పసుపుతో ఆరోగ్యం * పసుపే ఆరోగ్యానికి పసిడి
వ్యాధులు - నివారణోపాయాలు
* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
ఔషద
మొక్కల మిశ్రమంతో తయారు చేసిన తైలాలే కాకుండా జంతు శరీర భాగాలను కలిపి
చేసే తైలాలు కూడా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో కుట్లు వేయకుండానే
గాయాలను మాన్పే శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు లేదా శస్త్ర
చికిత్సల వల్ల అయిన గాయాలు, డె ర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్,
దెబ్బలవల్ల ఏర్పడిన పుండ్లు, వెరికోస్ అల్సర్ల వంటివి ఈ తైలాలతో చాలా
త్వరగా మానిపోతాయి.
అలాగే చర్మం ముడతలు, మొటిమల కారణంగా ఏర్పడే సన్నని గుంటలు ఇలా ఎన్నో రకాల సమస్యల నివారణలో ఆయుర్వేద తైలాలు గొప్పగా తోడ్పడతాయి. అలాంటి కొన్ని తైలాల వివరాలు మీకోసం...
తిలల (నువ్వులు) నుండి తీసిన నూనెలను తైలాలు అనడం పరిపాటి. అయితే ఆ తరువాత తిలల వంటి ఇతర నూనె గింజల నుండి తీసిన తైలాలను కూడా తైలాలుగానే పిలవడం మొదలయ్యింది. తైలాలకు ఔషధ మొక్కల కల్కాన్ని కలిపి తైలపాక విధిలో తయారుచేసిన నూనెల్ని కూడా తైలాలుగానే గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద తైలాలుగా బాగా ప్రసిద్ధి పొందాయి.
అయితే ఔషధ మొక్కలు కాకుండా కొన్ని జంతువుల భాగాలు తీసుకుని నూనెల గింజల నుండి తీసిన నూనెను కలిపిగానీ లేదా కలపకుండా గానీ కొన్ని తైలాలను తయారు చేస్తారు. అందులో భాగంగా ఈము పక్షి కొవ్వు, కాడ్ చేప లివర్ ఇలాంటివి తీసుకుని తైలపాక విధానం లేకుండా తైలాలు తయారు చేస్తారు. ఇందుకు భిన్నంగా అండతైలం (గుడ్డు నూనె), మూషికా తైలాలను మాత్రం తైలపాకవిధిలో తయారు చేస్తారు.
ఈము తైలం
ఈము ఒక ఆస్ట్రేలియన్ పక్షి పేరు. ఈ పక్షి వీపు పైన ఉండే కొవ్వును కరిగించడం ద్వారా ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు చాలా త్వరగా మానిపోయే అవకాశం ఉంది. గాయాలతో ఏర్పడిన మచ్చలు, అలాగే కీలాయిడ్స్‌ను నిరోధించడంలోనూ ఈ తైలాలు ఎంతో తోడ్పడతాయి. * క్రిమి, కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, దురద, మంట వాపులు ఈ తైలం రాస్తే తగ్గుముఖం పడతాయి. * డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధుల్లో చర్మం పైనున్న తేమ తగ్గి పొలుసులుగా రాలుతూ ఉంటుంది. పైగా వాపు, దురద కూడా ఉంటాయి. ఆ భాగాల్లో ఈ తైలాన్ని రోజూ రాస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంలోని తేమ ఇగిరిపోకుండా ఉంటుంది.
* గాయాలు కండరాల లోతుల్లోకి వె ళ్లినప్పుడు కొందరిలో గాయం పైకి కనిపించకపోవచ్చు. కానీ, కమిలినట్లు నల్లబడుతుంది. అలాంటి వాటి పైన ఈ తైలం రాస్తే వారంలోపే తగ్గిపోతుంది.
* ఈ తైలంతో మర్ధన చేస్తే చర్మ ముడతలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కొందరిలో వచ్చే అకాల వృద్దాప్య లక్షణాలకు ఈ తైలం సంజీవని లాంటి ది.
* శరీరం బరువు పెరగడం వల్లగానీ, గర్భధారణ వల్లగానీ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించడంలోనూ ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
* మొటిమలను తగ్గించడంలోనూ, మొటిమల కారణంగా ఏర్పడే పలుచని గుంటలను నివారించడంలోనూ ఈ తైలంతో చేసే ఫేషియల్స్ ఉపయోగపడతాయి.
చేపనూనె:
'కాడ్' అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు
* ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి.
* ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
గుడ్డు సొన నూనె
విరివిగా దొరికే అవకాశం ఉన్నందున ఈ తైలం తయారీకి కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. ఈ తైలంలోనూ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఉపయోగాలు:
చి కాలిన గాయాలకు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లకు, వెరికోస్ అల్సర్లకు ఈ తైలంతోవేసే పూత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలు చాలా త్వరగా కూడా మానతాయి.
చి ఈ తైలానికి తగు నిష్పత్తిలో కొబ్బెరినూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మూషికా తైలం ఎలుక మాంసానికి నువ్వుల నూనె చేర్చి తయారు చేసే తైలమిది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే కండరాలు తెగి వాలిపోయేటంతటి పెద్ద గాయాలు కూడా చాలా త్వరగా మానతాయి. * ఈ తైలం రాచపుండ్లు మానడంలోనూ బాగా తోడ్పడుతుంది.
* చర్మం పైన ముడతలు తగ్గడానికి, జారిన అవయవాలు (ప్రొలాప్స్ యుటెరస్/ రెక్టమ్) బిగువు పొందడానికి కూడా ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
చర్మవాధ్యులకు '' నాన్‌వెజ్ '' తైలాలు
అలాగే చర్మం ముడతలు, మొటిమల కారణంగా ఏర్పడే సన్నని గుంటలు ఇలా ఎన్నో రకాల సమస్యల నివారణలో ఆయుర్వేద తైలాలు గొప్పగా తోడ్పడతాయి. అలాంటి కొన్ని తైలాల వివరాలు మీకోసం...
తిలల (నువ్వులు) నుండి తీసిన నూనెలను తైలాలు అనడం పరిపాటి. అయితే ఆ తరువాత తిలల వంటి ఇతర నూనె గింజల నుండి తీసిన తైలాలను కూడా తైలాలుగానే పిలవడం మొదలయ్యింది. తైలాలకు ఔషధ మొక్కల కల్కాన్ని కలిపి తైలపాక విధిలో తయారుచేసిన నూనెల్ని కూడా తైలాలుగానే గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద తైలాలుగా బాగా ప్రసిద్ధి పొందాయి.
అయితే ఔషధ మొక్కలు కాకుండా కొన్ని జంతువుల భాగాలు తీసుకుని నూనెల గింజల నుండి తీసిన నూనెను కలిపిగానీ లేదా కలపకుండా గానీ కొన్ని తైలాలను తయారు చేస్తారు. అందులో భాగంగా ఈము పక్షి కొవ్వు, కాడ్ చేప లివర్ ఇలాంటివి తీసుకుని తైలపాక విధానం లేకుండా తైలాలు తయారు చేస్తారు. ఇందుకు భిన్నంగా అండతైలం (గుడ్డు నూనె), మూషికా తైలాలను మాత్రం తైలపాకవిధిలో తయారు చేస్తారు.
ఈము తైలం
ఈము ఒక ఆస్ట్రేలియన్ పక్షి పేరు. ఈ పక్షి వీపు పైన ఉండే కొవ్వును కరిగించడం ద్వారా ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు చాలా త్వరగా మానిపోయే అవకాశం ఉంది. గాయాలతో ఏర్పడిన మచ్చలు, అలాగే కీలాయిడ్స్‌ను నిరోధించడంలోనూ ఈ తైలాలు ఎంతో తోడ్పడతాయి. * క్రిమి, కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, దురద, మంట వాపులు ఈ తైలం రాస్తే తగ్గుముఖం పడతాయి. * డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధుల్లో చర్మం పైనున్న తేమ తగ్గి పొలుసులుగా రాలుతూ ఉంటుంది. పైగా వాపు, దురద కూడా ఉంటాయి. ఆ భాగాల్లో ఈ తైలాన్ని రోజూ రాస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంలోని తేమ ఇగిరిపోకుండా ఉంటుంది.
* గాయాలు కండరాల లోతుల్లోకి వె ళ్లినప్పుడు కొందరిలో గాయం పైకి కనిపించకపోవచ్చు. కానీ, కమిలినట్లు నల్లబడుతుంది. అలాంటి వాటి పైన ఈ తైలం రాస్తే వారంలోపే తగ్గిపోతుంది.
* ఈ తైలంతో మర్ధన చేస్తే చర్మ ముడతలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కొందరిలో వచ్చే అకాల వృద్దాప్య లక్షణాలకు ఈ తైలం సంజీవని లాంటి ది.
* శరీరం బరువు పెరగడం వల్లగానీ, గర్భధారణ వల్లగానీ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించడంలోనూ ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
* మొటిమలను తగ్గించడంలోనూ, మొటిమల కారణంగా ఏర్పడే పలుచని గుంటలను నివారించడంలోనూ ఈ తైలంతో చేసే ఫేషియల్స్ ఉపయోగపడతాయి.
చేపనూనె:
'కాడ్' అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు
* ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి.
* ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
గుడ్డు సొన నూనె
విరివిగా దొరికే అవకాశం ఉన్నందున ఈ తైలం తయారీకి కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. ఈ తైలంలోనూ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఉపయోగాలు:
చి కాలిన గాయాలకు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లకు, వెరికోస్ అల్సర్లకు ఈ తైలంతోవేసే పూత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలు చాలా త్వరగా కూడా మానతాయి.
చి ఈ తైలానికి తగు నిష్పత్తిలో కొబ్బెరినూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మూషికా తైలం ఎలుక మాంసానికి నువ్వుల నూనె చేర్చి తయారు చేసే తైలమిది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే కండరాలు తెగి వాలిపోయేటంతటి పెద్ద గాయాలు కూడా చాలా త్వరగా మానతాయి. * ఈ తైలం రాచపుండ్లు మానడంలోనూ బాగా తోడ్పడుతుంది.
* చర్మం పైన ముడతలు తగ్గడానికి, జారిన అవయవాలు (ప్రొలాప్స్ యుటెరస్/ రెక్టమ్) బిగువు పొందడానికి కూడా ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
వేధించే కాలినొప్పి... సయాటికా
సయాటికా..
ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి
ఉంటుంది. దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని
చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత
ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో సయాటికాకు
శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు వైద్యులు.
శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు, పిక్కల ద్వారా అరికాళ్లు, కాలివేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. మన వెన్నులో ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కొంత ఖాళీ ప్రదేశం, ఒక సయాటిక్ నరం, పూసలను బంధించి ఉంచే కొన్ని కండరాలు ఉంటాయి. మన దైనందిన పనుల్లోని కొన్ని లోపాల వల్ల కొందరిలో ఈ పూసలను బంధించి ఉంచే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా పూసల మధ్య సహజంగా ఉండవలసిన ఖాళీ తగ్గిపోతుంది. దీనివల్ల పూసల మధ్య ఉండే సయాటికా నరం ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల ఆ నరం శరీరంలో ఎంత దూరం వెళితే అంత దూరం నొప్పి వస్తూనే ఉంటుంది. సయాటిక్ నరం ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే సమస్య కావడం చేత దీనికి సయాటికా అన్న పేరు స్థిరపడింది. సయాటికాకు ఆయుర్వేద పరిభాషలో గృద్రసి వాతం అని పేరు.
లక్షణాలు
సయాటికా సమస్య ప్రారంభం కాగానే కనిపించే లక్షణం నొప్పి. ఆ తరువాత కొంత అసౌకర్యంగా ఉండటం, ఆ భాగంలో ఏదో కదిలినట్టు, చీమలు పాకినట్లు, పొడిచినట్లు అనిపిస్తుంది. తరువాత ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా తయారవుతుంది. వంగడం క ష్టమవుతుంది. ఒకవేళ వంగినా మళ్లీ లేవబోతే చురుకుపెట్టినట్లు అవుతుంది.ఈ లక్షణాలు తొంటి నుంచి కాలి వేళ్ల దాకా ఎక్కడైనా కనిపించవచ్చు. ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నడుము భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. రెండవ దశలో ఈ నొప్పి నడుము నుంచి పిరుదుల దాకా వెళుతుంది. ఈ దశలో కాస్త తైలమర్ధనం చేసుకున్నా నొప్పి తగ్గుతుంది. మూడవ దశలో నొప్పితో కాలంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే పొడిచినట్లు, మొద్దుబారినట్లు కూడా అనిపిస్తుంది. నాలుగవ దశలో నొప్పి కాలంతా పాకడమే కాకుండా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
పడుకుని మరో పక్కకు తిరగబోతే బలంగా చురుకు పెట్టినట్లు అవుతుంది. వంగినా లేచినా ఇదే పరిస్థితి ఉంటుంది. సయాటికా సమస్య ఉన్న వివాహితుల్లో చాలా మందిలో అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలు ఉంటాయి. సయాటికా సమస్యతో వచ్చిన వారికి ఈ సమస్య కూడా ఉంటే రెండింటికీ ఏకకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు. సమస్య మరీ తీవ్రమైతే కొందరిలో రెండు కాళ్లూ చచ్చుబడిపోవచ్చు. ప్రమాదాల్లో కూడా కొందరిలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సమస్య మొదలైన మూడుమాసాల్లోపే వస్తే ఇది సులభంగా తగ్గిపోతుంది. కనీసం ఏడాదిలోపు తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. మూడేళ్లు దాటాక చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు.
కారణాలు
సయాటికా రావడానికి అస్తవ్యస్తమైన జీవన శైలి ప్రధాన కారణం. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో కండరాలకు ఎక్కువగా శ్రమ ఉండదు. అరుదుగా ఎప్పుడైనా కాస్త ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ గంటలు నిలుచోవడం లేక కూర్చునే భంగిమలో తేడా వల్ల వెన్నుపాము అపక్రమానికి లోనయితే ఈ సమస్య తలెత్తుతుంది. రోజంతా కూర్చుని లేదా నిలుచుని ఉండే ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారు, మరీ ఎత్తయిన హీల్స్ ధరించేవారు, బెల్ట్‌ను మరీ బిగుతుగా పెట్టుకునే వారు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, ఏదైనా ప్రమాదానికి గురయిన వారు సయాటికా సమస్యకు గురికావచ్చు.
అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం, క్షయ, లైంగిక వ్యాధుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినపుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవే కాకుండా బాల్యంలో తగిలిన దెబ్బల తాలూకు దుష్ప్రభావం శరీరంలో ఉండిపోతుంది. అది పెద్దయ్యాక ఎప్పుడో శరీరం బలహీనపడినప్పుడు సయాటికాగా బయటపడవచ్చు. ముఖ్యంగా రోజూ చేసే పనుల వల్ల కాకుండా హఠాత్తుగా ఏదైనా బరువైన పనిచేసినప్పుడు ఈ సమస్య రావచ్చు. ఇక స్త్రీలలో అయితే, గర్భంతో ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ నడుము మీద పడే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపాల వల్ల సయాటికా సమస్య రావచ్చు.
వైద్య చికిత్సలు
ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. వీటిని డిస్కు బల్జ్, స్లిప్ డిస్క్, హెర్నియేటెడ్ డిస్క్, సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటారు. మొదటి మూడు దశల్లో సమస్యను ఆయుర్వేద మందులతోనే పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సల తరువాత ఎంఆర్ఐ రిపోర్టు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చివరి దశ అయినటువంటి సీక్వెస్ట్రమ్‌లో మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంది. సయాటికాకు ఆయుర్వేద వైద్యవిధానంలో పంచకర్మ చికిత్సలో భాగమైన మేరు చికిత్స బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద మందులతో పాటు ఆహార నియమాలను పాటిస్తే ఫలితం బాగుంటుంది.

అలసిన మనసుకు పునరుజ్జీవం ధారా చికిత్స
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జీవన వేగం మనిషి పై ఒత్తిడి పెం చుతోంది. ఉన్న దానిలో సంతృప్తి లేక లేని దాని కోసం ఆరాటపడటం అశాంతికి లోను చేస్తోంది. వేగంగా మారుతున్న జీవన వేగాన్ని, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిని మానవుడు అందుకోలేకపోతున్నాడు. దీనితో ఒంటరితనం, తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన, ఆగ్రహం, ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నాడు.
మనఃశరీరాలు ఎంత అవిభాజ్యమో, పరస్పర ఆధారితమో ఆయుర్వేదం సరి గా కనుగొన్నది. ఉద్వేగాలలో అసమతుల్యత, ఉద్రిక్తత, సంపూర్ణాహారం తీసుకోకపోవడం అనేవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. త్రిదోషాలలో ఒకటైన వాయు మనసును నియంత్రించి, ప్రోత్సహిస్తుంది. ఉద్వేగభరితమైన వాయు దోషం మనస్సును అతలాకుతలం చేయడం వల్ల భయం, దుఃఖం, నిస్సహాయత, స్తబ్దత, సన్నిపాతం వంటివి ఏర్పడతాయి. మనఃకాయక పద్ధతికి సంబంధించి స్పష్టమైన వైఖరి కలిగిన తొలి వైద్య విధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాల వర్గీకరణ ఈ ప్రకారం ఉంటుంది.
మానస వికార: అసూయ, భయ, చిత్తోద్వేగ, దైన్య, హర్ష, కామ, క్రోధ, లోభ, మద, మన్న, మోహ, శోక, విషాద, ఈర్ష్య, తమ, అతిప్రలాప, అస్వప్న, అతినిద్ర, భ్రమ.
ఉభయాత్మక మానస వికార: మానస అధిష్ఠాన ఉన్మాద, అపస్మార (epilepsy), అపతాంత్ర (hysteria)ü), అతత్వాభినివేశ (obsessive syndrome), మదత్యయ (alcoholic psychosis)), సన్య (coma)..
శరీర అధిష్ఠాన: కామ జ్వర, క్రోధ జ్వర, భయజ అతిసార, శోకజ అతిసార.
ధారా చికిత్స ప్రాధాన్యత:
పద్ధతి: కేరళీయ పంచకర్మలో ధారా ఒక ప్రత్యేక చికిత్స. ద్రవరూపంలో ఉన్న ఓషధులను నిర్ధిష్ట సమయం పాటు ధారగా శరీరం పై పోసే ప్రక్రియ. ఆయుర్వేద గ్రంథాలు దీనిని మూర్ధ తైల, శేక పరిశేకగా అభివర్ణించారు. దీనిని కేరళ సంప్రదాయ వైద్యులు మరింత మెరుగుపరచి, ప్రయోగాలు చేసి ‘ధారా చికిత్స’లో నైపు ణ్యం సాధించారు. ఇటీవలి కాలంలో కేరళీయ పంచకర్మ పద్ధతులలో ప్రముఖమైనదిగా పేరొందింది. ధారా చికిత్సలో కూడా మూడు రకాలు ఉన్నాయి. అవి:
1. మూర్ధాన్య ధార (శిరో ధార)
2. సర్వాంగ ధార (శరీరం మొత్తం)
3. పరిశేక (శరీరంలో ఒక చోట మాత్రమే చేసేది)
మూర్ధన్య ధారే శిరోధారగా ప్రాచుర్యం పొందింది. ద్రవ రూపంలో ఉన్న ఓషధులను నుదిటపై ధారగా పోస్తారు. దీనిని మానసిక రోగాలైన సైకోసిస్, పిచ్చి, అపస్మారకం, ఒత్తిడి, ఆందోళన, న్యూరోసిస్, అయోమయం, నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్స నిమిత్తం విజయవంతంగా ప్రయోగించారు. అయితే దోషాన్ని బట్టి ఓషధులు మారుతాయి.
శిరోధార రకాలు, సూచనలు:
తక్రధార : గ్లాని, ఓజక్షయ, శిరశూల, హృద్రోగ
క్షీర ధార: అనిద్ర, ఉన్మాద, శిరశూల, ఒత్తిడి
తైల ధార: శిరశూల, మానసిక వ్యాధి
ఘృతధార : అనిద్ర, పిత్త వ్యాధులు
వీటికి అదనంగా నారికేళ జల అరనాల కషాయాలు లేదా శుద్ధమైన నీటిని అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు.
ఓషధీ తైలాలను 4-8 ఇంచీల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా ఏర్పాటు చేస్తారు. వ్యాధిని బట్టి, దోషాన్ని బట్టి 30-90 నిమిషాల పాటు దీనిని కొనసాగిస్తారు.
శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం, ధ్యానం, చక్రాలను చైతన్యవంతం చేయడం, ధారగా ఓషధులను పోయడం వల్ల ఏర్పడే ఒత్తిడి ప్రభావం, దాని ఫలితాలు మనోవికారాలను నియంత్రించడంలో ఎంత దోహదం చేస్తుందో రుజువు అయ్యాయి.
గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు.
Challa Krishna Rao, Syamasundarapuram
No comments:
Post a Comment