Wednesday, 25 March 2015

మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే..?

మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే..?


         మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కువగా మంచి నీరు తాగాలి. అలాగే ఇతర ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఎముకలు గుల్లబారినప్పుడు లేదా ఎముకలు విరిగినప్పుడు కాల్షియం మాత్రలను వాడితే, అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి, తరువాత రాళ్లవుతాయి. అలాగే కాల్షియం, ఫాస్పేట్స్‌, ఆక్సిలేట్స్‌, ఇతర రసాయనాలు ఉండే ఆహారాలను తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి తులసి ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చెంచా తులసి ఆకుల రసం, ఒక చెంచా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా కనీసం ఆరు నెలలపాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. ఉలవచారు కూడా మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. దీనిలో బాగా నీళ్లు పోసి ఉడికించాలి. మరిగిన తరువాత పై నీటిని తీసుకుని చారు చేసుకోవాలి. ఇలా ఉలవచారు చేసుకుని రోజూ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

No comments:

Post a Comment