మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని అందరికీ తెలుసు. కానీ మూత్రపిండాల్లోనే కాక మూత్రపిండాల నుంచి వచ్చే రెండు నాళాల్లో, మూత్రనాళంలో కూడా ఏర్పడవచ్చు. మహిళల కన్నా పురుషులే ఎక్కువగా మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడతారు. వీటి గురించి చాలా మందిలో అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా టమాట, పాలకూర కలిపి తింటే రాళ్లు ఏర్పడతాయని చాలా మందిలో ఉన్న అపోహ. ఇవి వాస్తవం కాదు. సాధారణంగా మూత్రపిండాల్లో ఏర్పడే 90 శాతం రాళ్లను (ఐదు నుంచి ఆరు మిల్లీమీటర్లు) పట్టించుకోనవసరం లేదు. ఇవి వాటంతటవే మూత్రంలోనే వెళ్లిపోతాయి. సరిపడినన్ని నీళ్లను తాగితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు.
లక్షణాలు ఏమిటి?
మూత్రపిండాల్లో రాళ్లు చేరిన వాళ్లందరికి లక్షణాలు ఒకేలా ఉండవు. రాళ్లు ఏర్పడే భాగాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స విధానం కూడా రాళ్ల సైజు, భాగాన్ని బట్టి ఉంటుంది. మూత్రనాళంలో రాళ్లు అడ్డంపడితే కిడ్నీ నుంచి వచ్చే మూత్రం కిందకు సులువుగా జారదు. దీంతో మూత్రపిండంపై ఒత్తిడి పెరిగి కిడ్నీ దెబ్బతినే అవకాశముంది. మూత్రపిండంలోనూ రాళ్లు ఉంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. కిడ్నీ నుంచి వచ్చే నాళంలో రాళ్లు ఉంటే కిడ్నీ, ఆ నాళంలో వాపు వచ్చే అవకాశముంది. కిడ్నీలు, నాళంలో రాళ్లు ఉంటే కడుపుపైభాగంలో నొప్పి, చలితో జ్వరం, మూత్రంలో రక్తం, వాంతులు, అకస్మాత్తుగా నొప్పిరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా రోజులు కిడ్నీలో రాళ్లు ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశముంది. చాలా వరకు మూత్రపిండాల్లో తయారైన రాళ్లు మూత్రాశయంలో పడి క్రమంగా ఇవి పెరుగుతాయి. మూత్రాశయంలో రాళ్లు ఉంటే మూత్రవిసర్జనలో మంట, రక్తం రావడం, తరచుగా మూత్రం రావడం జరుగుతాయి. మూత్రనాళంలో రాళ్లు అడ్డంపడితే మూత్రవిసర్జన ఇబ్బందిగా ఉండి, మూత్రం ఆగి చాలా అవస్థలు పడతారు. మూత్రనాళంలో రాళ్లు తయారయ్యే అవకాశాలు తక్కువ.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కచ్చితమైన కారణం లేదు. శరీర తత్వం, జన్యుపరమైన కారణాలు, మన అలవాట్లలో మార్పులు వల్ల ఇవి తయారవుతాయి.మూత్రంలో రాళ్లు తయారవడానికి ప్రధాన కారణం లవణాలు. అవి కాల్షియం, యూరిక్‌యాసిడ్, ఆక్సలేట్స్. ఇవి అందరిలో ఉంటాయి. మూత్రం శాతం తగ్గడం వల్ల, లేదా అవసరమైనంత మూత్రం ఉన్నా లవణాల సాంధ్రత పెరిగి క్రిస్టలైజేషన్ వల్ల రాళ్లుగా మారే అవకాశముంది. రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం నీళ్లను తక్కువ తాగడమే. రోజుకు రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల మూత్రం వస్తే వారిలోని లవణాలు స్పటికాలుగా ఏర్పడడం తక్కువ. ముఖ్యంగా మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్లలో యూరిక్ యాసిడ్, కొన్ని కారణాల వల్ల కాల్షియం సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటారు. వీళ్లలో రాళ్లు ఏర్పడే అవకాశముంది.
ఏం మానెయ్యాలి?
టమాట, పాలకూర తింటే రాళ్లు ఏర్పడతాయనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. వైద్యశాస్త్రంలో టమాట వల్ల రాళ్లు ఏర్పడతాయన్న విషయం గురించి ఎక్కడే పేర్కొనలేదు. ఏ ఆకుకూరలోనైనా ఆక్సలేట్స్ ఉంటాయి. వీటిని కలిపిగానీ, విడిగా కాని తినడం వల్ల రాళ్లు ఏర్పడవు. అందరూ ఒకే రకమైన భోజనం చేస్తున్నా కొందరిలో మాత్రమే మూత్రపిండాల్లోనే రాళ్లు ఏర్పడతాయి. జన్యుపరమైన కారణాల్లో శరీరంలో కంటికి కనపడని కొన్ని లోపాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే అవకాశముంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడమనేది చాలా అరుదు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం ఎక్కువ. ఎందుకంటే చలి కాలం చాలా చల్లగా ఉంటుంది, ఎండ కాలం చాలా ఎండగా ఉంటుంది. ఈ వాతావరణాలకు సర్దుకోవడానికి వీరికి చాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయి.

నివారణ:
కొత్తిమీర రసం తో కిడ్నీ లో రాళ్ళను కరిగించవచ్చు. ఒక కట్ట కొత్తిమీర తీసుకుని దానిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని నీటిలో వేసి ఓ పది నిముషాలు బాగా మరగనివ్వాలి. తరువాత ఆ నీటిని చల్లర్చి కొంత సేపు రిఫ్రిజిరేటర్ లో పెట్టి ఆ రసం కొద్దిగా కొద్దిగా రోజూ తీసుకుంటూ ఉంటే కిడ్నీ లో రాళ్ళు కరుగుతాయి. లేదా కొత్తిమేర ను మిక్సీ లో వేసి జ్యూస్ లా చేసి మనం తాగే నీళ్ళలో ఓ టీ స్పూన్ కలుపుకుని తాగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి.
పైన చెప్పినట్లుగా లవణాల వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఆ లవణాలను శుద్ధిచేసి బయటకు పంపే లక్షణాలు కొత్తిమేరలో ఉన్నట్లు ఆయుర్వేదం చెపుతున్నది.
No comments:
Post a Comment