ముఖానికి
- జాపత్రిని పాలతో బాగా అరగదీసి రాత్రి పడుకోబోయే ముందుగా ముఖం మీద నల్లమచ్చలున్నచోట రాయండి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో ముఖం కడగండి. 10 రోజులు ఇలా చేయండి.
- కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి.
- ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి.
- అప్పుడప్పుడు ఫేషియల్స్ చేయించుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గి చర్మం నునుపుతేలుతుంది.
- అరటిపండు గుజ్జుకు సరిపడా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, కురులకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే కొత్త మెరుపు వస్తుంది.
- ఆపిల్ గుజ్జు తీసుకొని తేనె లేదా పాలు కలిపితే అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారవుతుంది.
- ఆభరణాల వల్ల మెడ నల్లగా అయినవారు నారింజ తొనలను గుజ్జుగా చేసి దానితో మెడ దగ్గర సున్నితంగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తే నలుపు విరిగిపోతుంది.
- ఆలు ఉడకబెట్టి గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం అందంగా తయారవుతుంది.
- ఆలోవెరాకు చిటెకెడు గంధంపొడి కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల తాలూక మచ్చలు, ముడుతలు పోయి ముఖం నునుపుతేలుతుంది.
- ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకోవాలనుకునే వారు ఇలా ప్రయత్నిస్తే సరి - నిమ్మరసం, కమలా పండు రసం ఒక్కో చెంచాడు చొప్పున తీసుకోవాలి. టమాటా గుజ్జులో ఈ రసాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకోవాలి.కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి.
- ఉప్పు, పంచదార సమపాళ్ళలో తీసుకోవాలి. ఈ రెండు కరిగేలా కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ సమస్యకు ఇది సులువైన పరిష్కారం.
- ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని మొఖానికి పట్టిస్తే...మొటిమలు మటుమాయం.
- ఉసిరిరసం, పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముడతలు పడిన చర్మానికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
- ఎండ వడకు తట్టుకోలేని వారు అడపాదడపా చందనాన్ని నీళ్ళలో నూరి ముఖానికి పట్టించుకొని దాన్ని ఎండనివ్వాలి. ఆ తరువాత కడిగేస్తే తాజాగా, హాయిగా ఉంటుంది.
- ఎండకు ముఖ చర్మం కములుతుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టమోటా రసం, నాలుగు టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకుని రెండిటిని బాగా కలిపి కమిలిన ప్రాంతాల్లో రాయాలి. అరగంటాగి చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితముంటుంది.
- ఎండలో బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసు టమోటా రసం తాగితే వేడి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
- ఒక కప్పు పుదీనా ఆకులను రెండు కప్పుల నీళ్లలో ఉడికించి చల్లారిన తరువాత ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం తెల్లబడుతుంది.
- కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి.
- కమలాపండు తొనలు ఒలిచి పై పొర తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని క్లెన్సింగ్ మిల్క్‌తో శుభ్రంచేసి, ఐస్ వాటర్‌లో ముంచిన దూదితో రుద్దాలి. తర్వాత కమలాపండు గుజ్జుతో ముఖానికి, మెడకు మృదువుగా మర్దన చేయాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి మరి కాస్త గుజ్జులో ముల్తాని మట్టి, తేనె కలిపి ప్యాక్ లాగా వేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ముఖవర్చస్సు పెరుగుతుంది.
- కాస్మటిక్ స్పాంజ్లు, మేకప్ బ్రష్ లను రెండు నెలలకోసారి మార్చాలి. లేకపోతే వాటి మీద బ్యాక్టీరియా తయారై చర్మానికి హాని చేస్తుంది. మేకప్ బ్రష్ లను కూడా నెలకోసారి మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి. నీడపట్టునే తడి ఆరిపోయేదాకా ఉంచి ఆ తర్వాత వాడుకోండి.
- కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
- కొద్దిపాటి ఆముదాన్ని తేనెలో కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మొటిమలు తగ్గే అవకాశం ఉంది.
- కొబ్బరి నీటితో మొహం, ఇతర శరీర భాగాలపై మర్దన చేయటం వల్ల రంగు పెరుగుతాయి.
- కోడి గుడ్డు తెల్లసొనలో పావు చెంచా తేనె కలిపి గిలకొట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడతలు పోతాయి.
- క్యారెట్ ఉడికించిన నీళ్ళతో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది.
- గంధం పొడి, పసుపు, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం మెరిసి పోతుంటుంది.
- చక్రాల్లా తరిగిన కీరా ముక్కలతో ముఖమంతా రుద్దాలి. ఐదు నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ముఖంపై మురికి తొలగిపోయి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
- చర్మంపై ముడతలను పోగొట్టడానికి క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జులో బాదం ఆయిల్, తేనె కలిపి రాయాలి.
- చాలా సౌందర్య చికిత్సల్లో ఉల్లిని వాడతారు. ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
- చెంచా టమోటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ పై రాసుకున్నా చక్కని ఫలితం ఉంటుంది.
- చెంచాడు పాలపిండిలో తేనె కలిపి పేస్టులా చేసి దానిని మొహానికి రాసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడుతలు పోతాయి.
- జిడ్డుగా ఉంటే చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కొద్దిగా కీరాదోస లేదా క్యారెట్ గుజ్జు, రెండు చుక్కల నిమ్మ రసం...వీటన్నిటినీ కలిపి ముఖానికి పటించాలి. చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.
- టమోటా గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌లా పని చేస్తుంది.
- టమోటా రసానికి కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి చక్కటి పరిష్కారం.
- టేబుల్ స్పూన్ తేనెకు పావు చెంచా క్యారెట్ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తీసేయాలి. దీనివల్ల ముడతలు పోవడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది.
- తేనెని తీసుకోవడం వలన కూడా శరీర ఛాయ పెరుగుతుంది. తేనెలో ఉండే విటమిన్ సి కాంప్లెక్సు చర్మం రంగుని మెరిపించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
- తేనెను వేడిచేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడే ముఖానికి రాయాలి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో మొహం కడుక్కోవాలి.
- నిమ్మకాయ రసం చర్మంపై ముడతలను, తలలో చుండ్రును పోగొడుతుంది.
- నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీర రంగు మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది. తరచుగా దీనిని త్రాగటం అలవాటు చేయాలి.
- పాలలో నానేసిన గులాబీరేకులను ముఖం మీద రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత కడుక్కుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
- పాలు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. కాబట్టి రోజూ స్నానానికి ముందు కొద్ది పాలలో దూదిని ముంచి మొహానికి రాసుకుని అరగంట ఆరనిచ్చి స్నానం చేయాలి.
- పుచ్చకాయరసాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చన్నీళ్ళతో కడుక్కుంటే చర్మం తాజాగా ఉంటుంది.
- పెరుగు, శనగపిండి కలిపి ముఖానికి నలుగు పెట్టుకుంటే మొటిమలు తగ్గుతాయి.
- పొడిబారినట్లున్న చర్మానికి తేనె, ఆలివ్ నూనె, పసుపు, గంధంపొడి కలిపి రాసి ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి.
- ఫేస్ స్క్రబ్ సహాయంతో చర్మంపైన మృత కణాలను ఎప్పటికప్పుడు తొలిగించుకోవాలి. అయితే స్క్రబ్‌తో గట్టిగా వత్తకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. ఒకవేళ చర్మం కందిపోయినట్లు అయితే వెంటనే స్క్రబ్ వాడటం ఆపేయాలి.
- బంగాళదుంప ముక్కతో తరచుగా ముఖాన్ని, ముఖ్యంగా కళ్ల కింది భాగంలో రాసుకుంటుండాలి. ఇలా రాసుకుని కొద్దిసేపటి తరువాత చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల కళ్ల కింది నల్లని వలయాలు మాయమై ముఖం మెరుపు లీనుతుంది.
- బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్ లా వేసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైంలు చర్మంలో మృతకణాలను తొలగించి మీ చర్మానికి కొత్త కాంతి నిస్తాయి.
- మిగిలిపండిన టమోటా రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకుని 20 నిముషాల తరువాత కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
- ముఖం మీద సన్న బెజ్జాలు కొన్ని తెరుచుకుని ఉంటాయి. అవి అలా తెరుచుకుని ఉంటే మురుకి చేరుతుంది. అలా కాకూడదంటే దోసకాయను ముక్కలుగా తరిగి రసం పిండి ముఖానికి పూసి, ఎండనిచ్చి ఆ తరువాత కడిగేయాలి (మామూలు చర్మానికి, జిడ్డు చర్మానికి ఈ విధానం పనికి వస్తుంది), దూదిలో ఐస్ ముక్కలు ఉంచి, దాంతో ముఖం మీద మెత్తగా రుద్దినా బెజ్జాలు మూసుకుపోతాయి.
- ముఖంపై ముడతలు పోవాలంటే గిoజలు లేని ద్రాక్ష చక్కని పరిష్కారం. సగం కోసిన ద్రాక్ష ముక్కను ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.
- ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు ఉంటే కొంచెం పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు మాయమౌతాయి.
- ముఖాన మొటిమలుంటే ముందుగా రోజ్ వాటర్, కర్పూరం కలిపిన నీటితో కడగాలి. టమాటాని అడ్డంగా కోసి ఆ సగం చక్క తో ముఖమంతా రుద్దాలి. దాంతో జిడ్డుతగ్గుతుంది. ఇప్పుడు గంధం పొడిలో కొంచం కర్పూరం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే హాయిగా ఉంటుంది.
- ముల్తాన మట్టికి కొంచెం పెరుగు కలిపి మాస్క్ వేసుకుంటే ముఖానికి సరికొత్త మెరుపు వస్తుంది.
- ముల్లంగి రసం, పెరుగు కలిపి ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి రెండుసార్లు ముఖానికి, చేతులకీ రాసుకుంటే ఎండ వల్ల వచ్చిన నలుపుదనం పోతుంది.
- మెత్తగా పండిన అరటి పండు గుజ్జును ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరాక చల్లని నీటితో కడిగేయండి. ముడతలకిది చక్కని పరిష్కారం.
- మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుమానుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది.
- మొహాన్ని శుభ్రం చేసుకునేందుకు తక్కువ గాఢత కలిగిన ఫేస్‌వాష్‌నే వాడాలి.
- రాత్రి పడుకునే ముందు తాజా నిమ్మరసాన్ని ముఖానికి మర్దన చేసి ఐదు నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి. నిమ్మ మంచి యాస్ట్రింజెంట్‌గా, బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.
- రెండు చెంచాల బాదంపొడి, అరచెంచా నిమ్మరసం, రెండుచెంచాల తేనెను బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
- రోజు రెండు, మూడు సార్లు ముఖాన్ని మంచి నీటితో కడగాలి. ముఖాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునేముందు తప్పకుండా మంచి ఔషధ గుణాలున్న సబ్బు నురగను సబ్బుతో మచ్చలపై మృదువుగా రాసి కడగాలి.
- వేసవి ఎండలో బయట తిరిగే వారు రోజూ రెండు మూడు సార్లు మంచి ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి.
- సాధారణ చర్మతత్వం ఉంటే చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కాస్త ద్రాక్ష గుజ్జు, రెండు చుక్కల రోజ్ వాటర్ బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాలాగి కడిగేయాలి.
పుదీనా ప్యాక్
మొటిమల సమస్యను నివారించడానికి ఇంటి పట్టున చేసుకోగలిగే సులువైన చికిత్సలివి.పైగా సురక్షితం కూడా.మెరుగైన ఫలితమూ సాధ్యమంటున్నారు నిపుణులు.
- పుదీనాలోని మెంధాల్‌కు చర్మానికి సాంత్వననివ్వడమే కాదు క్రిములను నాశనం చేసే శక్తి కూడా ఉన్నది.అందుకే ముఖానికి తరచూ పుదీనా రసాన్ని ప్యాక్ వేసుకుని చూడండి.
- నిమ్మ జాతి పండ్లలోని సిట్రిక్ యాసిడ్ సహజమైన ఆస్ట్రిజంట్‌గా, యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది.
- దాల్చిన చెక్కలోనూ సూక్ష్మ క్రిములను నాశనం చేసే గుణం ఉంది.
- తేనే, అలోవెరా జెల్, కీరదోస చర్మానికి సాంత్వననిచ్చి తేమనిస్తాయి.మృదువుగా ఉండేందుకు దోహదపడతాయి.
- తేనేకు దాల్చిన చెక్క పొడి కలిపిన మిశ్రమాన్ని మూఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.యాక్నేకు ఇది మంచి పరిష్కారం.
- బాగా పండిన టమాటా గుజ్జును ముఖం ఆంతా రాయాలి.ఆరిన తర్వత చల్లని నీటితో కడిగేయాలి.తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- తేనే మంచి మాయిశ్చరైజర్ మాత్రమే కాదు.చర్మం పై మచ్చలను, గుంటలను కూడా తగ్గించగలదు.క్రమం తప్పకుండా రాసుకుంటే మెల్లగా ఫలితం కనిపిస్తుంది.
- నిమ్మరసం, రోజ్ వాటర్ సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసి మర్దనా చేయాలి.కొద్ది సేపటి తర్వాత కడిగేయాలి.చర్మం కాంతిమంతమవుతుంది.
No comments:
Post a Comment