భజన గీతాలు
శ్రీరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
ఓం నమో విఘ్నేశ్వరాయ నమః
మాల్కోస్ రాగం :: ఆది తాళం
శ్రీ గణపతి పాట
పల్లవి -
శ్రీ గణేశ్వర,
గిరిజా కుమారా..
సుగుణ సంపన్న,
సాకారా...
మంచి కుడుములు,
ఉండ్రాళ్ళు నీ ..కు ..
ఉంచి నానయ్య , రా ..వే.. రా..
||శ్రీ గణేశ్వర||
చరణం :-1 పూర్వము నీ పుణ్య ఫలమేమొగాని
పార్వతి ప్రియ పుత్రుడైనావు జ్ఞాని
పర్వత సంచారా.., సర్వము నీవేరా..
ప్రార్ధన చేసేమురా ... ఆ ఆ ఆ ...
||శ్రీ గణేశ్వర||
చరణం :-2
ఏ పని నే జేసినను నిన్ను ముందు
నీ పద పద్మాలు స్మరియించు చుందు
తాపస మందార.., తండ్రివి నీవేరా..
తనయుని కాపాడరా ... ఆ ఆ ఆ ...
||శ్రీ గణేశ్వర||
చరణం :-3
శ్రీకర శ్రీకృష్ణ భగవానుడై..నా..
నిందలు మోసేడు నీ కారణా..నా..
నీ కృప లేకున్న.., ఈ ధర ఎవరైనా..
కార్యములను జేయునా ... ఆ ఆ ఆ ...
||శ్రీ గణేశ్వర||
చరణం :-
4 ఏలిక నీ వాహనం ఎలుక రాజా
బాలుడు భక్తుండు ఈ నూకరాజూ ..
జాలము నీకేల .., జాలితొ రావేరా..
మాలను గై కొనరా ...
ఆ ఆ ఆ ...
||శ్రీ గణేశ్వర||
మోహన రాగం :: ఆది తాళం
శ్రీ ఆంజనేయుని పాట
పల్లవి - నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
ప్రభో , నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
జయ జయ నమో రామదూతా...
||నమోఆంజనేయా||
చరణం :-1
రామ రామ యని రయమున పాడుచు
రామ స్మరణము, చేసెడి వారికి
రామ లక్ష్మణుల, భారము నాదని
పేరు ప్రఖ్యాతులు, గాంచిన దేవా ...
||నమోఆంజనేయా||
చరణం :-2
పండ్లు ఫలంబులు పనస తొనలను
సీతా రాముల, భుజియింపగను
కన్నబిడ్డ వలె, కనికరించుచు
కన్నుల పండుగ , గాంచిన దేవా ...
||నమోఆంజనేయా||
చరణం :-3
భక్తుల నెల్లను , బ్రోచే వాడా
ముక్తి సంపదల, నొసగే వాడా
ఆంజనేయుడవు, నీవే కావా
ఓ రామ భక్తా, శ్రీ ఆంజనేయా ...
||నమోఆంజనేయా||
చరణం :-
4 రామ లక్ష్మణుల , నిరతము గాంచిన
వానర మూర్తివి , నీవే కావా
ఎల్లప్పుడు , నీ నామమె గతియని
స్మరించి , భజించి , తరింతు దేవా ...
||నమోఆంజనేయా||
శ్రీ పార్వతి దేవి పాట
పల్లవి :–
అంబ పరమేశ్వరి అఖిలాం డేశ్వరి
ఆది పరా శక్తి పాలయ మాం
త్రి భువనేశ్వరి రాజ రాజేశ్వరి
ఆనంద రూపిణి పాలయమాం
పరమానంద రూపిణి పాలయమాం
బ్రహ్మా నంద రూపిణి పాలయమాం
|| అంబ ||
శంభో మహ దేవ శంకర శివ శివ
హర హర మహ దేవ శంకర శివ శివ
ఓం నమః శ్శివాయ , ఓం నమః శ్శివాయ
ఓం నమః శ్శివాయ , ఓం నమః శ్శివాయ
మోహన రాగం :: ఆది తాళం
శ్రీ శివుని పాట
పల్లవి –
ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ
కైలాస హిమగిరి శంకరా... ,
అను పల్లవి :--
కనికరా..
ముంచరా...
కరుణించి మోము చూపించరా..
|| ఓ ఓ ఓ ||
చరణం :-1
చంద్ర మౌళీ, శ్రిత పద్మ శాలి
చంద్ర కిరణాల , తేజో (ప్రభో )విహారి
దండ మోయీ, ఓ లింగ ధారి
శరణు శరణూ శరణంటి నిన్నే
|| కనికరా.. ||
చరణం :-2
గంగనూ శిరమూ, దాల్చె దేవర
ముందుగా నన్ను, బ్రోవగ రాదా
అందమైన , ఓ శంభు లింగా
శరణు శరణూ శరణంటి నిన్నే
|| కనికరా.. ||
చరణం :-3
నీల కంఠా, శేషా భూషణ
ఆశ్రిత భక్తుల, బ్రోచే వాడా
భక్త సులభుడ, నను బ్రోవ వేగా
శరణు శరణూ శరణంటి నిన్నే
|| కనికరా.. ||
కోడి ఒక కోనలో వరస :: తిశ్ర గతి తాళం
శ్రీ శివుని పాట
పల్లవి –
నిన్నె వేడు కొంటినీ, నన్ను కావ మంటినీ
పరమాత్మ పాహి శంభో దాసిని శరణంటినీ
|| నిన్నె వేడు ||
చరణం :-1
కాశి పుర దేవ రావ కైలాస వాసా ..ఆ ఆ ఆ ఆ
కరు ణాల వాల రావ,
కాఠిన్య మేల దేవ
పార్వతి నాధ ,
పలుకగ రావా
పరమేశా నాయందు,
కరుణ కలిగి
యుండరా ,
(
కరుణ క లి గి యుం డ రా ..
) || నిన్నె
వేడు ||
చరణం :-2
మాయ దారి జగతి లో మునిగి పోయి యంటి నీ ..
యీ యీ యీ యీ
ముక్తి దారి చెప్పమని, బ్రతిమ లాడు చుంటినీ
గణపతి తండ్రీ .. , గౌరీ రమణా ..
దయ తలచీ (
లక్ష్మి ) కీ దర్శనమే ఈయరా
(
దర్శనమే ఈ ..య రా.. ) || నిన్నె వేడు ||
------------- రాగం :: ఆది తాళం
శ్రీ
శివుని పాట
పల్లవి :–
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక , సుధాకర హిమకర
లోక శుభంకర , నమో నమో
||దేవ దేవ ||
చరణం :-1
పాలిత కింకర , భవనా శంకర
శంకర పుర హర నమో నమో
హాలా హాల ధర , శులాయుగ కర
శైల సుతా వర , నమో నమో
||దేవ దేవ ||
చరణం :-2
దురిత విలోచన , పాల విలోచన
పరమ దయాకర , నమో నమో
కరి చర్మాంభర, చంద్ర కళా ధర
సాంబ దిగంబర, నమో నమో
||దేవ దేవ ||
------------- రాగం :: ఆది తాళం
శ్రీ శివుని పాట
పల్లవి :–
మహేశా పాప వినాశా , కైలాస వాసా ఈశా
నిన్ను నమ్మి నా ను రావ, నీల కంధరా
|| మహేశా ||
చరణం :-1
భక్తి యే దొ పూజ లేవో , తెలియ నైతినే
పాపమేదో పుణ్యమేదో , కాననైతినే దేవా
|| మహేశా ||
చరణం :-2
మంత్ర యుక్త పూజ చేయ.. , మనసు కరుగునా ....
మంత్రమో..
తంత్రమో..
, యెరుగ నైతినే ....
నాద మేదొ వేద మేదో, తెలియనైతినే ..
వాదమేల పేద బాధా... , తీర్చ రావయా ..
స్వామీ...
|| మహేశా ||
చరణం :-3
ఏక చిత్తమున నమ్మిన వారికి
శోకము తీర్తువో రుద్రయ్యా
ప్రాకటముగ,
చిరు వేట జూపి -
- నా ఆకలి దీర్చగ రావయ్యా
ధీటుగ నమ్మితి గనవయ్యా
వేట జూపుమా రుద్రయ్యా
------------- రాగం :: ఆది తాళం
శ్రీ శివ కేశవుల
పాట
పల్లవి :–
శివ కేశవులకు, బేధమా
సుజ్ఞాన వంతులకు భారమా
|| శివ కేశవు ||
చరణం :-1
ప్రేమ బూడిద రాసె లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
ప్రేమ బూడిద లింగ,
పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను,
వాదాపు జనులార
|| శివ కేశవు ||
చరణం :-2
పులి చర్మం కట్టే లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
పులీ చర్మం లింగ ,పట్టూ
నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు
జనులార
|| శివ కేశవు ||
చరణం :-3
ఎద్దు నెక్కిన వాడు.. లింగడు
గద్ద నెక్కిన వాడు రంగడు
ఎద్దు నెక్కిన లింగ,
గద్ద నెక్కిన రంగ
వారిద్దరొకటేను,
వాదాపు జనులార
|| శివ కేశవు ||
చరణం :-4
ఘంట శంఖము పట్టె లింగడు
శంఖు, చక్రము పట్టె రంగడు
ఘంట శంఖము లింగ ,శంఖు
చక్రము రంగ
వారిద్దరొకటేను, వాదాపు
జనులార
|| శివ కేశవు ||
చరణం :-5
పాము పాగా చుట్టే లింగడు
పాము ఫై పవ్వ ళించే రంగడు
పాము పాగ లింగ,
పవ్వ ళించే రంగ
వారిద్దరొకటేను,
వాదాపు జనులార
|| శివ కేశవు ||
చరణం :-6
కైలాస గిరి యందు లింగడు
వైకుంఠ పురమందు రంగడు
కైలాస గిరి లింగ, వైకుంఠ
పుర రంగ
వారిద్దరొకటేను, వాదాపు
జనులార
|| శివ కేశవు ||
నవ్వవే నా చెలీ వరస :: ఆది తాళం
శ్రీ రాముని పాట
పల్లవి –
రాముడే దేవుడూ,
దేవుడే రాముడూ
నీల మేఘ శ్యాముడు, నిజముగ యున్నాడు
భక్తుల బ్రోచేటి దొర యాతడే...
||రాముడే దేవుడూ||
చరణం :-1
జగమేలు దేవుండు , శ్రీ రాముడూ ..
జయమొసగి,
కాపాడు ఆ రాముడూ ..
నమ్మి సేవించెదా, ముక్తి చూపించరా..
ఈ ధరలో నను, బ్రోచె దొర యాతడే...
||రాముడే దేవుడూ||
చరణం :-2
ఆ నాడు వేడేను, హనుమంతుడు
రామా రామా యని , తరియించెను
రామ దాసైనను, భక్త శబరైనను
అందరిని బ్రోచేటి దొర యాతడే ...
||రాముడే దేవుడూ||
చరణం :-3
ఎన్నెన్ని కష్టాలు , ఎదురై ననూ..
భరియించ లేనంత, బాధైనను..
భారమే నీవనీ, దిక్కు మాకెవరనీ ..
పిలచిన పలికేటి దొర యాతడే ...
||రాముడే దేవుడూ||
హంస ధ్వని రాగం :: ఆది తాళం
శ్రీ రాముని పాట
పల్లవి –
శ్రీ రఘు రామ్, జయ రఘు రామ్
సీతా మనోభి రామ్ ....
జయ జయ
|| శ్రీ రఘు రామ్ ||
చరణం :-1
అన్నదమ్ములా ఆదర్శమైనా
ఆలూ మగలా అన్యోన్యమైనా
తండ్రి మాట నూ,
నిలుపుట కైనా
ధరలో మీరే దశరధ రామ్
|| శ్రీ రఘు రామ్ ||
చరణం :-2
వెలయు నే ఎడ, నీ దివ్య మూర్తీ
వెలిగే మాయెడ, ఆనంద జ్యోతీ
వెలసి మా గృహం, శాంతి నివాసం
సలుపవె శుభగుణ,
శోభిత రామ్
|| శ్రీ రఘు రామ్ ||
చరణం :-3
శ్రీ రామ చంద్రః, శ్రిత పారి జాతః
సమస్త కళ్యాణ గుణాభి రామ
సీతా ముఖాంబోరు హచం చరీక
నిరంతర మంగళ మాత నోతూ
|| శ్రీ రఘు రామ్ ||
శ్రీ రామ జయ రామ పాట
శ్రీ రాముని పాట
పల్లవి :–
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
ఓ రామ ఓ రామ ఓం కార రామ
|| శ్రీ రామ ||
చరణం :-1
చారు సుందర రామ జానకి రామ
పాలించరా తండ్రి పావన రామ
|| శ్రీ రామ ||
చరణం :-2
కోరితి రా నిన్నే కోదండ రామ
దయ చూడరా మమ్ము దశరధ రామ
|| శ్రీ రామ ||
చరణం :-3
కరుణించు మమ్మేలు కళ్యాణ రామ
అడిగితి రా నిన్నే అయోధ్య రామ
|| శ్రీ రామ ||
మధ్య మావతి రాగం :: ఆది తాళం
శ్రీ రాముని పాట
పల్లవి –
సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
చరణం :-1
చూచు వారలకు, చూడ ముచ్చట ట
పుణ్య పురుషులకు ధన్య భాగ్య మట
భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట.. ఆ.. ఆ.. ఆ..
.. ఆ
భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట
సురులును మునులును , చూడ వచ్చి రట || కళ్యాణము ||
చరణం :-2
దుర్జన కోటి ని , దర్ప మడంచగ
సజ్జన కోటి ని , సంర క్షిం పగ
ధారుణి శాంతిని , స్థాపన చేయగా .. ఆ.. ఆ.. ఆ..
.. ఆ
ధారుణి శాంతిని , స్థాపన చేయగ
నరుడై పుట్టిన , పురుషోత్తముని
|| కళ్యాణము ||
చరణం :-3
దశరధ రాజు , సుతుడై వెలసి
కౌశిక యాగము , రక్షణ జేసి
జనకుని సభలో , హరు విల్లు విరచి .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ
జనకుని సభలో , హరు విల్లు విరచి
జానకి మనసును గెలచిన రాముని
|| కళ్యాణము ||
చరణం :-4
సిరి కళ్యాణపు , బొట్టును బెట్టి
మణి బాసికమును , నుదుటను కట్టి
పారాణి ని పాదాలకు బెట్టి .. ఆ.. ఆ.. ఆ..
.. ఆ
పారాణి ని పాదాలకు బెట్టి
పెండ్లి కూతురై వెలసిన సీతా
|| కళ్యాణము ||
చరణం :-5
సంపగ నూనె, కురులకు దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చంప జవాజి చుక్కను బెట్టి ..
ఆ.. ఆ.. ఆ..
..ఆ
చంప జవాజి చుక్కను బెట్టి
పెండ్లీ కొడుకై వెలసిన రాముని
|| కళ్యాణము ||
చరణం :-5
జానకి దోసిట , కెంపుల ప్రోవై
రాముని దోసిట , నీలపు రాలై
ఆణి ముత్యములు , తలంబ్రాలుగా .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ
ఆణి ముత్యములు , తలంబ్రాలుగా
శిరమున మెరసిన , సీతా రాముల
|| కళ్యాణము ||
------------------- రాగం :: ఆది తాళం
శ్రీరాముని పాట
పల్లవి –
జగదభి రామా ,
రఘుకుల సోమా
అను పల్లవి :-
శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. ప వయా ....
|| జగదభి రామా ||
చరణం :-1
కౌశిక యాగము , కాచితి వయ్యా
రాతిని నాతిగ చేసితి వయ్యా
హరు విల్లు విరచి ,మురిపించి సీతను
పరిణయ మాడిన , కళ్యాణ రామా
శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. ప వయా ....
|| జగదభి రామా ||
చరణం :-2
ఒకటే బాణం , ఒకటే మాట
ఒకటే సతి యని , చాటితి వయ్యా
కు జనుల నణచి , సు జనుల బ్రోచిన
ఆదర్శ మూర్తివి , నీ వే నయ్యా
జయ జయ రామ్ , జానకి రామ్
పావన నామా , మేఘ శ్యామా ....
|| జగదభి రామా ||
శ్రీ రాముని పాట
పల్లవి :–
భజ మన రాం, భజ మన రాం
పాండు రంగ,
శ్రీ రంగ భజ మన రాం
|| భజ మన రాం ||
చరణం :-1
భజ మన రాఘవ,
భజ మన యాదవ
భజ మన కేశవ,
భజ మన రాం
|| భజ మన రాం ||
చరణం :-2
భజ మన రఘువర,
భజ మన యదువర
భజ మన మురహర, భజ మన రాం
|| భజ మన రాం ||
చరణం :-3
భజ మన ఆనంద,
భజ మన గోవింద
భజ మన ముకుంద,
భజ మన రాం
|| భజ మన రాం ||
------------------ రాగం :: ఆది తాళం
శ్రీ రాముని పాట
పల్లవి –
అంతా రామ మయం, ఈ జగమంతా రామ మయం
అను పల్లవి :--
అంత రంగమున, ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ --
//
అంత రంగమున, ఆత్మా రామం,
అనంత రూపముల వింతలు సలుపగ //
|| రామ రామ రామ సీతా ||
రామ రామ రామ సీతా ||
చరణం :-1
సోమ సూర్యులును, సురలును తారలు
ఆ మహాంబుధులు, అవవి జగంబులు
|| రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా ||
అ౦డా౦ డ౦బులు, పిండాం డంబులు
బ్రహ్మండంబులు,
బ్రహ్మలు మొదలుగ
|| అంతా రామ మయం ||
చరణం :-2
నదులు వనంబులు, నానా మృగములు
వివిధ కర్మములు, వేద శాస్త్రములు
|| రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా ||
అష్ట దిక్కులును, ఆది శేషుడును
అష్ట వసువులు, అరిషడ్ వర్గము
||
అంతా రామ మయం ||
చరణం :-3
ధీరుడు భద్రాచల రామ దాసు నీ
కోరికlll లొసగెడి తారక నామము
||
అంతా రామ మయం ||
నా మది నిన్ను పిలచింది గానమై వరస :: ఆది తాళం
శ్రీ
వేంకటేశ్వరుని పాట
పల్లవి –
ఓ మురిపాల శ్రీ వెంకటా పతీ
నీవే నా... గతీ , మంగా పతీ
|| ఓ మురిపాల ||
చరణం :-1
యిమ్మని నీ సొమ్ము , నే నడుగ లేదు
బొమ్మవు నీవంచు, వాదించ లేదు
కమ్మని నీ గానమే , నమ్మినాను
నమ్మక మే లేక పోయనా
|| ఓ మురిపాల ||
చరణం :-2
వెలుగుల బంగారు , సౌధంబు లోన
నెలకొని యున్నావు , నీలాద్రి పైన
తలపుల నమ్మి హృదయంబు లోన
పిలచిన పలుకా వేమయా
|| ఓ మురిపాల ||
చరణం :-3
అధముడ నేనంచు , అనుకొన్న గాని
వదలను నిన్నింక,వద్దన్న గాని
తిరుమల గిరి వాస ఓ శ్రీనివాస
వరముల కాశింప లేదయా
|| ఓ మురిపాల ||
---------------- రాగం :: ఆది తాళం
శ్రీ వేంకటేశ్వరుని పాట
పల్లవి :–
జై జై విమలారుణ చరణా
జై జై కరుణా... భరణా...
చరణం :-1
శ్రీ రమణా మహీ రమణా
శ్రీ వేంకటేశా ప్రభో , అలివేలు మంగా విభో
|| శ్రీ రమణా ||
మా పూజ లందుము, మమ్మెపుడు బ్రోవుము
నీవే సదా గతి, శోభా కృతీ
పాహిమాం ,పాహిమాం , పాహిమాం
|| జై జై ||
చరణం :-2
కారుణ్య గుణ ,ధామ రామా
భువిజా తాత్మ వాస పరేశ
|| కారుణ్య ||
శుభ గాత్ర సువిశాల నేత్రా
మానతు లందుమా , మము కరుణించుమా
పాGDFGహిమాం ,పాహిమాం , పాహిమాం
|| జై జై ||
చిట పట చినుకులు పదుతూ ఉంటే వరస :: ఆది తాళం
శ్రీ
వేంకటేశ్వరుని పాట
పల్లవి :–
తిరుపతి యాత్రకు వెళుతూ వుంటే
తిరుమల దేవుని స్మరిస్తు వుంటే
ఏడు కొండలు ఒకే సారిగా,
ఆడుతు పాడుతు ఎక్కుతు
ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి
|| తిరుపతి ||
చరణం :-1
మంగళ రవములు పాడుతు వుంటే..., పాడుతు వుంటే
సుప్రభాతము చదువుతు వుంటే ...,
చదువుతు వుంటే
జగతిని మరచి , ప్రభు సన్నిధి లో
ఆత్మ శుద్ధిగా నిలబడి ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి
|| తిరుపతి ||
చరణం :-2
శ్రీనివాసయని వేడుతు వుంటే ...,
వేడుతు వుంటే
వరము లిమ్మని కోరుతు వుంటే ..., కోరుతు వుంటే
ధగ ధగ మెరిసే చల్లని దేవుడు
ఎదుటను తానై నిలబడి ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి
|| తిరుపతి ||
____ వరస :: ఆది తాళం
శ్రీ వేంకటేశ్వరుని
పాట
పల్లవి :–
తిరుమల మందిర , సుందరా
సుమధుర కరుణా సాగరా
ఏ పేరున నిను పిలచేనురా
యే రూపముగా .. , కొలిచేనురా
|| తిరుమల ||
చరణం :-1
పాల కడలిలో , శేష శయ్య ఫై
పవళించిన , శ్రీ పతి వో
వెండి కొండ పై నిండు మనసుతో
వెలిగే గౌరీ , పతి వో
ముగురమ్మలకే , మూలపుటమ్మగా
భువిలో వెలసిన ఆది శక్తి వో
|| తిరుమల ||
చరణం :-2
కాంతులు చిందే , నీ ముఖ బింబము
కాంచిన చాలును ఘడియైనా
నీ గుడి వాకిట , దివ్వెను నేనై
వెలిగిన చాలును , రేయైనా
నీ పదములపై కుసుమము నేనై
నిలచిన చాలును క్షణమైనా
|| తిరుమల ||
హిందూ స్తాన్ రాగము :: ఆది తాళము
శ్రీ కృష్ణుని పాట
పల్లవి :–
రాధా మోహన రాస విహారీ
యదుకుల పూజిత వనమాలీ
అను పల్లవి :--
గోపాలా జయ గోపాలా
|| రాధా మోహన ||
చరణం :-1
మురళీ లోల మునిజన పాలా
సురగుణ శోభిత గిరి ధారీ
సురగుణ శోభిత గిరి ధారీ
|| గోపాలా||
చరణం :-2
మధురం మధురం మాధవ స్మరణం
ఆత్మ శాంతి కది మూల ధనం
సనక సనందన , ముని జన వందిత
నంద కుమారే , దైవము రా
|| గోపాలా||
చరణం :-3
శ్యామ సుందరుని , కోమల రూపుని
యమున విహారుని , కొలువుమురా
హరి యేరా , శ్రీ హరి యేరా
హరి పద స్మరమే, చరితార్ధమురా
|| గోపాలా||
సుంద రాంగా మరువగ లేనోయ్ వరస :: ఆది తాళం
శ్రీ కృష్ణుని పాట
పల్లవి :–
మోహనాంగా ముద్దుల కృష్ణా రావేరా
నీ కాళ్ళ గజ్జియలు ఘల్లని మ్రోగ రావేరా
|| మోహనాంగా ||
చరణం :-1
మురళీ ఊదుచు ముద్దుల కృష్ణా రావేరా
నీ కాటుక కన్నులలో మెరయు తళుకు మురిపించెరా
|| మోహనాంగా ||
చరణం :-2
గోవర్ధన గిరి నెత్తిన కృష్ణా రావేరా
నీ కమ్మని పాటలతో , రాగములతో రావేలరా
|| మోహనాంగా ||
చరణం :-3
యశోద తనయా , యాదవ కృష్ణా రావేరా
నీ కోమల పదములను ,భజిం చెదము రావేలా
|| మోహనాంగా |
విన్నానులే వరస :: ఆది తాళం
శ్రీ కృష్ణుని
పాట
చరణం :-
1 విన్నానులే , విన్నానులే
నీ మహేంద్ర జాలము ,
కన్నానులే ,
కన్నానులే
ఇంటికి మింటికి ,
జంట లేక
నావంటి దీనుల ,
పంటల ప్రభువని
చరణం :-
2 విన్నానులే , విన్నానులే
నీదాసుల సేవ , చేసేనులే
, చేసేనులే
దీక్షతో ద్రౌపది, తలంచి
నంతలో
అక్షయ వలువలు, ఒసగిన
ప్రభువని
చరణం :-
3 విన్నానులే , విన్నానులే
నీ దాసుల చేరి వేడేనులే,
వేడేనులే
పిడికెడు అటుకులు,
మెసవి కుచేలుని
అడుగని సిరులిచ్చి,
బ్రోచిన ప్రభువని
చరణం :-
4 విన్నానులే, విన్నానులే
నీ దాసుల పంచలో, ఉన్నానులే, ఉన్నానులే
అంచితమగు,
నా సంచిత కర్మల
చించి చించి, రక్షించెడి
ప్రభువని
చరణం :-
5 విన్నానులే, విన్నానులే
నీ నామమె గతి యని,
పాడేనులే, పాడేనులే
శ్రీ వేంకట గురువర,
కరుణను బడసిన
లక్ష్మయాఖ్యుని,
ఏలిన ప్రభువని
______వరస :: ఆది తాళం
శ్రీ కృష్ణుని
పాట
పల్లవి :–
భజమన గోవిందా , భజమన గోపాలా
దయానిధే హరి , కృపా నిధే హరి
జయ జయ జయ జయ రమా పతే
|| భజమన ||
చరణం :-1
భజమన శ్యామ బన్సీ లాలా
భజమన ప్యారే , మోహన శ్యామ
మోహన వేష మంజుల భాష
జయ జయ జయ జయ రమా పతే
|| భజమన ||
చరణం :-2
భజ మన శ్యామ , నంద నా నంద
భజ మన ప్యారే , మేఘ శ్యామ
జనార్ధ హరి , సదా నందా హరి
జయ జయ జయ జయ రమా పతే
|| భజమన ||
చరణం :-3
భజ మన శ్యామ , యశోద బాల
భజ మన ప్యారే , రాధే శ్యామ
దయానిధే హరి , కృపా నిధే
జయ జయ జయ జయ రమా పతే
|| భజమన ||
లాహిరి లాహిరి లాహిరిలో వరస :: ఆది తాళం శ్రీ రంగని పాట
పల్లవి –
పండరి పురమున శ్రీరంగా. .
పలుకవు ఏలా ఓ రంగా ..
శ్రీ రంగా ఓ రంగా ..ఆ... ఆ... ఆ... ఆ ... ఆ ...
|| పండరి పురమున ||
చరణం :-1
అల వైకుంఠము నీ వే నంటా
అయోధ్య వాసివి నీ వంటా
మనువులు తనువులు , నీ వే నంటా
మాధవ నిన్నే రమ్మంటా ...
|| పండరి పురమున ||
చరణం :-2
పురాణ పురుషుడు నీ వే నంటా
ప్రకృతీ పురుషుడు నీ వంటా
ముల్లోకమ్ములు , నీ వే నంటా
ముర హర శ్రీ హర రమ్మంటా ...
|| పండరి పురమున ||
చరణం :-3
భక్తుల నెల్ల బ్రోచెద వంటా
భవ భయ హరుడవు నీ వంటా
ముక్తిని ఇచ్చే అభయ హస్తమట
మోక్షము ఇవ్వగ రమ్మంటా ...
|| పండరి పురమున ||
fgldfgdifgoodfigddfgdfgdfdfmmcmkdfkవరస :: ఆది తాళం
శ్రీ రంగని పాట
పల్లవి –
పాండు రంగ నామం,
పరమ పుణ్య ధామం
అదే మోక్ష తీరం,
వేద సారం, మధురం, మధురం
|| పాండు
రంగ ||
చరణం :-1
ఎంత పాడు కున్నా,
అంతు లేని కావ్యం
ఎన్ని మార్లు విన్నా,
నవ్యాతి నవ్యం
|| పాండు రంగ ||
చరణం :-2
పాండు రంగ సన్నిధీ,
మరపు రాని పెన్నిధీ
ప్రభుని కరుణ లేనిదీ,
జగతి నే మున్నదీ
|| పాండు రంగ ||
చరణం :-3
దాసులైన వారికీ,
దాసుడీ తుకారం
ధన్య జీవు లారా,
అందుకోండి రాం రాం
పాండు రంగ హరి
జై జై , రామ కృష్ణ హరి జై జై
పాండు రంగ హరి జై జై ,
రామ కృష్ణ హరి జై జై
శ్రీ నారాయణుని పాట
చరణం :-
1
నారాయణ అనరా.. ఈ ఒక్క సారి, నారాయణ అనరా..
ఇంకొక్క సారి , నారాయణ అనరా.. మరొక్క సారి, నారాయణ అనరా..
నారాయణ అన నరకము తొలగును, నారాయణ అనరా…
చరణం :-
2
కేశవ అనరాదా.. ఈ ఒక్క సారి, కేశవ అనరాదా..
ఇంకొక్క సారి , కేశవ అనరాదా..
మరొక్క సారి, కేశవ అనరాదా…
కేశవ అంటే ,
ఆశలు తొలగును, కేశవ అనరాదా…
చరణం :-
3
మాధవ అనరాదా.. ఈ ఒక్క సారి, మాధవ అనరాదా..
ఇంకొక్క సారి , మాధవ అనరాదా.. మరొక్క సారి, మాధవ అనరాదా..
మాధవ అంటే ,
మమతలు తొలగును, మాధవ అనరాదా…
చరణం :- 4
శివ శివ అనరాదా.. ఈ ఒక్క సారి, శివ శివ అనరాదా..
ఇంకొక్క సారి , శివ శివ అనరాదా.. మరొక్క సారి, శివ శివ అనరాదా..
శివ శివ అంటే ,
చింతలు తొలగును, శివ శివ అనరాదా…
చరణం :- 5
రామా అనరాదా.. ఈ ఒక్క సారి, రామా అనరాదా..
ఇంకొక్క సారి , రామా అనరాదా.. మరొక్క సారి, రామా అనరాదా..
రామా అంటే, రాగము తొలగును, రామా అనరాదా…
చరణం :-
6
శంకర అనరాదా.. ఈ ఒక్క సారి, శంకర అనరాదా..
ఇంకొక్క సారి , శంకర అనరాదా.. మరొక్క సారి, శంకర అనరాదా..
శంకర అంటే ,
శంకలు తొలగును, శంకర అనరాదా…
చరణం :- 7
కృష్ణా అనరాదా.. ఈ ఒక్క సారి, కృష్ణా అనరాదా..
ఇంకొక్క సారి , కృష్ణా అనరాదా.. మరొక్క సారి, కృష్ణా అనరాదా..
కృష్ణా అంటే ,
కష్టము తొలగును, కృష్ణా అనరాదా..
చరణం :-
8
గోవింద అనరాదా.. ఈ ఒక్క సారి, గోవింద అనరాదా..
ఇంకొక్క సారి , గోవింద అనరాదా.. మరొక్క సారి, గోవింద అనరాదా..
గోవింద అంటే ,
కోపము తొలగును, గోవింద అనరాదా..
శ్రీ హరి పాట
చరణం :-
1
హరి బోల్ హరి బోల్, హరి హరి బోల్
ముకుంద మాధవ,
గోవింద బోల్
చరణం :-
2
రామ బోల్ రామ బోల్, రామ రామ బోల్
సీతా సమేత, శ్రీ రామ చంద్ర బోల్
చరణం :-
3
కృష్ణ బోల్ కృష్ణ బోల్, కృష్ణ కృష్ణ బోల్
రాధా సమేత, శ్రీ రాధా కృష్ణ బోల్
చరణం :-
4
విఠల్ బోల్ విఠల్ బోల్, విఠల్విఠల్ బోల్
రుక్మా సమేత,
శ్రీ పాండు రంగ బోల్
చరణం :-
5
శివ బోల్ శివ బోల్, శివ శివ బోల్
గౌరీ సమేత, శ్రీ సాంబ శివ బోల్
చరణం :-
6
విష్ణు బోల్ విష్ణు బోల్, విష్ణు విష్ణు బోల్
లక్ష్మీ సమేత,
శ్రీ లక్ష్మీ నాధ బోల్
చరణం :-
7
బోల్ బోల్, బోల్ బోల్, బోల్ బోల్ బోల్
వల్లీ సమేత,
శ్రీ సుబ్రహ్మణ్య బోల్
:: ఆది తాళం
శ్రీ అయ్యప్ప స్వామి పాట
పల్లవి –
స్వామీ శరణం, శరణమొ అయ్యప్పా
హరి హర సుత ఓ పావన చరితా
భక్త మందారా భవ పరి హార
కరుణతో మమ్ము కావుము అయ్యప్పా
|| స్వామి శరణం ||
చరణం :-1
ముడుపులు కట్టి, శిరమున దాల్చి ,
మ్రొక్కులు తీర్చెద మయ్యా ,
నీవే దిక్కని వేడెద మయ్యా
దర్శన మొంద,
ధన్యత పొంది,
తరలీ వచ్చెద మయ్యప్పా
అయ్యప్పా స్వామీ,
అయ్యప్పా
|| అయ్యప్పా ||
చరణం :-2
అళుదా నదిలో మునిగి, రెండు రాళ్ళను చేతితొ తీసి
నిండు భక్తి తొ గుట్ట ఫై నుంచి
కరిమల చేరి, కరములు మోడ్చి, ఆనంద ముప్పొంగ పాడుదాం
అయ్యప్పా స్వామి అయ్యప్పా
|| అయ్యప్పా ||
చరణం :-3
పంబను చేరి ఆశలు మీరి, భక్తి తొ నిన్ను
తలసీ
నదిపై జ్యోతులనే వెలిగించి
శబరి పీఠం చూసి,
శరముల గుచ్చి,
నీ కీర్తి వెలుగెత్తి సాటు
అయ్యప్పా స్వామి అయ్యప్పా
|| అయ్యప్పా ||
చరణం :-
4 ప్రతి ఏడాది మకర సంక్రాంతి కి, పావన సన్నిధి చేరి
నీదు దర్శన భాగ్యము కోరి
పదునెనిమిది మెట్లెక్కి ,
పదములు మ్రొక్కి,
పరవశ మవుదుము స్వామీ
అయ్యప్పా స్వామి అయ్యప్పా
|| అయ్యప్పా ||
బృందావనమది అందరిది వరస:: ఆది తాళం
మంగళ హారతి పాట
పల్లవి –
మంగళ హారతి,
ముదముగను
మా సీతా రాముల కివ్వరటే
సుదతు లార మీరందరు కూడి
సొంపుగ హారతు లీయరాటే
|| మంగళ ||
చరణం :-1
బంగరు పళ్ళెరముల యందు
బల్ చక్కని వసంత మును బోసి
వనిత లార మీ రందరు కూడి
వేగమె హారతు లీయరటే
|| మంగళ ||
చరణం :-2
సీతా రాముని పొగడుచును
బహు చక్కని పాటలు పాడుచును
రమణు లార, మీ రెల్లరు కూడి
రయముగ హారతు లీయరటే
|| మంగళ ||
చరణం :-3
పునుగు జవ్వాది,
అత్తరులు
బల్ చక్కని పన్నీరుల తోడ
సుగంధి తిలకము,
దిద్దుచు మీరలు
యింపుగ హారతు లీయరటే
|| మంగళ ||
No comments:
Post a Comment