Monday, 23 March 2015

సామెతలు

  1. సామెతలు 
  2. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
  3. అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
  4. అందని పండ్లకు అర్రులు చాచినట్లు
  5. అందని ద్రాక్షలు పుల్లన
  6. అందితే సిగ అందకపోతే కాళ్ళు
  7. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
  8. అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు
  9. అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
  10. అంధుడికి అద్దం చూపించినట్లు
  11. అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
  12. అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  13. అగ్నికి వాయువు తోడైనట్లు
  14. అటునుండి నరుక్కు రా
  15. అడకత్తెరలో పోకచెక్క
  16. అడగందే అమ్మ అయినా పెట్టదు
  17. అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
  18. అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
  19. అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
  20. అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
  21. అడుసు తొక్కనేల కాలు కడగనేల
  22. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
  23. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
  24. అతి వినయం ధూర్త లక్షణం
  25. అతిరహస్యం బట్టబయలు
  26. అత్త సొమ్ము అల్లుడు దానం
  27. అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
  28. అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
  29. అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
  30. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
  31. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
  32. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
  33. అద్దం అబద్ధం ఆడుతుందా !
  34. అనగా అనగా రాగం తినగా తినగా రోగం
  35. అనుమానం పెనుభూతం
  36. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
  37. అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
  38. అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
  39. అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
  40. అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
  41. అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
  42. అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?
  43. అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
  44. అప్పనుచూడబోతే రెప్పలు పోయినై
  45. అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది
  46. అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?
  47. అప్పిచ్చువాడు వైద్యుడు
  48. అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు
  49. అప్పు నిప్పులాంటిది...
  50. అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?
  51. అప్పు చేసి కొప్పు తీర్చిందట
  52. అప్పుచేసి పప్పు కూడు
  53. అప్పులేని వాడే అధిక సంపన్నుడు
  54. అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
  55. అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
  56. అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
  57. అభ్యాసము కూసువిద్య
  58. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  59. అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
  60. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
  61. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
  62. అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
  63. [[అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
  64. అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
  65. అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
  66. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
  67. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
  68. అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
  69. అరచేతిలో వైకుంఠం చూపినట్లు
  70. అవ్వాకావలెను బువ్వా కావలెను
  71. అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
  72. అరిచే కుక్క కరవదు
  73. అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు
  74. అర్దరాత్రి మద్దెల దరువు
  75. అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
  76. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
  77. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
  78. అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  79. అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
  80. అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  81. అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు.
  82. తాను ముక్కే
  83. ఆంతా ఆతాను ముక్కే
  84. మొద్దు లోదే పేడు
  85. ఆంబోతులా పడి మేస్తున్నావు
  86. ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
  87. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
  88. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు
  89. ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
  90. ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...
  91. ఆకారపుష్టి నైవేద్యనష్టి
  92. ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
  93. ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
  94. ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
  95. ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
  96. ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
  97. ఆడబోయిన తీర్థమెదురైనట్లు
  98. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
  99. ఆత్రగాడికి బుద్ది మట్టం
  100. ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
  101. ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
  102. ఆదిలోనే హంసపాదు
  103. ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు
  104. ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
  105. మరకా మరకా అడ్డగోడకి, మాటా మాటా పెద్దకోడలకి
  106. ఆయనే ఉంటే మంగలి ఎందుకు
  107. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
  108. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
  109. ఆరోగ్యమే మహాభాగ్యం
  110. ఆలస్యం అమృతం విషం
  111. ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
  112. ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
  113. ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
  114. ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
  115. ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
  116. ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
  117. ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
  118. ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
  119. ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
  120. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
  121. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
  122. ఇంటికన్నా గుడి పదిలం
  123. ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
  124. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
  125. ఇంట్లో పిల్లి వీధిలో పులి
  126. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
  127. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
  128. ఇద్దరు ముద్దు ఆపై వద్దు
  129. ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
  130. ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
  131. ఇల్లలకగానే పండగకాదు
  132. ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
  133. ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
  134. ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం 0ఢాలంగా ఉండాలి
  135. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
  136. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
  137. ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
  138. ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం
  139. ఇల్లు పీకి పందిరి వేసినట్లు
  140. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
  141. ఇల్లలకగానే పండగ కాదు
  142. ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు
  143. ఈశ్వరుడుకి విభూది లెకుంటె పార్వతి పాండ్స్ అడిగినట్లు
  144. ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
  145. ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
  146. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
  147. ఉపాయం లేని వాడిని ఊళ్ళోనంచి వెళ్ళగొట్టమన్నారు
  148. ఉన్న మాటంటే ఉలుకెక్కువ
  149. ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
  150. ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
  151. ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
  152. ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
  153. ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు
  154. ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
  155. ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
  156. ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
  157. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి
  158. ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
  159. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
  160. ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి
  161. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
  162. ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
  163. ఊరికి ఉపకారి ఆలికి అపకారి
  164. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
  165. ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
  166. ఎంత చెట్టుకి అంత గాలి
  167. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
  168. ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
  169. ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
  170. ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
  171. ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
  172. ఎత్తిపోయే కాపురానికి కాలు పెడితేనేమి?
  173. ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
  174. ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
  175. ఎద్దు పుండు కాకికి ముద్దు
  176. ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
  177. ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
  178. ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
  179. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
  180. ఎవడి బ్లాగుకు వాడే సుమన్ అని
  181. ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
  182. మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
  183. ఎండకి గొడుగు పట్టాలన్నట్లు
  184. చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
  185. ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
  186. ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
  187. ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
  188. ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
  189. ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
  190. ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
  191. ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
  192. ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
  193. ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి కాని పీనుగుల వల్ల కాదు
  194. ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
  195. ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
  196. ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
  197. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
  198. ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య
  199. ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
  200. ఒక దెబ్బకు రెండు పిట్టలు
  201. ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే
  202. ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
  203. ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
  204. ఓర్చినమ్మకు తేట నీరు
  205. ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
  206. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
  207. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
  208. అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
  209. అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
  210. అంచు డాబే కాని, పంచె డాబు లేదు
  211. అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
  212. అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
  213. అంతంత కోడికి అర్థశేరు మసాలా.
  214. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
  215. అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
  216. అంతా మనమంచికే.
  217. అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
  218. అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
  219. అందని ద్రాక్ష పుల్లన
  220. అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
  221. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
  222. అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
  223. అందితే జుట్టు అందకపోతే కాళ్లు
  224. అందితే తల, అందకపోతే కాళ్లు
  225. అంధుడికి అద్దం చూపించినట్లు
  226. అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు
  227. కంగారులో హడావుడి అన్నట్లు
  228. కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
  229. కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
  230. కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
  231. కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
  232. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
  233. కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  234. కంచేచేను మేసినట్లు
  235. కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
  236. కంటికి రెప్ప కాలికి చెప్పు
  237. కంటికి రెప్ప దూరమా
  238. కండలేని వానికే గండం
  239. కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
  240. కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
  241. కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
  242. కంపలో పడ్డ గొడ్డు వలె
  243. కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
  244. కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు
  245. కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
  246. కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
  247. కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
  248. కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
  249. కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
  250. కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
  251. కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
  252. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
  253. కణత తలగడ కాదు. కల నిజం కాదు
  254. కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు పక్షిగాదు చెట్టుపైన నుండు జలము దాల్చి యుండు నీల మేఘుండు గాడు దీని భావమేమి తిరుమలేశ
  255. కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు...
  256. కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
  257. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
  258. కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకోన్నట్లు
  259. కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
  260. కలసి ఉంటే కలదు సుఖం
  261. కల కాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడు
  262. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
  263. కల్లు త్రాగిన కోతిలా
  264. కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
  265. కాకి పిల్ల కాకికి ముద్దు
  266. కాగల కార్యం గంధర్వులే తీర్చారు
  267. కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
  268. కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
  269. కాలు కాలిన పిల్లిలా
  270. కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
  271. కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
  272. కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
  273. కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
  274. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
  275. 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి అందిట.
  276. కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
  277. కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
  278. కుక్క కాటుకి చెప్పు దెబ్బ
  279. కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
  280. కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
  281. కుక్కతోక వంకరన్నట్లు...!
  282. కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
  283. కూటికి లేకున్నా కాటుక మాననట్లు
  284. కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
  285. కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
  286. కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
  287. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  288. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
  289. కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు
  290. కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
  291. కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
  292. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
  293. కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
  294. కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
  295. [[కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
  296. కోరి కొరివితో తల గోక్కున్నట్టు
  297. కోటి విద్యలు కూటి కొరకే
  298. కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
  299. కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
  300. కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
  301. కోస్తే తెగదు కొడితే పగలదు
  302. క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
  303. కల్ల పసిడికి కాంతి మెండు
  304. గంగిగోవు పాలు గరిటడైన చాలు
  305. గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
  306. గంతకు తగ్గ బొంత
  307. గతి లేనమ్మకు గంజే పానకము
  308. గాజుల బేరం భోజనానికి సరి
  309. గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
  310. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
  311. గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
  312. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
  313. గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
  314. గుంపులో గోవిందా
  315. గుడ్డి కన్నా మెల్ల నయము కదా
  316. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
  317. గుడ్డోడికి కుంటోడి సాయం
  318. గుడ్డెద్దు చేలో పడినట్లు
  319. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
  320. గురివింద గింజ తన నలుపెరగదంట
  321. గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
  322. గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..!
  323. గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
  324. గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
  325. గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
  326. గూటిలో కప్ప పీకితే రాదు
  327. గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు
  328. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
  329. గోడకేసిన సున్నం
  330. గోతి కాడ నక్కలా
  331. గోరంత ఆలస్యం కొండొంత నష్టం
  332. గోరుచుట్టు మీద రోకటిపోటు
  333. గాడిదకు తెలియునా గంధం పొడి వాసన;పంది కేమి తెలియును పన్నిటి వాసన
  334. చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
  335. చక్కనమ్మ చిక్కినా అందమే
  336. చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
  337. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
  338. చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
  339. చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
  340. చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
  341. చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
  342. చనిపోయిన వారి కళ్ళు చారెడు
  343. చల్లకొచ్చి ముంత దాచినట్లు
  344. చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
  345. చాప క్రింది నీరులా
  346. చారలపాపడికి దూదంటి కుచ్చు
  347. చారాణా కోడికి భారాణా మసాలా
  348. చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
  349. చింత చచ్చినా పులుపు చావనట్టు
  350. చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
  351. చిత్తశుద్ది లేని శివపూజలేల
  352. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
  353. చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
  354. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
  355. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
  356. చెడపకురా చెడేవు
  357. చెప్పేవాడికి వినేవాడు లోకువ
  358. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
  359. చెముడా అంటే మొగుడా అన్నట్టు
  360. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
  361. చెవిలో జోరీగ
  362. చేతకాక మంగళవారమన్నాడంట
  363. చేత కానమ్మకి చేష్టలెక్కువ
  364. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
  365. చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
  366. చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...
  367. చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
  368. చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
  369. ఛారాన కోడికి బారాన మసాల.
  370. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
  371. జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
  372. జన్మకో శివరాత్రి అన్నట్లు
  373. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
  374. జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
  375. జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
  376. జుట్టున్నమ్మ కొప్పు పెట్టినా అందమే
  377. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
  378. జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
  379. జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
  380. జుట్టు అంటూ ఉంటే జడైనా వేసుకొవచ్చు
  381. డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
  382. డబ్బు కోసం గడ్డి తినే రకం
  383. డబ్బుకు లోకం దాసోహం
  384. డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
  385. డౌలు డస్తు పగలు పస్తు
  386. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
  387. డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు
  388. డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస
  389. డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును
  390. తంగేడు పూచినట్లు
  391. తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
  392. తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
  393. తంబళ అనుమానము
  394. తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
  395. తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
  396. తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
  397. తగిలిన కాలే తగులుతుంది
  398. తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
  399. తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
  400. తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
  401. తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
  402. తడిశిన కుక్కి బిగిశినట్టు
  403. తడిశి ముప్పందుం మోశినట్టు
  404. తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
  405. తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
  406. తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
  407. తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
  408. తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
  409. తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
  410. తనకు కానిది గూడులంజ
  411. తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
  412. తడి గుడ్డతో గొంతులు కొయ్యడం
  413. తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
  414. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
  415. తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
  416. తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
  417. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
  418. తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
  419. తల ప్రాణం తోకకి వచ్చినట్లు
  420. తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
  421. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
  422. తవుడు తింటూ వయ్యారమా?
  423. తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
  424. తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
  425. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
  426. తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
  427. తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
  428. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
  429. తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
  430. తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
  431. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
  432. తాతకు దగ్గులు నేర్పినట్టు
  433. తాదూర సందు లేదు, మెడకో డోలు
  434. తానా అంటే తందానా అన్నట్లు
  435. తామరాకు మీద నీటిబొట్టులా
  436. తాను దూర సందు లేదు తలకో కిరీటమట
  437. తినటానికి తిండి లేదు మీసాలకు సంపెంగ నూనె
  438. తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
  439. తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
  440. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
  441. తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి
  442. తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
  443. తిట్టను పోరా గాడిదా అన్నట్టు
  444. తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
  445. తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
  446. తినగ తినగ వేము తియ్యగనుండు
  447. తినబోతూ రుచులు అడిగినట్లు
  448. తిన్నింటి వాసాలు లెక్కేయటం
  449. తిమింగలాలకు చేప అయితే ఏమిటి?
  450. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
  451. తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
  452. తుమ్మితే ఊడి పొయే ముక్కు ఉన్నా ఒక్కటె ఊడినా ఒక్కటె
  453. తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
  454. తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
  455. తేలు కుట్టిన దొంగలా
  456. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
  457. తోక తెగిన కోతిలా
  458. తోక త్రొక్కిన పాములా
  459. తోక ముడుచుట
  460. తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
  461. దండం దశగుణం భవేత్
  462. దంచినమ్మకు బొక్కిందే దక్కుదల
  463. దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
  464. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
  465. దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...
  466. దాసుని తప్పు దండంతో సరి
  467. దిక్కులేనివారికి దేవుడే దిక్కు
  468. దిగితేనేగాని లోతు తెలియదు
  469. దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
  470. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
  471. దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
  472. దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
  473. దున్నపోతు మీద వానకురిసినట్లు
  474. దురాశ దుఃఖానికి చేటు
  475. దూరపుకొ౦డలు నునుపు
  476. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
  477. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
  478. దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
  479. దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
  480. దొందూ దొందే
  481. దొరికితే దొంగలు లేకుంటే దొరలు
  482. ధర్మో రక్షతి రక్షితః
  483. ధైర్యే సాహసే లక్ష్మి
  484. నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
  485. నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
  486. నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
  487. నలుగురితో నారాయణా
  488. నల్లటి కుక్కకు నాలుగు చెవులు
  489. నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
  490. నవ్విన నాపచేనే పండుతుంది
  491. నాగస్వరానికి లొంగని తాచు
  492. నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
  493. నిండా మునిగిన వానికి చలేంటి
  494. నిండు కుండ తొణకదు
  495. నిఙ౦ నిప్పులా౦టిది
  496. నిజం నిలకడమీద తెలుస్తుంది
  497. నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
  498. నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
  499. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
  500. నిప్పులేనిదే పొగరాదు
  501. నివురు గప్పిన నిప్పులా
  502. నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
  503. నీటిలో రాతలు రాసినట్లు
  504. నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
  505. నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
  506. నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
  507. నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
  508. నూరు చిలుకల ఒకటే ముక్కు
  509. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
  510. నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
  511. నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
  512. నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
  513. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
  514. నేతిబీరలో నేతి చందంలా
  515. నేల విడిచి సాము చేసినట్లు
  516. నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
  517. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
  518. నా కొడి కుంపటి లేకపొతే తెల్లారదు అన్నట్టు
  519. పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
  520. పండగ నాడు కూడా పాత మొగుడేనా?
  521. పండిత పుత్ర: పరమ శుంఠ:
  522. పండితపుత్రుడు... కానీ పండితుడే...
  523. పందికేంతెలుసు పన్నీరు వాసన
  524. పక్కలో బల్లెం
  525. పగలంతా బారెడు నేశా రాత్రికి రారా దిగ నేస్తా అన్నట్టు
  526. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
  527. పట్టుకోక ఇచ్చినమ్మ పీటకోడు పట్టుకు తిరిగిందంట
  528. పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
  529. పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
  530. పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
  531. పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
  532. పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
  533. పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
  534. పళ్లూడగొట్టుకోడానికి రాయైతేనేమి?
  535. పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది
  536. పావలా కోడికి ముప్పావలా దిష్టి
  537. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
  538. పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేలు లెక్కెసు కుందట
  539. పాలు, నీళ్ళలా కలిసిపోయారు
  540. పిండి కొద్దీ రొట్టె
  541. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
  542. పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
  543. పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
  544. పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
  545. పిచ్చోడి చేతిలో రాయి
  546. పిచ్చోడికి పింగే లోకం
  547. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
  548. పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ వుండవచ్చునన్నాడంట
  549. పిల్లికి కూడాబిచ్చం పెట్టనివాడు
  550. పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం
  551. పుండుకు పుల్ల మొగుడు
  552. పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు
  553. పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
  554. పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు
  555. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
  556. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
  557. పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
  558. పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
  559. పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
  560. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
  561. ప్రేమ గా ఏం వండిపెట్టనూ అంటే వెన్నతో అట్టేయమన్నాడంట
  562. పెరుగుట విరుగుట కొరకే
  563. పెళ్ళాము అంటే బెల్లము తల్లి తండ్రి అల్లము
  564. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
  565. పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
  566. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
  567. పైన పటారం, లోన లొటారం
  568. పొట్టోడికి పుట్టెడు బుద్దులు
  569. పొమ్మనలేక పొగపెట్టినట్లు
  570. పొయ్యి దగ్గర పోలీసు
  571. పొరుగింటి పుల్లకూర రుచి
  572. పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
  573. బతకలేక బడి పంతులని
  574. బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
  575. బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
  576. బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు
  577. బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు
  578. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు
  579. బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
  580. బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
  581. బుగ్గ గిల్లి జోల పాడటం
  582. బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
  583. బెల్లం చుట్టూ ఈగల్లా
  584. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
  585. బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
  586. భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి అప్పుడే పుడతాడు
  587. బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
  588. భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
  589. భక్తిలేని పూజ పత్రి చేటు
  590. మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  591. మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
  592. మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
  593. మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు
  594. మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
  595. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
  596. మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
  597. మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
  598. మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
  599. మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
  600. మంచి మనిషికొక మాట మంచి గొడ్డుకొక దెబ్బ
  601. మందుకని పంపిస్తే మాసికం నాటికి వచ్చే రకం
  602. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
  603. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
  604. మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
  605. మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
  606. మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
  607. మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
  608. మింగ లేక మంగళవారం అన్నాడట
  609. మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
  610. ముంజేతి కంకణానికి అద్దమేల ?
  611. మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
  612. ముందు నుయ్యి వెనుక గొయ్యి
  613. ముందుంది ముసళ్ళ పండుగ
  614. ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
  615. ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
  616. ముడ్డిలో పుండు మామగారి వైద్యం
  617. ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
  618. ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
  619. మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు
  620. మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టు
  621. మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
  622. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
  623. మొండివాడు రాజు కన్నా బలవంతుడు
  624. మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
  625. మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
  626. మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
  627. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
  628. మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
  629. మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
  630. మొరిగే కుక్క కరవదు
  631. మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
  632. మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
  633. మౌనం అర్ధాంగీకారం
  634. మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
  635. ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట
  636. మంచానికి అడ్డం, మతానికి ఎదురు
  637. రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
  638. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
  639. రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
  640. రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు
  641. రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?
  642. రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
  643. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు
  644. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట
  645. రెక్కాడితే గానీ డొక్కాడదు
  646. రెంటికీ చెడిన రేవడి చందాన
  647. రెడ్డొచ్చె మొదలాడు
  648. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
  649. రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
  650. రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
  651. రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
  652. రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
  653. రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
  654. రౌతు కొద్ది గుర్రం
  655. లంఖణం పరమౌషధం
  656. లంఖణం చెయ్యమంటేనే ఉపవాసానికి ఒప్పుకున్నట్టు
  657. లేడికి లేచిందే పరుగు
  658. లేని దాత కంటే ఉన్న లోభి నయం
  659. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
  660. వంగలేక మంగళవారం అన్నాడంట
  661. వండుకు తినేవాడికి ఒక కూర అడుక్కు తినేవాడికి అరవైనాలుగు కూరలు
  662. వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
  663. వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే, కారెడ్ల కామక్క వంకాయల భారం తూగిందట.
  664. వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ
  665. వస్తే కొండ పోతే వెంట్రుక
  666. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు
  667. వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  668. విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
  669. వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
  670. వీపు విమానం మోత మోగుతుంది
  671. వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు
  672. వేపకాయంత వెర్రి
  673. వేగం కన్నా ప్ర్రాణం మిన్న
  674. వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
  675. వేసేటప్పుడు వేప మొక్క తీసేటప్పుడు అమ్మవారు
  676. వాడికి సిగ్గు నరమే లేదు
  677. విగ్రహపుష్టి నైవేద్యనష్టి
  678. వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
  679. విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
  680. వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు
  681. వంకరటింకర పోతుంది పాము కాదు
  682. శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
  683. శృతి ముదిరి రాగాన పడింది
  684. శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
  685. శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట
  686. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
  687. శతకోటి లింగాలలో బోడిలింగం
  688. శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
  689. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
  690. శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
  691. శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు
  692. శొంఠి లేని కషాయం లేదు
  693. శ్వాస ఉండేవరకే ఆశ ఉంటుంది
  694. షండునికి రంభ దొరికినట్లు
  695. సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
  696. సంతులేని ఇల్లు చావడి కొట్టం
  697. సంతోషమే సగం బలం
  698. సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
  699. సంపదలో మరపులు ఆపదలో అరుపులు
  700. సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
  701. సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది
  702. సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
  703. సత్రం భోజనం మఠం నిద్ర
  704. సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
  705. సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
  706. సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
  707. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
  708. సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
  709. సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
  710. సింగడు అద్దంకి వెళ్లినట్టు
  711. సింగినాదం జీలకర్ర
  712. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
  713. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
  714. సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయట పడిందిట
  715. సొమ్మొకడిది సోకొకడిది
  716. సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
  717. సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు
  718. హనుమంతుడి ముందా కుప్పిగంతులు
  719. హనుమంతుడు... అందగాడు...
  720. హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు
  721. హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు
  722. క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
  723. క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి
  724. క్షేమంగా పోయి లాభంగా రండి

No comments:

Post a Comment