శ్రీ సాయిబాబా కాకడ హారతి
Shri
Saibaba Kakada Haarathi
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్
కీ జై
కరములు మోడ్చి నీ సన్నిథిలో సాయి గురుదేవ
విన్నపాలె వినుపింతుమయ పండరినాథ
తెలియగ లేని భక్తి ప్రపత్తుల తెలియగ జేసి
కరుణను యేలి కృపతోచూడుము సద్గురు రాయ
అనంతమగు నీ సేవ చేయగ ఆర్తిగ వేడితిమి
ఆపద్భాందవ అల్పులమయ్య అవలోకించకయ
భక్త తుకారామ్ వేడిన వేదన వింటివిగా
స్వామి మన్నన చేసి మా బంధములను త్రెంచుము దేవ
లెమ్ము పాండురంగ ప్రభాత సమయమ్మాయెగా
వైష్ణవ భక్తులు వరుసలు తీరి ముందుగ నిలిచారు
సురవర గణమె నిలిచె మహాద్వార పర్యంతమ్
గరుడ స్తంభం నుండె కొలిచేరు ఆద్యంతమ్
నారద తుంబుర శుకశనకాదులు వేచిరి నీకోసమ్
మధుర గానముల మేలుకొలుప కాచిరి నీకోసమ్
భక్తశ్రేష్ఠుడు నామదేవుడు అరుదెంచెను పాడ
సేవించగ నీ పదముల వ్రాల జనాభా ఇదేచే
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ
చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ
మోహాంబుధిలో తిరిగే జీవుల దారిచూపు చరణమ్
పాపనివారణ పరిహారమ్ముకు పరమపదమె చరణమ్
ఎన్ని జన్మల పుణ్యఫలము నీ పదములంటు
తరుణమ్ కూడదయ్య ఇక జన్మమాకిల నీదు చరణుశరణమ్
ఓం సాయినాధ మహరాజ భవతినిరనాశకరవి
అజ్ఞానాంధకారమణచి వెలుగు నింపుమాహరి నీదుమహిమ వర్ణింపమాతరమా దేవదేవ మరి
ఉనికిని తెలిపె మహిమాన్వితమె నీదు చరణ
కమలమ్ భవతాపములను హరియించె అ పదమె మాకు శరణమ్
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ
చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ
భక్తిగనిలిచిరి నీముంగిటయే భక్తకోటి అంత
జ్ఞానయోగుని దర్శనమ్ముకై సర్వప్రాణియంత
దివ్యధాముని కరుణరాముని కనగ వేచిరంత
దర్శనమ్ముతో పరవశించగా సకల భువనమంత
వరమై వెలసినావె దీనబంధు రమాకాంత పాహి
పాహి పరంధామ పాహిమామ్ పండరీశ
మధురనామ కలియుగేశ పాహిమామ్ సాయినాథ
జయతు జయతు చిద్విలాస జయతు సాయిరామ
బ్రహ్మ పాదమె ముక్తిమార్గమె
నీదుపాదయుగళమ్
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ
చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ
లెమ్ము పాండురంగ లెమ్ము దర్శనమౌ ఫలమిమ్ము
అరుణమ్మాయె ఆకాశమె నిదురలేచి రమ్ము
సాధు పుంగవులు మునివరేణ్యులె వేచి
నిలిచినారు
శయన సుఃఖమునె వదలి చూపుమా శుభకరవదనమునే
రంగ మండపమ్ మహాద్వారమున ఎదురుతెన్నులె చూసి
నిన్ను గాంచగా మా మది ఊగె దర్శనమీయవయ
అమ్మా రుక్మిణి కనవమ్మా నీ ప్రేమమీదుగా
మమ్ము
విఠలరూపుని దర్శనమొసగె భాగ్యమ్మును ఇమ్ము
గరుఢ్మంతుడు ఆంజనేయుడె ఎదురులు చూసేరు
సురలోకపు ఘణదేవులంత కొలువై వేచారు
హారతిలివ్వగ భక్తిగ నిలిచె సర్వలోకమంత
కాకడ హారతి పాడగ వేచిరి విష్ణుదాసునామా
పంచహారతుల హారతులివ్వరె ఘనముగ సాయికి
రండి రండి జయ సాయికి సేయ కాకడ హారతి
స్థిలచిత్తములతొ ధ్యానము చేసె వైభవ హారతి
కృష్ణనాథునకు దత్తసాయికి మనసుల హారతి
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కామక్రోధమదమత్సరంబులె వత్తిగ మలచితిమి
వైరాగ్యమనె నేతిని తడిపి శుధ్ధిగ
చేసితిమి
సాయిభక్తినే జ్వాలగ చేసి వెలిగించగ చూడ
సాయిసద్గురుని విశ్వరూపమె సాక్షాత్కరించె
కనుల
తత్త్వసారమె వేదరూపమె సాయిసర్వరూపమ్
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
భూమ్యాకాశము వ్యాపించితివో హృదయకమలవాస
దత్తరూపమై వెలుగుచుంటివో షిరిడీ పురవాస
నీవే దైవము నీవే సర్వము నీవే జీవమయ
ఆపదలందె దయమున కాచి అక్కునచేర్తువయ
ఎన్నగ తరమా వేల్పులకైన నీ లీలల మహిమ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
నీ యశ కీర్తులు దుండుగులై మామోగెను
విశ్వమున
పావన చరితుని పరంథామగన షిరిడి చేరె జనులె
నీ వచనామృత సారముసోకి దేహభ్రాంతి వీడె
వదలె మనసున దురభిమానమె పదములంటె నేడె
కృపను జూపి కరుణించరావయ దాసులమేమయ్య
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
భక్తిభావపు జ్యోతియె ఈ కాకడ జ్యోతి
పంచప్రాణములు నిండియున్న జీవమీజ్యోతి
చేకొనుమయ్య ఈ హారతి పండరినాథ
సాయిసద్గురునాథ
కరములు చాచి శరణంటిమయ నీపదపద్మముల
నీదు మహిమలు వర్ణింపగ లేరంతవారైన
నిను దర్శించగ తొలగునయ ఏ పాతకమైన
రాయిరఘుమ వాయి చేరి ఇరువంకల నిలిచి
మయూరపించపు చామరములతో వీచుటకై నిలిచె
తుకారాముడె దీపముపట్టి ప్రణమిల్లుతుపాడె
పాండురంగడు విఠలేశ్వరుడు శోభిల్లగ నిలిచె
రండి సాధుభక్తులారా పుణ్యమౌరండి
ప్రాణమునిలిచిన కొలువగలేము ఆ పరమాత్ముడనే
ఇటుకపైన నిలిచేను దేవుడె దర్శింతము రండి
విఠలదేవుని పాదకమలము ప్రార్ధించగ రండి
చేరగరండి దేవళమందున సాయిని చూడగనే
సర్వపాపములు పరిహరించు ఆ కాకడ హారతిలో
రుక్మిణి ప్రియునకు నివేదించగ వెన్నలు
ఇచ్చెదము
ఆలసించిన దోషము కలుగును స్వామి నివేదనకు
మ్రోగుచుండెగ ద్వారమందున భజంత్రీల హోరు
పంచప్రాణముల కాకడ హారతి ప్రజ్వరిల్లె
చూడు
శంఖనాదముల సింహభేరులె దిక్కులెల్లమ్రోగ
వందనమ్మయ వందనమిదిగో పాండురంగనీకు
సాయినాథగురు తల్లివినీవె ఆశ్రయమీయవె
తండ్రివినీవై
దత్తరాజగురు దైవమునీవె ఆశ్రయమీయవె
తండ్రివినీవై
సాయినాథగురు సర్వమునీవె దత్తరాజగురు
సద్గురునీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
శ్రీసత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్
కీ జై
ప్రభాతమాయె శుభమ్ముగ రవి ప్రభాకరుదయించె
స్మరించి గురువుని పదమ్ములంటిన
కలిదరిరాదాయె
జోడించి కరధ్వజమ్ము భక్తిగ సలుపగురు
ప్రార్ధన
సమర్ధసద్గురువా సాయినాథుడె మనోవాంఛతీర్చు
చీకటిబాపును భానుడె గురువుబాపు అజ్ఞానమె
కాని గురవుకి సాటిరాడుగ సూర్యదేవుడెపుడు
చీకటి మరల వచ్చును తిరిగిగాదు అజ్ఞానము
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
రవి అరుదెంచిన పటాపంచలౌ అంధకారమంత
గురుకృపతాకిన దుష్కృత్యములె అంతరించునంత
వదలిపోవుగా పాదమంటగ దురితమ్ములె అంత
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
త్రిమూర్తి రూపమె సాయినాథునిగ అవతరించె
భువిలో
జీవులనిలలో ఉధ్ధరించగ తలచె సాయి మదిలో
అనంతమయమౌ మహిమరూపమె సాయి సద్గురుండు
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
సమాథినొదిలి మసీదు చేర రమ్ము సాయినాథ
మథురవచనముల ఊరడించ మము తిరిగి సాయినాథ
ఆఖిల పాపముల బాపగనిలిచె నిఖిల జనావనుడె
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
ఆహా ఎంతటి భాగ్యము కనులె తెరచె స్వామి
ఆశ్రితవదనుడె తానై ఆపదలను తీర్చగ
ఇంతటి ఉపకారి ఈ జగతిన వేరే లేరుగ
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
ఎంతటి జ్ఞానైన గురుదేవుల కృపయేలేకున్న
వ్యర్ధము సుమ్మా జీవించగ ఈ ధరిలో
బ్రతికున్న
గురుపదచరణమ్మె భవ శరణం తిరుగేలేదన్న
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
హృదయమందున నిలిచియుండుమా స్వామిసాయినాథ
సమస్తజగమె గురుస్వరూపమని తెలియచూపరాద
సద్గుణమ్ముతో సాగిపోవు సద్బుధ్ధిని
మాకిమ్మ
సమర్ధసద్గురుసాయినాథ నిను చేరుదారినిమ్మ
ప్రభాత సమయంలో ఎవరయితే భక్తిశ్రధ్ధలతో ఈ
అష్టకాన్ని పఠించెదరో వారి భ్రమలు తొలగి మహత్తరమయిన మనశ్శాంతి పొంది సాయి
కృపాకటాక్షవీక్షణాలు కలిగి సుఃఖజీవనులగుదురు
శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి
Shri
Saibaba Madhyahna Haarathi
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్
కీ జై
చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి
ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి
భక్తులార రారండి కలసి ఇవ్వగ సాయికి హారతి
సాయిరామాథవ స్వామి నీకే హారతి
నిశ్చలమున మనసుంచి మదిని ధ్యానించే
మంత్రమ్
సాయిరాముని స్మరణమ్ సర్వజీవాధారమె
మంత్రమ్
కృష్ణనాథ దత్తసాయి మా చిత్తము నీదోయి
స్వామి సాయినాథ స్వామి మా సర్వము నీవోయి
హారతి సాయిబాబా
సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
కామక్రోధమొదిలించు సత్యమేదో వచించు
ముముక్ష మానవుల వసియించేవు రంగ నీవే
శ్రీరంగ
హారతి సాయిబాబా
భావన ఏదైతే అదే అనుగ్రహించె దయాధనా సాయి
ఇది ఏమి మాయ ఇది నీ మాయ
హారతి సాయిబాబా
స్వామి సాయి నామమే సుఖః సంతోష తీరమ్
అనాధ జీవులకే అదె ఆశ్రయసదనమ్ ఆనంద సదనమ్
హారతి సాయిబాబా
కలియుగ అవతార పరబ్రహ్మావతార
అవధరించినావయ్య
ఇల దత్తస్వరూప సాయి స్వరూప
హారతి సాయిబాబా
ప్రియమాయె గురువారమ్ పర్వదినమాయె భక్తుల
ప్రభుపదసేవలలో
భవభయములు బాపగ నీవే బాసట
హారతి సాయిబాబా
కోరము ఏ వరమూ నీ పదసేవ తప్ప
ఆ అభయముమీద స్వామి సాయిస్వరూప
ప్రేమస్వరూప
హారతి సాయిబాబా
దీనుల మము దయతో పాలింపుము దేవ
ఆశ్రిత వదనుడవై ఆలింపుము దేవ మమ్ముల
బ్రోవ
హారతి సాయిబాబా
సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ ధర్మము నిలకావగనే అవతారము
దాల్చి
నాస్తికులను సైతము తన ఆస్తికులుగ జేసె
నీలీలు సాగె ఎన్నెన్నో రూపాలై దీనులను
కాచేనిక సంకటములు బాపి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ యవన రూపమున మాకు దర్శనమే
ఇచ్చి
సంశయముల పిడదీసి సాగిల పడవేసి
మూఢులను కరుణించి తరియింపగజేసి
మోవిన వంశీ జన్ముడ లోకము పాలించె
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ భేధములెంచక హిందు ముస్లీమ్
ఒకటంటు
నరులంత ఒకటేయని పరభేధము వలదంటు
పలువురిని ఒకపరినే చూసేవుగ స్వామి
పరమాత్మవు నీవై సర్వమ్ముకు సాయి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ దేవా సాయీనాథ వందనము స్వామి
మాయామోహమునుండి మరలించుము మమ్ము
సంకటములనెల్ల నీ కృపతో తొలగించి
సేవించే భాగ్యమ్మును శక్తిని మాకిమ్మ
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ శిరిడి మా పండరీపురమ్
సాయిబాబా రమావరుడు
బాబా రమావరుడు సాయిబాబా రమావరుడు
శుధ్ధభక్తియె చంద్రభాగ భావరూపుడే
పుండరీకుడు
పుండరీకునీ భాగ నా భావరూపమె కాగ
రండు రండి భక్తుల్లార చేయగ సాయికి వందనమ్
సాయికి వందనమనరె స్వామి సాయికి వందనమనరె
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను
బ్రోవుము తండ్రి
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను
బ్రోవుము తండ్రి
సాయికి సాష్టాంగ వందనము పావనమూర్తికి
వందనము
పండరినాథ వందనము జయ జయ సాయికి వందనము
త్వమేవమాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్య
సఖత్వమేవ
త్వమేవవిద్యా దర్యంత్వమేవ త్వమేవ సర్వమ్
మమదేవ దేవ
సాయేనవాచ మనసేంద్రియైవ ఉద్యాత్మనావ
ప్రకృతి స్వభావ
తరీనియద్యత్ సకలమ్ పరస్మయ్ నారాయణాయైచి
సమర్పయామి
అచ్యుతమ్ కేశవమ్ రామనారాయణమ్ కృష్ణ
దామోదరమ్ వాసుదేవంభని
శ్రీధరమ్ మాధవమ్ గోపికా వల్లభమ్ జానకీ
నాయకమ్ రామచంద్రమ్ భజే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిహి ఓం గురుదేవదత్త హరిహి ఓం
శ్రీ సాయిబాబా ధూప్ హారతి
Shri
Saibaba Dhoop Haarathi (Sandhya Haarathi) హారతి
సాయిబాబా
సౌఖ్య దతామదేవ శరణమయ్య స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
కామక్రోధమొదిలించు సత్యమేదోవచించు
ముముక్షమానవుల వసియించేవు రంగ నీవే శ్రీ
రంగ
హారతి సాయిబాబా
భావన ఏదైతే అదే అనుగ్రహించె
దయాధనా సాయి
ఇది ఏమి మాయ ఇది నీ మాయ
హారతి సాయిబాబా
స్వామి సాయి నామమే
సుఃఖ సంతోష తీరం
అనాథ జీవులకె అదె ఆశ్రయ సదనమ్ ఆనంద సదనమ్
హారతి సాయిబాబా
కలియుగ అవతార పద బ్రహ్మావతార
అవథరించినావయ్య ఇల దత్తాస్వరూప
సాయి స్వరూప ప్రేమ స్వరూప
హారతి సాయిబాబా
ప్రియమాయె గురువారమ్ పర్వదినమాయె భక్తుల
ప్రభుపద సేవలలో భవభయములు బాపగ నివే బాసట
హారతి సాయిబాబా
కోరము ఏ వరము నీ పదసేవ తప్ప ఆ అభయము మీద
స్వామి సాయి స్వరూప ప్రేమ స్వరూప
హారతి సాయిబాబా
దీనుల మము దయతో పాలింపుము దేవ
ఆశ్రిత వదనుడవై ఆలింపుము దేవ మమ్ముల
బ్రోవ
హారతి సాయిబాబా
సౌఖ్య దతామదేవ శరణమయ్య స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
శిరిడి మా పండరీపురమ్ సాయిబాబా రమావరుడు
బాబా రమావరుడు సాయిబాబా రమావరుడు
శుధ్ధభక్తియె చంద్రభాగ భావరూపుడే
పుండరీకుడు
పుండరీకునీ భాగ నా భావరూపమె కాగ
రండి రండి భక్తుల్లార చేయగ సాయికి వందనమ్
సాయికి వందనమనరె స్వామి సాయికి వందనమనరె
పరుగునజేరి కావుము తండ్రి పతిత జనులను
బ్రోవుము తండ్రి
పరుగునజేరి కావుము తండ్రి పతిత జనులను
బ్రోవుము తండ్రి
సాయికి సాష్టాంగ వందనము పావనమూర్తికి
వందనము
పండరినాథ వందనము జయ జయ సాయికి వందనము
త్వమేవమాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్య
సఖత్వమేవ
త్వమేవవిద్యా దర్యంత్వమేవ త్వమేవ సర్వమ్
మమదేవ దేవ
సాయేనవాచ మనసేంద్రియైవ ఉద్యాత్మనావ
ప్రకృతి స్వభావ
తరోనియద్యత్ సకలమ్ పరస్మయ్ నారాయణాయైచి
సమర్పయామి
అచ్యుతమ్ కేశవమ్ రామనారాయణమ్ కృష్ణ
దామోదరమ్ వాసుదేవంభని
శ్రీధరమ్ మాధవమ్ గోపికా వల్లభమ్ జానకీ
నాయకమ్ రామచంద్రమ్ భజే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిహి ఓం గురుదేవదత్త|
శ్రీ సాయిబాబా షేజ్ హారతి
Shri
Saibaba Shej Haarathi
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి
సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ
నిరాకారమౌ దైవముమాకై రూపముదాల్చె బాబా
రూపముదాల్చె
విశ్వరూపమై సర్వమంతట సాయిగ మారే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి
సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ
సత్త్వరజోస్తమోగుణమ్ములె మాయాశృజనములె
బాబా మాయాశృజనములె
మాయలలోని మర్మములేవో తెలియును నీకే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి
సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ
సప్తసాగరములె మీ ఆటలస్థానములాయె బాబా
స్థానములాయె
ఆడుచుంటివట అనంతమౌనీ లీలలతోటి
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి
సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ
భ్రహ్మాండమ్మును సృష్టించెనుగా బాబా మాకై
స్వామి నీవే మాకై
కృపామయుండె నా స్వామి అని తుకారాము పాడే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి
సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత సాధు సంత భక్తులంత
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
పాండురంగడే వెలిసే ఇలజ్ఞానమ్ము తెలుప
హారతి జ్ఞానరాజా
గోపికలే నిలిచే ఘన హారతులివ్వ
నారద తుంబురులే శ్రావ్యగానాలు పాడె
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత మనసానందమొంద
హారతి జ్ఞానరాజా
ఈ సృష్టి మర్మమేలె విశ్వబ్రహ్మవయ్య
రామకృష్ణసాయి కనికరించుమయ్య
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత సాధు సంత భక్తులంత
హారతి జ్ఞానరాజా
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి
శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా
రామమహిమ తేలె రాళ్ళసంద్రమెటులో అటుల
కాచినావె దివ్య అభంగములనె
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి
శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా
పరబ్రహ్మనీవే స్వామి మహిమావతారా
రామేశ్వరుడు వేడే నిను శరణమ్ములంటు
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి
శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా
జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ
స్వామి
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
రంజిల్లునయ్య మామది అంత మథుర వచనముల నీదు
పలుకుల (౨, 2)
వ్యాధుల బాధల తీర్చెదవయ్య నీ నిజ భక్తుల
కనికరముంచి (౨, 2)
ఆపదలందున ఆభయమునీవై ఆశ్రయమొసగి
లాలించెదవు (౨, 2)
ఆలసిపోయె నీ దేహమంత నీ భక్తుల బాధలు
తీర్చగ
జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ
స్వామి
క్షమాశయనమే నీదుసెయ్య సుందరముగ
పుష్పాలకూర్చితిమి(౨, 2)
సేవించగ నిను చేరితిరయ్య నిను దర్శించగ
వేడితిరయ్య(౨, 2)
పంచప్రాణముల వత్తులు చేసి పంచ హారతులు
ఇచ్చితిరయ్య(౨, 2)
సుగంధ పరిమళ భరితమాయె నీ భక్తకోటి ఆ
సేవలు
జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ
స్వామి
నీచరణమ్ములె వీడగబోవ మా మది నొచ్చెను మరి
మరి స్వామి(౨, 2)
అనుమతి వేడితి స్వీకరించి నీ ప్రసాదమున నివాసమేగ(౨, 2)
తెలవారక మునురే తిరిగొచ్చి నీ చరణమ్ముల
వ్రాలెదమయ్య(౨, 2)
సుప్రభాతమ్ నీ సేవ చేయగ శుభములు మాకు
కలుగునయ
జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ
స్వామి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
వైరాగ్యమనే కుంచెను తుడిచి శుచిగా
చేసితిమి భవనము శుచిగా ఉంచితిమి
ప్రేమగ మనసున భక్తి జలముమను చుట్టూ
జల్లితిమి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
నవవిధ భక్తి పానుపున శయనించుము స్వామి, స్వామి సాయిబాబా
జ్ఞాన జ్యోతియే దివ్వెగ వెలదా శయ్యను
నిదురించు
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
సద్భావమనే పువ్వులనే సుఃఖ పాన్పున
పరచితిమి,
బాబా పాన్పున పరచితిమి
భక్తిశ్రధ్ధలను పానుపు చుట్టూ
ఆలంకరించితిమి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
ద్వైతక వాటము భంధన చేసి తెరలను దించితిమి, బాబా తెరలను దించితిమి
మనసుల చెడుల ముడులే తొలగె సుఃఖముగ
శయనించు
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
ఆశాకోరిక మోహావేశములన్ని వదలివవి, బాబా అన్ని వదలినవి
దయ క్షమ శాంతి నిను సేవించక వేచినవి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
నిష్కామమనే శాలువ పరచి పవలింపగ జేసి, బాబా పవలింపగ జేసి
సుఃఖముగ నీవే నిదురించవయ స్వామి సాయినాథ
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా
సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ
శ్రీ సత్ చిదానంద సద్గురు సాయినాథ్
మహారాజ్ కీ జై
శ్రీ గురుదేవ దత్త
దొరికేనయ్య సాయీశ నీ ప్రాసాదమ్మె మాయీశ
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు
వచ్చెదమయ్య సాయీశ సుఃఖ నిదురను పొమ్మా
పరమేశ
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు
దర్శన భాగ్యము నిమ్మా తిరిగి వేకువలోనే
స్వామి
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు
సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు
దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ
తలచిన చాలు తొలగింతు వయ కష్టములెల్ల, మా కష్టములెల్ల
ఆపద్భాందవ స్వామి సాయి హాయిగ నిదురించు
సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు
దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ
తీర్చగలేము నీ ఋణములనే సాయి గోపాలా, దేవ సాయి గోపాలా
భాగ్యము నీవే బంగరు తండ్రి హాయిగ
నిదురించు
ప్రభో సాయి లేచెదమయ్య వేకువ ఝామునే, స్వామి వేకువ ఝామునే
నీ సుభ దర్శనమొసగుము స్వామి మమ్ములనేలగనే
సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు
దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ
శ్రీ సత్ చిదానంద సద్గురి సాయినాథ్
మహారాజ్ కీ జై
రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్
మహారాజ్ కీ జై
శ్రీ సత్ చిదానంద సద్గురి సాయినాథ్
మహారాజ్ కీ జై||
No comments:
Post a Comment