Monday, 23 March 2015

సుఖన్య సమృద్ధికి దరఖాస్తు ఇలా

సుఖన్య సమృద్ధికి దరఖాస్తు ఇలా
By Eenadu, 04 Feb 2015

రూ.వేయి చెల్లించి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది.* పథకం కొత్తగా వచ్చినందున ప్రభుత్వం 2 డిసెంబరు 2003 తర్వాత జన్మించిన బాలికల పేరు మీద మాత్రమే ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంది.* సుఖన్య సమృద్ధి పథకంలో ఖాతా ప్రారంభించిన వారికి ప్రభుత్వం 9.1 శాతం వడ్డీ అందిస్తుంది.* రూ. వేయితో ప్రారంభించిన ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు.* ఇలా ఖాతాలో వేసిన డబ్బుకు ప్రతి ఏటా వడ్డీ కలుపుతారు. మధ్యలో డబ్బులు తీసుకోవడానికి వీలుండదు.* బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. ఒకవేళ వివాహం జరిగే వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి డబ్బులు అందజేస్తారు. లేదంటే బాలికకు 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రతి నెలా రూ. వేయి చొప్పున ఖాతాలో వేస్తే వేయికి రూ. 91 వడ్డి చెల్లిస్తుంది.ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సుఖన్య సమృద్ధి యోజన పథకంపై అందరికి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఖాతాలను తీసుకొని ప్రయోజనం పొందాలి.ఖలీల్‌వాడి(నిజామాబాద్‌), న్యూస్‌టుడే: సమాజంలో ఆడ పిల్లలు సమాన అవకాశాలు.. ఉద్యోగాలు.. ఉన్నతమైన చదువు అందించాలని.. భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం 'బేటీ బచావో.. బేటీ పడావో' అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. బాలకల కోసం కొత్తగా 'సుకన్య సమృద్ధి యోజన' పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. పథకం ఖాతాను ఎక్కడ ప్రారంభించాలి, ఎంత డబ్బులు కట్టాలి, వడ్డీ ఎంత చెల్లిస్తారు.. అనే వివరాలు పూర్తి సమాచారం 'మీకోసం'.* జిల్లాలోని మూడు ప్రధాన తపాలా కార్యాలయాలు, 63 ఉప తపాలా కార్యాలయాల్లో పథకం అందుబాటులో ఉంది.* పదేళ్లలోపు బాలిక పేరుపై తల్లిదండ్రులు ఖాతాను ప్రారంభించవచ్చు.* ఒక బాలికపై ఒక్క ఖాతా తెరిచే అవకాశం ఉంది.* ఖాతాను తెరవడానికి బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తండ్రి, లేదా సంరక్షకుడి చిరునామా, గుర్తింపు తెలియజేసే పత్రాలు తప్పని సరి.* బాలికల పేరుతో ఖాతా ప్రారంభిస్తారో ఆమెకు సంబంధించిన రెండు పాస్‌పోర్టు సైట్‌ ఫొటోలు ఇవ్వాలి.* తపాలా కార్యాలయంలో ఇచ్చే దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, పైన తెలిపిన వివరాలు జతచేసి తపాలా కార్యాలయం పనివేళల్లో అందజేయాలి.* రూ.వేయి చెల్లించి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది.* పథకం కొత్తగా వచ్చినందున ప్రభుత్వం 2 డిసెంబరు 2003 తర్వాత జన్మించిన బాలికల పేరు మీద మాత్రమే ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంది.* సుఖన్య సమృద్ధి పథకంలో ఖాతా ప్రారంభించిన వారికి ప్రభుత్వం 9.1 శాతం వడ్డీ అందిస్తుంది.* రూ. వేయితో ప్రారంభించిన ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు.* ఇలా ఖాతాలో వేసిన డబ్బుకు ప్రతి ఏటా వడ్డీ కలుపుతారు. మధ్యలో డబ్బులు తీసుకోవడానికి వీలుండదు.* బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. ఒకవేళ వివాహం జరిగే వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి డబ్బులు అందజేస్తారు. లేదంటే బాలికకు 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రతి నెలా రూ. వేయి చొప్పున ఖాతాలో వేస్తే వేయికి రూ. 91 వడ్డి చెల్లిస్తుంది.ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సుఖన్య సమృద్ధి యోజన పథకంపై అందరికి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఖాతాలను తీసుకొని ప్రయోజనం పొందాలి.

No comments:

Post a Comment