మృదువుగా వుంటాయి.
ఇది శరీరంలోని వేడిని హరిస్తుంది.
మందార పూలను దేవీదేవతలకు అర్చనకు ఉపయో గిస్తారు.
ఎర్రటి పువ్వులను ముఖ్యంగా అమ్మవారికి అర్పిస్తారు. ఇంటిలో మందారం మొక్కలుంటే ఆ పూల అందం ఇంటికి మరింత అందాన్ని పెంచుతుంది.
గృహ శోభకు ఇంటిలో ఫ్లవర్‌వాజ్‌లో రకరకాల మందారం పువ్వులను పెడితే బాగుంటుంది. అయితే ఇవి తొందరగా వాడిపోతాయి.
ఇంటిలో అమ్మవారి ఫోటోలపై మందార పుష్పాలు వుంచితే, పూజా మందిరానికే కళ వస్తుంది.
ఇంటిలో ముద్దమందారం పువ్వులు చూపరులను అలరి స్తాయి. గుత్తులు, గుత్తులు వివిధ రంగుల ముద్ద మందా రం పువ్వులు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.
మన పెరట్లో విరివిగా ఉండే మొక్కల్లో మందార ఒకటి. మందార పువ్వులు అందంగా అలంకరించుకోవడానికే కాకుండా మన ఆరోగ్యానికి కూడా సాయపడతాయి. దీని పువ్వులు, ఆకులు కూడా ప్రయోజనకరమే.
పచ్చి ఆకుల్ని ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత కుంకుడుకాయ రసంతో తలంటు స్నానం చేస్తే శిరోజాలు పటిష్టంగా, మృదువుగా నిగనిగలాడుతాయి. ఈ ఆకుల ముద్దని పూతగా పూస్తే వాపులు, దెబ్బలు తగ్గుతాయి. మందార పువ్వుల్ని నీడలో ఎండబెట్టి, పొడిచేసి, నువ్వులనూనెతో కలిపి బాగా మరిగించి, వడబోసి, నువ్వులనూనేతో కలిపి బాగా మరిగించి, వడబోసి చల్లార్చుకోవాలి. ఇది చక్కటి హెయిర్ ఆయిల్‌గా పనిచేస్తుంది.
ఇది నిత్యం ఉపయోగిస్తే, తలమీది చర్మరోగాలు నశించడమే కాకుండా శిరోజాలు దృఢంగా ఒత్తుగా పెరిగి ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ చూర్ణాన్ని నేతిలో వేయించి, రోజూ ఒక చెంచా సేవిస్తే రక్తశుద్ధి జరిగి, చర్మరోగాలు నివారితమవుతాయి. మందార ఆకుల్ని నీడలో ఎండబెట్టి, పొడి చేసి, ఒక చెంచా చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి అనునిత్యం సేవిస్తే పురుషుల్లో కామశక్తి పెరుగుతుంది.
దురదగొండి ఆకులు దురదగొండి ఆకులు మూత్రపిండాలు ద్వారా మూత్రవిసర్జన సాఫీగా జరిగేట్లుగా చూస్తుంది. ఇవి యాంటీ బాక్టీరియల్ మరియు శరీరం నుండి రాళ్ళుగా ఏర్పడే స్పటికాకారాలను బయటకు నేట్టివేయటంలో సహాయపడతాయి. మీరు మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు రోజులో దురదగొండి ఆకుల టీ కనీసం 2 నుంచి 3 సార్లు సేవించాలి.
దానిమ్మలు దానిమ్మ రసాలు మూత్రపిండాల నొప్పి మరియు వ్యాధులు చికిత్సలో సహాయపడతాయి. వీటిలో రక్తస్రావ నివారిణి ప్రభావాలు ఉండటం వలన మూత్రపిండాల్లో రాళ్లను తొలగించే చికిత్సలో సహాయపడతాయి. మీరు ప్రతి రోజు దానిమ్మ రసం ఒకటి లేదా రెండు గ్లాసులు తీసుకున్నందువలన లేదా ప్రతి రోజూ ఒక దానిమ్మ తినటం వలన మూత్రపిండాల సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంచవచ్చు.
పుచ్చకాయ పుచ్చకాయలో నీరు అత్యధిక స్థాయిలో ఉంటుంది మరియు మీ శరీరాన్ని సార్ద్రతగా ఉంచుతుంది మరియు పనికిరాని పదార్థాలను బయటకు నేట్టివేయతంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండును రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది మరియు రాళ్ళను తొలగించటంలో ఉపయోగకరంగా ఉంటుంది.
టమోటో రసం నీటితో కలిపిన టమోటా రసాన్ని ఒక గ్లాసు తీసుకోండి. ఇది నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. టొమాటోలను కోసి మరియు ఒక మందపాటి కాటన్ గుడ్డలో చుట్టండి. దీనిని నొప్పితో బాధపడుతున్న వారి వెనుకభాగం మీద ఉపశమనం కోసం ఉంచండి.
నీరు మూత్రపిండాలకు నీరు అవసరం ఎందుకంటే మీ శరీరం నుండి విషాన్ని బయటకు నెట్టివేయటంలో నీరు సహాయపడుతుంది. మీరు రోజులో నీటిని కనీసం 8-10 గ్లాసులు త్రాగటం చాలా అవసరం.
Challa Krishna Rao, Syamasundarapuram village
No comments:
Post a Comment