దినోత్సవములు
జనవరి
1:
రహదారి భద్రతా దినోత్సవం
2:
ప్రపంచ శాంతి దినోత్సవం
3:
మహిళా టీచర్స్ డే
4:
వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
5:
సైనిక దినోత్సవం
9:
ప్రవాస భారతీయ దివస్
10:
ప్రపంచ నవ్వుల దినోత్సవం
11:
జాతీయ విద్యాదినోత్సవం
12:
జాతీయ యువజన దినోత్సవం
స్వామీ వివేకానంద జయంతి
15:
వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం
17:
ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
21:
మణిపూర్, మేఘాలయ,
త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
23:
సుభాష్‌చంబ్రోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
25:
ఇండియా టూరిజం దినోత్సవం,
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
26:
భారత గణతంత్ర దినోత్సవం,
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
30:
అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
ఫిబ్రవరి
1:
భారత తీర రక్షక దళ దినోత్సవం
2:
వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
4:
వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
11:
ప్రపంచ వివాహ దినోత్సవం
12:
జాతీయ ఉత్పాదనా దినోత్సవం,
గులాబీల దినోత్సవం.
14:
ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం
20:
మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
21:
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22:
ప్రపంచ స్కౌట్ దినోత్సవం, కవలల దినోత్సవం
24:
సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
25:
జాతీయ సైన్స్ దినోత్సవం.
మార్చి
4:
జాతీయ భద్రతా దినోత్సవం
5:
అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం
ప్రపంచ బధిరుల దినం
8:
అంతర్జాతీయ మహిళా దినం
9:
వరల్డ్ కిడ్నీ డే
10:
కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే
15:
ప్రపంచ పౌర హక్కుల దినం
18:
మానవ హక్కుల దినం
20:
సాంఘిక సాధికారత స్మారక దినం
21:
ప్రపంచ అటవీ దినం, ప్రపంచ అంగ వికలుర దినం, ప్రపంచ కవితా దినం
22:
ప్రపంచ జల దినోత్సవం
23:
ప్రపంచ వాతావరణ దినోత్సవం,
అమర వీరుల దినోత్సవం
24:
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
26:
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం
27:
అంతర్జాతీయ నాటక దినోత్సవం
28:
నేషనల్ షిప్పింగ్ దినోత్సవం
ఏప్రిల్
1:
ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
2:
పోలీస్ పతాక దినం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
5:
నేషనల్ మారిటైమ్ డే
7:
ప్రపంచ ఆరోగ్య దినం
8:
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
10:
ప్రపంచ హోమియోపతి డే
12:
ప్రపంచ రోదసీ దినోత్సవం
13:
జలియన్ వాలాబాగ్ సంస్మరణ
దినోత్సవం
14:
అగ్నిమాపక దినోత్సవం, అంబేద్కర్ జయంతి, మహిళా పొదుపు దినోత్సవం
15:
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
16:
తెలుగు రంగస్థల దినోత్సవం
17:
ప్రపంచ హిమోఫిలియా దినం
18:
ప్రపంచ సాంస్కృతిక దినం
21:
జాతీయ సమాచార హక్కుల దినం,
జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం
22:
ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23:
ప్రపంచ పుస్తకాల దినోత్సవం
25:
ప్రపంచ మలేరియా దినం
26:
సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం,
ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
28:
ప్రపంచ భద్రతా దినోత్సవం,
ప్రపంచ పశుచికిత్సా దినం
29:
అంతర్జాతీయ నృత్య దినోత్సవం
30:
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.
మే
1:
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం
3:
ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం
4:
బొగ్గు గని కార్మిక దినోత్సవం
5:
వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
6:
ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
7:
ఠాగూర్ జయంతి, నవ్వుల దినోత్సవం
8:
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
11:
జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం
12:
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం,
అంతర్జాతీయ వలస పక్షుల దినం
13:
మాతృ దినోత్సవం
15:
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
17:
ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
18:
ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే
21:
తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
22:
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
24:
కామనె్వల్త్ దినోత్సవం
27:
నెహ్రూ వర్థంతి
29:
వౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం,
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం
30:
గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
యు.ఎస్. స్ట్ఫా దినోత్సవం
31:
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.
జూన్
1:
అంతర్జాతీయ బాలల దినోత్సవం,
ప్రపంచ పాల దినోత్సవం
4:
అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం
5:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
8:
ప్రపంచ సముద్ర దినోత్సవం
12:
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
14:
పతాక దినోత్సవం
18:
గోవా స్వాతంత్య్ర దినోత్సవం
20:
తండ్రుల దినోత్సవం, మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21:
ప్రపంచ సంగీత దినోత్సవం
23:
ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
25:
ప్రపంచ అవయవ దాన, మార్పిడి దినోత్సవం
26:
ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
28:
పేదల దినోత్సవం
29:
గణాంక దినోత్సవం.
జూలై
1:
వైద్యుల దినోత్సవం, వాస్తు దినోత్సవం, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.
2:
ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
5:
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
6:
ప్రపంచ రేబిస్ దినోత్సవం
11:
ప్రపంచ జనాభా దినోత్సవం
12:
నాబార్డ్ స్థాపక దినోత్సవం
17:
పాఠశాలల భద్రత దినోత్సవం,
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
26:
కార్గిల్ విజయోత్సవ దినం
29:
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే
ఆగస్టు
1:
తల్లిపాల దినోత్సవం
2:
ఆంగ్లో ఇండియన్ దినోత్సవం
6:
హిరోషిమా దినోత్సవం
8:
క్విట్ ఇండియా దినోత్సవం
9:
నాగసాకి దినోత్సవం
10:
డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినం
12:
లైబ్రేరియన్స్ డే
13:
లెఫ్ట్‌హ్యాండర్స్ డే
15:
స్వాతంత్య్ర దినోత్సవం,
పశ్చిమ బెంగాల్ దినోత్సవం
18:
అంతర్జాతీయ స్వదేశీవాదుల దినం
19:
ప్రపంచ ఫొటోగ్రఫీ దినం
20:
సద్భావన దినం (రాజీవ్ గాంధీ జయంతి)
మలేరియా నివారణ దినం
24:
సంస్కృత దినోత్సవం
29:
తెలుగు భాష దినోత్సవం, జాతీయక్రీడా దినోత్సవంసెప్టెంబర్
1:
పోషక పదార్థాల వారోత్సవం
2:
కొబ్బరికాయల దినోత్సవం
4:
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ
దినోత్సవం (ఆంధ్రప్రదేశ్)
5:
ఉపాధ్యాయ దినం- రాధాకృష్ణన్
జన్మదినం
8:
ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
9:
వరల్డ్ ఫస్ట్‌ఎయిడ్ డే
10:
హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
14:
హిందీ దినోత్సవం
15:
ఇంజినీర్స్ దినోత్సవం, సంచాయక దినోత్సవం
16:
అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
17:
మహిళల మైత్రీ దినోత్సవం
20:
రైల్వే భద్రతాదళ వ్యవస్థాపక దినం
21:
బయోస్ఫియర్ దినం,
అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం,
ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం
22:
క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం, గులాబీల దినోత్సవం
24:
ప్రపంచ హృదయ దినోత్సవం, ప్రపంచ నదుల దినోత్సవం, ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం.
26:
చెవిటి వారి దినోత్సవం
27:
ప్రపంచ పర్యాటక దినోత్సవం
28:
అంతర్జాతీయ సమాచార హక్కుల దినం, గన్నర్స్ డే, వరల్డ్ హార్ట్ డే,
ప్రపంచ నదుల దినోత్సవం.
సెప్టెంబర్ 4వ ఆదివారం- కూతుళ్ల దినోత్సవం.
అక్టోబర్
1:
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, వన్యప్రాణి వారోత్సవాలు, జాతీయ తపాలా దినోత్సవం, స్వచ్ఛంద రక్తదాన దినం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం.
ప్రపంచ ఆవాస దినోత్సవం.
2:
మానవ హక్కుల పరిరక్షణ దినం, గాంధీ జయంతి, గ్రామ్‌స్వరాజ్ డే,
ఖైదీల దినోత్సవం.
ప్రపంచ జంతువుల దినోత్సవం
4:
ప్రపంచ జంతు సంక్షేమ దినం
5:
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
6:
వరల్డ్ స్మైల్ డే,
ప్రపంచ గృహవసతి దినం
8:
భారత వాయుసేన దినోత్సవం
రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ
దినోత్సవం
9:
ప్రపంచ పోస్ట్ఫాస్ దినోత్సవం,
న్యాయ సేవా దినం,
జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
10:
ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
12:
ప్రపంచ దృష్టి దినోత్సవం
13:
ప్రపంచ గుడ్డు దినోత్సవం
14:
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15:
అంతర్జాతీయ అంధుల ఆసరా దినం,
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
ప్రపంచ కవిత్వ దినం.
16:
ప్రపంచ ఆహార దినం
17:
అంతర్జాతీయ దారిద్ర నిర్మూలన
దినోత్సవం
21:
పోలీస్ సంస్మరణ దినం
23:
అంతర్జాతీయ పాఠశాల గ్రంథాలయ
దినోత్సవం
24:
ఐక్యరాజ్యసమితి దినోత్సవం,
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల
అవతరణ దినోత్సవం
27:
పదాతిదళ దినోత్సవం, శిశుదినోత్సవం
28:
అత్తవార్ల దినోత్సవం
30:
ప్రపంచ పొదుపు దినోత్సవం
31:
జాతీయ సమైక్యత దినోత్సవం,
జాతీయ పునరంకిత దినం,
ఇందిరాగాంధీ వర్ధంతి.
నవంబర్
1:
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం
7:
ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం,
బాలల సంరక్షణ దినం
8:
వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే
9:
లీగల్ సర్వీసెస్ దినం,
ప్రపంచ నాణ్యతా దినోత్సవం
10:
రవాణా దినం
11:
వెటరన్స్ డే, జాతీయ విద్యా
దినోత్సవం
14:
ప్రపంచ మధుమేహ దినోత్సవం,
ప్రపంచ బాలబాలికల దినోత్సవం,
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు,
జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.
17:
ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
19:
ప్రపంచ సాంస్కృతిక,
వారసత్వ దినం, పౌరుల దినోత్సవం
20:
యూనివర్సల్ చిల్డ్రన్స్ డే
21:
ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం, ప్రపంచ టెలివిజన్ దినం.
25:
అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం, జాతీయ జంతు సంక్షేమ దినం, ఎన్‌సిసి దినోత్సవం.
26:
జాతీయ న్యాయ దినోత్సవం,
సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
డిసెంబర్
1:
ప్రపంచ ఎయిడ్స్ దినం,
నాగాలాండ్ దినోత్సవం,
సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం
2:
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా
దినోత్సవం
4:
భారత నౌకాదళ దినోత్సవం
5:
అంతర్జాతీయ వాలంటీర్స్ దినం
6:
పౌర రక్షణ దినం
7:
సైనికదళాల పతాక దినం,
అంతర్జాతీయ పౌర విమానయాన
దినోత్సవం
8:
హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం
జలాంతర్గాముల దినోత్సవం
9:
జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం
10:
అంతర్జాతీయ మానవ హక్కుల దినం.
ప్రపంచ జంతువుల హక్కుల దినం
11:
యునిసెఫ్ దినోత్సవం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం
12:
అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం
14:
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
15:
ఇంటర్నేషనల్ టీ డే
17:
పెన్షనర్స్ డే
18:
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం,
మైనారిటీ హక్కుల దినం (్భరతదేశం)
19:
గోవా విముక్తి దినోత్సవం.
22:
ప్రపంచ గణిత దినం
23:
కిసాన్ దినోత్సవం
24:
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ డే
26:
జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
31:
వరల్డ్ స్పిరిట్యువల్ డే.
భారతదేశము లో యువజన దినోత్సవాలు :
భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామీ వివేకానంద,తన బోధన్ల ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
ఈ రోజు జనవరి 12న సామీ వివేకానంద జయంతి అన్న విషయం యావద్భారతీయులకూ ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ఈ రోజును యువజన దినోత్సవంగా నిర్ణయించి, యువతకు స్ఫూర్తిని గొలిపే అత్యుత్తమమైన రోజు.
ఈ సందర్భంగా ముందుగా యావద్భారతీయ యువతీ యువకులకు నా మనఃపూర్వక అభినందనలు.
స్వామి వేకానంద 148వ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం లో బుధవారం జరవరి 12 వ తేదీన నిర్వహించారు. స్థాని క గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దూసి లక్ష్మణరావు ఆధ్వర్యంలో వివేకానంద చిత్ర పటానికి ఆర్సిఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయు లు డి.విజయప్రసాద్, ఉపాధ్యాయులు టి.కాళిదాసు, ఆర్.శ్రీను పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. యువజన దినోత్సవం సందర్భంగా గ్రంథాలయం వద్ద పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎంఇఓ డి.ప్రకాశరావు బహుమతులు అందజేశారు.యువజన దినోత్సవం సందర్భంగా ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారుస్
స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద ఆశయయ సాధనలో గత దశాబ్ద కాలంగా సంఘ సేవా, సామాజిక కార్యక్రమాలే పరమావదిగా భావించి సమాజం పట్ల గౌరవం, అంకితభావంతో పని చేస్తూ పర్యావరణ పరిరక్షణ, యువజన సదస్సులు, పల్స్ పోలియో, ఎయిడ్స్ నిర్మూలన, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుపుతారు . తన బోధనలు, రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత . కొన్ని జిల్లాలో జాతీయ యువజన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు .ఈ సందర్భముగా స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాలల అలంకరణలో యువజనోత్సవాలు ప్రారంభమవుతాయి . వ్యాసరచన, ఉపన్యాస పోటీలను, రంగోళి, మెహంది పోటీలను, స్వశక్తి మహిళల గ్రూపుల్లోని మహిళలకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, జానపద, దేశభక్తి గేయాలు, పురుషులకు కబడ్డీ, ఖో-ఖో పోటీలను ఈ వారోత్సవాలలోలో నిర్వహిస్తారు. జాతీయ సమైక్యత, ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కార్యక్రమం, రక్తదాన శిబిరం వంటి ఏర్పాటు చేస్తారు .
వివేకానంద బలమే జీవితమని, బలహీనతే మరణమన్నారు. విద్యార్థులకు, యువతీ, యువకులకు రామకృష్ణ వివేకానంద సందేశాలతో చైతన్య పరచనున్నాయి . కులం, మతం, ప్రాంతం, భాష వంటి భావోద్రేకాలకు కొట్టుకుపోయి హింసాత్మక ఆందోళనలకు పాల్పడవద్దని రాష్ట్రంలోని యువతకు సూచించాలి . యువకుల కోసం పాటుపడేందుకే కేంద్ర ప్రభుత్వం నెహ్రూ యువకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది ప్రతి ఏటా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.
వివేక' సూక్తులు..
* పశువుని మానవుడిగానూ, మానవుణ్ణి మాధవునిగాను మార్చేదే నిజమైన మతం.
* జీవితాన్ని మలచుకోవడానికి, మనగడని ధన్యం చేసుకోవడానికి, చక్కటి నడవడికని రూపొందించడానికి సహకరించే ఆలోచనలని మనిషి మనసులో నాటి, వాటిని జీవితంలో ప్రతిఫలింపచేసేదే నిజమైన విద్య.
* ముసలితనం ఆలోచిస్తుంటుంది. యవ్వనం సాహసం చేయగలుగుతుంది.
* జీవితం అంటే రహస్యంగా ఆనందాలను అనుభవించడం కాదు. ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నెన్నో కొత్త విషయాలను నేర్చుకోవడం.
* ధనం వల్ల పేరు, ప్రతిష్టల వల్ల విద్య.. వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మంచి శీలం మాత్రమే దుస్సాధ్యమైన కష్టాల అడ్డుగోడలను పగులకొట్టుకొని ముందుకు చొచ్చుకపోతుంది.
* తన మీద తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడు.
* మీరు ఎలా అనుకుటే అలా తయారవుతారు. మిమ్మల్ని మీరు బలహీనులు అనుకుంటే బలహీనులుగా మారుతారు. మీరు బలవంతులనుకుంటే బలవంతులుగా అవుతారు.
యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి . యువత మద్యపానం, దూమపానం, మాదకద్రవ్యాలు వంటి దురలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలి . ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి , గ్రామాభివృద్దికి కృషి చేయాలి , యువత ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలి . యువతరం తమ ధోరణి మార్చుకోవాలి .. తిరుగులేని తమ శక్తితొ వ్యక్తిగతం గాను , సామాజికం గాను , జాతి పరం గాను ఎదగాలి .అప్పుడే యువజనోత్సవాలు సార్ధకమౌతాయి .
ఇక ప్రపంచ యువజన దినోత్సవాలు ఆగస్టు 12 న జరుపు కుంటున్నారు .
నేడు అంతర్జాతీయ యువజనోత్సవం( International
Youth Day) - -ఆగస్టు 12..
ప్రతిసంవత్సరము .
ఒక మార్గం., ఒక దిశా నిర్దేశం., చివరికి గమ్యం.. కోసం ... కఠోర సాధన చేయాలి.. నటనలో రాణించాలా...? అన్నిభాషల సినిమాలు చూడాలి.. నాట్యం నేర్చుకోవాలా..? అయితే నిరంతరం శ్రమించాలి.. విదేశీ చదువులా? ఉద్యోగమా? అన్ని వెబ్‌సైట్లు వెదుకుతూనే ఉండాలి..పట్టువదలని విక్రమార్కులు..వీరు!
గగనమే వీరి గమ్యం - విభిన్న నేపథ్యం.. వైవిధ్య దృక్పథం . ఎంచుకున్న రంగాల్లో గగనం చేరేవరకు వీరికి గమనమే గమ్యంగా సాగిపోతామంటున్నారు. పట్టుదల, నైపుణ్యాలనే తాళ్లుగా చేసి హరివిల్లుపై ఊయలలు ఊగగలరు. కష్టాలు పలుకరించినా.. జీవితంకనికరించకున్నా.. ఎదురొడ్డి పోరాడగలమంటున్నారు. వివిధ రంగాల్లో భవిష్యత్తు తరాలకు తామే దీపధారులం కాగలమని చెప్పకనే చెబుతున్నారు... నేటి యువత .
యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి . యువత మద్యపానం, దూమపానం, మాదకద్రవ్యాలు వంటి దురలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలి . ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి , గ్రామాభివృద్దికి కృషి చేయాలి , యువత ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలి . ఇవీ వీరి పనులు .
నేటి యువతే రేపటి భవిత అంటారు . యువతకు గల శక్తి అంతులేనిది . . అపారమైనది . దేశ ఉన్నతికి , ఔన్నత్యానికి ఈ శక్తిని ఫణం గా పెడితే అన్నీతిరుగులేని విజయాలే ఉంటాయి. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు , సామాజికమైనవి ,. తద్వారా జాతీయం , అంతర్జాతీయం అయినవి . ఈ శక్తి ఎప్పుడూ అనుకూల పధం లో సాగాల్సి ఉంది . యువ శక్తి దేశానికి ఎంత మేలు చేస్తుందో .. గతి తప్పితే అంతకు రెట్టింపు కీడుచేస్తుంది .
నేటి తరానికి బాధ్యతలు గుర్తు చేసేందుకు , యువతకు గల శక్తిని చాటి చెప్పేందుకు గాను గత పదేళ్ళుగా అంతర్జాతీయ యువజనోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు .
ఎలా మొదలైంది .--?
1995 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల ఎవేర్నెస్ పెంచేందుకు ఓ మార్గం గా ఆ కార్యక్రమానికి మద్దతుగా ఆరోజున ప్రజా సమాచార కార్యక్రమాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది . అప్పటి నుండి ఏటేటా ఒక్కో థీమ్ ను అనుసంధానం చేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు . ప్రపంచవ్యాప్తము గా ఉన్న యువత సమస్యల పట్ల ప్రభుత్వాలు , ఇతరులు శ్రద్దచూపేందుకు ఇదో అవకాశం గా ఉంది .
1999 లో యువత బాధ్యతలు నిర్వహించే మంత్రుల పపంచసదస్సు చేసిన సిఫార్సులమేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 12 వ తీదీని అంతర్జాతీయ యువజన దినం గా ప్రకటిస్తూ తీర్మానము చేసింది . వర్క్ షాపులు , సాంస్కృతిక కార్యక్రమాలు , సమావేశాలు ద్వారా జాతీయ , స్థానిక ప్రభుత్వాధికారుల్ని , యువజన సంస్థల్ని భాగస్వాముల్ని చేస్తూ యువజన దినం ఒక్కో థీమ్ తో నిర్వర్తించాలని నిర్దేషించినది .
ఇప్పటికి ఎంచుకున్న థీమ్‌లు :
2000 : తొలి ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహించారు . " యువత భావి పౌరులు " అన్నది ఆ ఏటి థీమ్ . అప్పటిదాకా యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యక్రమాలపట్ల అవగాహన పెంచడాన్ని లక్ష్యము గా చేసుకున్నారు . విద్య , ఉద్యోగము , పేదరికము , ఆరోగ్యము , వాతావరణము , డ్రగ్స్ , బాలనేరాలు , ఖాళీ సమయాల్లో పనులు వంటివన్నీకార్యక్రమాలలో భాగాలు .
2001 : ఎయిడ్స్ , నిరుద్యోగ వ్యతిరేకతలు ఈ ఏడాది థీమ్ గా తీసుకున్నారు .
2002 : " ఇప్పుడు మరియు భవిష్యత్ కోసం , సుస్థిర అభివృద్ధికోసం యువత కార్యాచరణ " అన్నది ఈ ఏడాది థీమ్ పరిసరాలు , నిర్ణయాల్లో అభివృద్ధి , దీర్ఘకాలిక విజయాలపై దృష్టి సారించారు .
2003 : "ప్రతిచోట యువతకోసం చక్కని ఉత్పాదికమైన పని చూడడం " ఈ సంవత్సరం థీమ్ .
2004 : " అంతర తరాల సమాజం లో యువత " ఈ ఏడాది థీం . అన్ని స్థాయిల్లో అంటే కుటుంబము , కమ్యూనిటేలు , దేశాలలో తరాలు నడుమ సామరస్య ప్రాముఖ్యాన్ని ఈ థీమ్ హైలైట్ చేసినట్లైనది .
2005 : " WPAY+10 మరియు నిబద్ధతా అంశాలు " ఐక్యరాజ్యసమితి లో యువతకు ఇది ముఖ్యమైన ఏడాది . జనరల్ అసెంబ్లీ 60 వ సదస్సుకు గుర్తుగా యువత అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరిగింది .
2006 : " సమైక్యం గా పేదరిక నిర్మూలన - యువజనులు మరియు పేదరిక నిర్మూలన " ఈ సం . థీమ్ . ఆకలి , పేదరికం లను ప్రధానాంశాలుగా తీసుకున్నారు .
2007 : " చూడాలి , వినాలి -అభివృద్ధిలో యువత భాగస్వామ్యము " 2007 సం . థీమ్ . అన్ని స్థాయిల్లోని నిర్ణయాల్లోయువతను భాగస్వామ్యము చేయాలని తీర్మాణము జరిగినది .
2008 : " మీరెలా సెలబ్రేట్ చేస్తారు " అన్నది ఈ 2008 థీమ్ .
2009 : " సుస్థిరత , మన సవాళ్ళు -మన భవిష్యత్తు " అనే నినాదము తో యువతీయువకులకు పిలుపు ఈ 2009 సం .థీమ్.
2010 : " చర్చలు - పరస్పర అవగాహన " ఈ 2010 సం . థీమ్ . విభిన్న సంస్కృతులు , విభిన్న తరాలకు చెందిన యువత నడుమ చర్చల విలువకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అందిస్తున్న ప్రశంసల్ని ఈ థీమ్ ఎంపిక బాగా ప్రతిబింబిస్తుంది .
గత 9 ఏళ్ళు గా ఇలా అనేక థీమ్ లతో నిర్వహించిన అంతర్జాతీయ యువజన దినోత్సవాలు ముందుకు సాగాయి . యువతరం తమ ధోరణి మార్చుకోవాలి .. తెరుగులేని తమ శక్తితొ వ్యక్తిగతం గాను , సామాజికం గాను , జాతి పరం గాను ఎదగాలి .అప్పుడే యువజనోత్సవాలు సార్ధకమౌతాయి .
2. చీఫ్ మినిష్టర్స్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ యూత్ (సి.ఎం.ఇ.వై. పధకం) :
యువజన సంఘం అంటే: ఈ కార్యక్రమం "గ్రూప్ స్ట్రేటజీ" పై ఆధారపడి ఉంది. 18 - 35 సం||రాల వయోవర్గంలోని 5 నుండి 15 యువజనుల కలయికే ఇది రిజిస్ట్రేషన్ - అధిక లాభాలు: ఆంధ్రప్రదేశ్ సొసైటీల చట్టం, 1995 పరస్పర సహాయక సహకార చట్టం / కంపెనీల చట్టం / భాగస్వామ్య పత్రం క్రింద రిజిష్టరు అయిన యువజన సంఘం, తన పేరు మీద ఋణాన్ని పొందడానికి ఏదైనా బ్యాంకును కోరవచ్చును. అంతేకాక, ఈ విధంగా రిజిష్టరైన యువజన సంఘం మార్జిను మనీ / సబ్సిడీ వంటివి పొందడానికి ఎస్.సి / ఎస్.టి / బి.సి. / మైనారిటీలు / మహిళా ఆర్ధిక సంస్ధలు / డి.ఆర్.డి.ఏ. / కె.వి.ఐ.బి. వంటి ఏజన్సీలతో తన కార్య కలాపాలను విస్తరించుకోవచ్చు.
అమలు విధానం: రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు యువజన సేవలను, ప్రయోజనాలను విస్తరింపచేయాలనేది ప్రభుత్వ విధానం. దీన్ని మూడు దశలుగా విభజించారు.
మొదటి దశ: మొదటి దశలో "పైలటు" ప్రాతిపదికన ఒక్కొక్క మండలంలోనూ రెండు గ్రామాలను ఎంపిక చేస్తారు. మొదటి దశలో మున్సిపల్ ప్రాంతాలు తప్ప, ఇతర అన్ని మండల ప్రధాన కార్యాలయ ప్రాంతాల్లో చేపడతారు. ఒక మండలంలో అదనంగా మరో గ్రామాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రితో సంప్రదించి ఎంపిక చేయవచ్చు. ఆ గ్రామ జనాభా 2,500 -
3,000 మధ్య ఉండాలి.
రెండవ దశ: దీనిలో మొదట చేపట్టని 5 - 10 గ్రామాలను ఎంపిక చేస్తారు.
మూడవ దశ: ఈ దశను పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపచేస్తారు.
ప్రాజెక్టుల ఎంపిక: ఎట్టి పరిస్ధితిలోనూ ఒకే గ్రామానికి పదికి మించి యువజన సంఘాలు ఉండరాదు. సంఘం ఏర్పడ్డాక గుర్తింపు నిమిత్తం జిల్లా యువజన సంక్షేమ అధికారికి, మండల యువజన ఎంపవర్మెంటు ఆఫీసరు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామానికి చెందిన స్వాభావిక పరిస్థితులు, సాంఘిక - ఆర్ధిక స్ధితిగతులు, స్ధలాకృతిని బట్టి ప్రాజెక్టును ఎంపిక చేసుకోవాలి. యువజన సంఘానికి సేవింగ్స్ బ్యాంక్ అక్కౌంట్ ఉండాలి. బ్యాంకులో వేసే డిపాజిట్లు, విత్డ్రాయల్సు, సమావేశపు తీర్మానాల ద్వారా మాత్రమే చేయాలి.
ఆర్ధిక సహాయం వివరాలు:
యువజన సంఘం సభ్యులు గ్రూప్ సేవింగ్స్ ద్వారా 15,000 రూపాయలు జమ చేయాలి. దానికి మ్యాచింగ్ గ్రాంట్గా 15,000 రూపాయలు లభిస్తాయి. యువజన సంఘానికి గ్రూప్ లోన్ సబ్సిడీగా 50,000 రూపాయలను సమకూర్చుతుంది ప్రభుత్వం. ఇదే కాకుండా, ఎస్.సి./ ఎస్.టి./బి.సి./ మైనారిటీలు / వికలాంగులు / మహిళలకు "మార్జిన్ మనీ"గా మరో 20 వేల రూపాయలు అందిస్తుంది. ఈ వర్గాలకు చెందని ఇతర యువజన సంఘాలకు యువజన సంక్షేమ శాఖ ద్వారా 20,000 రూపాయల మార్జిన్ మనీ లభిస్తుంది.
|
ఆర్ధిక వనరులు
|
S.C./S.T./B.C./Min/P.H./Ladies
|
ఇతర యువజన సంఘాలు
|
|
1.
గ్రూప్ సేవింగ్స్
2.
మ్యాచింగ్ గ్రాంట్
3.
గ్రూప్‌లోన్ సబ్సిడీ
4.
మార్జిన్ మనీ
5.
యువజన సంక్షేమ శాఖ మార్జిన్ మనీ
|
రూ. 15,000-00
రూ. 15,000-00
రూ. 50,000-00
రూ. 20,000-00
పరిస్థితిని బట్టి మారును
|
రూ. 15,000-00
రూ. 15,000-00
రూ. 50,000-00
పరిస్థితిని బట్టి మారును
రూ. 20,000-00
|
శిక్షణ: అవసరమైన శిక్షణను మండలం, జిల్లా స్ధాయిలో ఒక మాస్టర్ క్రాప్ట్స్మెమెన్ ద్వారా గానీ, ఏదైనా సంస్థ ద్వారా కానీ ట్రైసెం కింద ఇప్పించబడుతుంది.
ప్రాజెక్టుల మంజూరు: మండల యువజన ఎంపవర్మెంటు ఆఫీసరు దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి మంజూరు సంఘానికి దాఖలుపరుస్తారు. ఈ సంఘంలో జిల్లా కలెక్టర్ చైర్మెన్గా వ్యవహరిస్తారు. ఇంకా పి.డి., డి.ఆర్.డి.ఏ., ఇ.డి., డి.ఎస్. బి.సి. / మైనారిటీలు / మహిళలు, జి.ఎం., డి.ఐ.సి., జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేతృత్వం వహించే బ్యాంకు మేనేజరు, స్థానిక పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సి.ఎం.ఇ.వై.లో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు:
1.విత్తన ఉత్పత్తి: మార్కెటింగ్ 2. పండ్లతోటల పెంపకం - ఉత్పత్తి 3. పండ్ల చెట్ల ప్రూనింగు, అందులో శిక్షణ 4. తోటపని పువ్వుల పెంపకం 5. పుట్టగొడుగుల ఉత్పత్తి 6. మంచినీటి కొలనులు, చెరువుల్లో చేపల పెంపెకం 7. చేపపిల్లల ఉత్పత్తి పెంపకం 8. ఉప్పునీటి కయ్యల్లో చేపలు, రొయ్యల పెంపకం 9. చేపల, రోయ్య పిల్లల సేకరణ 10. తేనె తయారీ 11. వైద్య ప్రయోజనాల నిమిత్తం ఓషధి మూలికలు, మొక్కల సాగు 12. కోళ్ళ పెంపకం 13. పందుల పెంపకం 14. గొర్రెలు, మేకల పెంపకం 15. వ్యవసాయం 16. చిన్నతరహా సాగునీటి పధకం 17. భూమి కొనుగోలు
రెండవ ప్రాధాన్యత రంగాలు:
1. అగ్గిపెట్టెల తయారీ 2. బాణాసంచా తయారీ 3. అగర్ఒత్తుల తయారీ 4. వంట నూనెలు కాని తైలాల తయారీ 5. సబ్బుల పరిశ్రమ 6. చర్మ ఉత్పత్తుల పరిశ్రమ 7. గ్రామీణ కుమ్మరి పరిశ్రమ 8. గానుగనూనె పరిశ్రమ 9. చేతితో చేసిన కాగితం 10. చెరకు బెల్లం తయారీ 11. తాటిబెల్లం, ఇతర తాటి ఆధార ఉత్పత్తుల తయారీ 12. అటవీ ఉత్పత్తుల నుండి ఇతర పదార్ధాల తయారీ 13. పప్పు, తృణ ధాన్యాల ప్రాసెసింగ్ 14. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, పరిరక్షణ క్యానింగ్ 15. రొట్టెలు, మిఠాయిల తయారీ 16. తేనె ప్రాసెసింగ్ 17. చేతి వృతులు 18. సున్నపు ఉత్పత్తుల పరిశ్రమ 19. వెదురు, పేముపరిశ్రమ 20. అల్యూమినియంతో గృహోపకర పాత్రలు తయారీ 21. పట్టు పరిశ్రమ.
ఇవే కాకుండా పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమలు, నిర్మాణాలు, రవాణా, చిల్లర వర్తకం, బ్యాంకింగ్, బీమాంశాలకు చెందిన ప్రాజెక్టులను కూడా మంజూరుచేస్తారు. పైన చూపిన జాబితా ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక రంగాల ప్రాజెక్టులను సాధించుకోవచ్చును.
మరిన్ని వివరాలకు:స్పెషల్ కమీషనర్, యువజన సంక్షేమ సర్వీసెస్, బోట్స్ క్లబ్, సికింద్రాబాద్
No comments:
Post a Comment