ఇంటివైద్యం -- పల్లేరు
పల్లేరు చెట్టు వేర్లు, ఆముదం చెట్టు వేర్లు, పెద్ద ములక వేర్లు, చిన్నములక వేర్లు వీటిని సమంగా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి 30 గ్రాముల యవకుట చూర్ణాన్ని 1 కప్పు పాలకు కలిపి 1 కప్పు నీళ్లు చేర్చి, పాలు మాత్రమే మిగిలేంత వరకూ మరిగించి తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల్లోని రాళ్లు పడిపోతాయి. (చరకసంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని తేనెతోనూ, మేకపాలతోనూ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి. (సుశృత సంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని స్వర్ణమాక్షీక భస్మాన్ని గేదె పాలతో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగి పడిపోతాయి. (హారీత సంహిత)
ఒక కప్పు పాలకు 5 గ్రా. ద్రాక్ష పండ్లను, 5 గ్రా. పల్లేరు కాయలను వేసి మరిగించి, 3 గ్రాముల శతావరి వేరు చూర్ణాన్ని కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలోపల జరిగే రక్తస్రావాలు తగ్గుతాయి. (వృందమాధవ)
శతావరి వేరు చూర్ణాన్ని, పల్లేరు కాయలను పాలకు కలిపి మరిగించి, వడపోసి తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం అనే సమస్య తగ్గుతుంది. (చరక సంహిత)
పల్లేరు కాయలను, కంటకారి మొక్కను బెల్లంతో కలిపి పాయసంలాగా చేసుకొని తీసుకుంటే మూత్ర విసర్జనలో నొప్పి తగ్గుతుంది. (చరక సంహిత, అష్టాంగ సంగ్రహం)
పల్లేరు కాయల కషాయం, బెల్లం, పాలు, శొంఠి, వీటిని 4 రెట్లు నువ్వుల నూనెతో కలిపి, 16 రెట్లు నీళ్లు చేర్చి తైలం మాత్రమే మిగిలేంత వరకూ మరిగించి, చల్లార్చి వడపోసి కడుపు లోపలకు, వస్తికర్మల రూపంలోనూ తీసుకుంటే మూత్రంలో నొప్పి తగ్గుతుంది. (సుశృత సంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని యవక్షారంతో కలిపి తీసుకుంటే మూత్రంలో నొప్పి, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గుతాయి. (వృంద మాధవ, భావప్రకాశ)
పల్లేరు కాయల కషాయాన్ని తేనె, పంచదారతో కలిపి తీసుకుంటే మూత్రాశయ దోషాలు తగ్గుతాయి. (వంగసేన సంహిత)
పల్లేరు కాయలను పాలతోనూ, ఆముదం వేర్లతోనూ, శతావరి వేర్లతోనూ కలిపి పాలు, బెల్లం చేర్చి తీసుకుంటే మూత్రంలో నొప్పి తగ్గుతుంది. (వృంద మాధవ)
పల్లేరు మొక్క కషాయాన్ని పంచదార, తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల మూత్ర సంబంధ సమస్యలూ తగ్గుతాయి. (శారంగధర సంహిత, భావప్రకాశ)
పల్లేరు, ఉలిమిరిచెక్క, శొంఠి వీటి మిశ్రమంతో కషాయం తయారుచేసుకొని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గుతాయి. (్భవప్రకాశ)
పల్లేరు కాయల పేస్టును కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకుంటే మూత్ర వ్యవస్థలో నొప్పి తగ్గుతుంది. (వేద్యమనోరమ)
పల్లేరు కాయలను నువ్వు పువ్వులను సమంగా తీసుకొని తేనె, నెయ్యితో కలిపి పేస్టులాగ చేసి తలకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. (శారంగధర సంహిత)
పల్లేరు కాయల చూర్ణం, ఉసిరి చూర్ణం, తిప్పతీగ చూర్ణం వీటిని నెయ్యి, తేనెతో కలిపి తీసుకుంటే రసాది దాతువులను శక్తివంతం అవుతాయి. (అష్టాంగ హృదయం)
పల్లేరు కాయలు, చెరకు, శతావరి, దూలగొండి గింజలు, నాగబల, అతిబల వీటి చూర్ణాలను పాలతో కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది. (వృందమాధవ)
పల్లేరును పాలతో కలిపి ఉడికించి తీసుకుంటే ముసలితనంలో కూడా యవ్వనపు శక్తి వస్తుంది. (గద నిగ్రహం)
పల్లేరు కాయలను శొంఠిని నీళ్లకు వేసి మరిగించి క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ఆమవాతం, వాపులతో కూడిన కీళ్లనొప్పి తగ్గుతాయి. (చక్రదత్త)
*
పి.రమేష్ (సూర్యాపేట)
ప్రశ్న: స్వయంతృప్తి మంచిదేనని డాక్టర్లు చెబుతున్నారు. హోమోసెక్స్ని కూడా అలాగే భావించవచ్చా? ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో హోమోసెక్స్ అనేది కూడా సెక్సువల్ ఇన్స్టింక్స్ట్లో ఒక భాగమేనని, దీనిలో అసహజమేదీ లేదనీ రాశారు. ఆయుర్వేదంలో దీనిని గురించి ఏదన్నా వివరణ ఉందా?
జ: కొంతమంది డాక్టర్లు స్వయంతృప్తి (హస్తప్రయోగం) వల్ల హాని లేదని చెప్పటానికి కారణం వేరే ప్రత్యామ్నాయం లేకపోవటమే. ఈ సృష్టిని గమనించినపుడు లైంగికపరమైన కలయిక పరమావధి సంతాన జనకం కోసమేనని తెలుస్తుంది. దాంపత్య జీవనం గురించి ఆయుర్వేద వైద్యశాస్తప్రు అభిప్రాయం కూడా అదే. అందుకే సంహితా గ్రంథాలు స్వయంతృప్తిని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ప్రొక్రియేషన్ (సంతానోత్పత్తి) సృష్టి ధర్మం. అది సజావుగా జరగటం కోసం రిక్రియేషన్ అనేది బైప్రొడక్ట్గా ఉంటుంది. ఇదంతా స్ర్తి పురుషుల సమాగంతో జరుగుతుంది గాని స్వయంతృప్తితో కాదు.
చాలాకాలం నుంచి వైద్య వర్గాల్లో హస్తప్రయోగం గురించి, దానిలోని శాస్ర్తియత గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గతంలో స్ర్తిల తాలూకు హిస్టీరియా, మానియా వంటి మనో సంబంధ వ్యాధులకు కారణం వారు అనారోగ్య ధోరణుల్లో చేసుకునే స్వయంతృప్తేనని భావించేవారు. అందుకే స్ర్తిలకు క్లిటోరిస్ను తొలగించే ‘క్లైటోరిడెక్టమీ’ని, పురుషులలో వృషణాలను తొలగించే ‘క్యాస్ట్రేషన్’నూ చేసేవారు.
ఐతే, ఇటీవలి కాలంలో, ఇతర లైంగిక దురాచారాలతో పోలిస్తే హస్తప్రయోగం లేదా మాస్టర్ బేషన్ని హానిలేని ప్రక్రియగా కొంతమంది డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. దీని అర్థం రోజంతా హస్తప్రయోగంతో గడపమని కాదు. ఆయుర్వేదం దీనికో చక్కని ఉదాహరణ నిస్తుంది. మలం, మూత్రం, స్వేదం వంటివి మలాలు. ఇవి శరీరానికి అవసరం లేనివి. విసర్జింపబడాల్సినవి. అలా అని ఇవి విరేచనాలు, అతిమూత్రం, అతి స్వేదం వంటి వాటి ద్వారా ఎక్కువగా విసర్జింపబడితే ఏం జరుగుతుందో తెలిసిందే. హస్తప్రయోగం కూడా అంతే. హద్దుమీరితే దానిని మానసిక రుగ్మతగా భావించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఇహ, హోమోసెక్స్ విషయానికి వస్తే - యుక్త వయసు వచ్చిన తరువాత శరీరం, మనసు లైంగికావసరాల కోసం పరితపించడం సహజం. ఐతే, దానిని తీర్చుకోవడం కోసం అసహజమైన దారులను వెదుక్కోవటం మంచిది కాదు. హోమోసెక్స్ కూడా అంతే. ఇది పూర్తిగా అసహజమైనది. కాబట్టి అసహజమైన లైంగిక ప్రవర్తనలు - హోమోసెక్సువలిజం, వాయిరిజం, ట్రాన్స్వేస్టిజం వంటి వాటి జోలికి పోకుండా మనసును ఇతర వ్యాపకాలు - ఆటలు, లలిత కళలు, చదువు, కవిత్వం, రచనా వ్యాసంగం వంటి వాటి మీదకు మళ్లించటం మంచిది.

మీ సమస్యలు, సందేహాలు పంపించాల్సిన చిరునామా:
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, యూసఫ్గుడ, మెయన్ రోడ్,
అమీర్పేట, హైదరాబాద్.
ఫోన్ నెం. 924 657 5510

వీడొక దొంగ డాక్టర్, వేల రూపాయల డబ్బులు గుంజుతాడు రోగం తగ్గదు.
ReplyDeleteవీడి బార్య కొన్ని కంపెనీల మందులు ఓపెన్ చేసి వీళ్ళ డబ్బాలలో వేసి అదిక ధరలతో, ఆయుర్వేదంలో లేని పేర్లతో మార్చి రోజుకి లక్షల్లో వ్యాపారం.
ఒక రోగి నెలకు కనీసం 10 వేలు వీళ్ళకి కట్టాల్సిందే.
నాసనం అయిపోతారు వీళ్ళు. నేను వీడికి 60 వేలు దారపోసాను.
మీకు ఆయుర్వేదం కావాలంటే govt సిద్ద హాస్పిటల్స్ కు వెళ్ళండి మంచి వైద్యం లభిస్తుంది చవకగా.
ఇలాంటి శుంటల జోలికి పోకండి