- -డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
- 07/07/2013
నిద్రలేమి , దిగులు ఆందోళన ...
ఇలా కారణము ఏదైనా కావొచ్చు దీర్గాకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలనుఏర్పరచడం ద్వారా ముఖ సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలుఉన్నాయి ..
ఉదా :
*బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది . ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు . బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి . ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమము గా విరుగుతుంది .
* ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.
* నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.
* బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.
* కాసిని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్‌లా వేయాలి. ఆరాక కడిగేస్తే చాలు.. ఎంతో మార్పు కనిపిస్తుంది.
* మీరు వాడే మేకప్ సామగ్రిలో మీ చర్మతత్వానికి నప్పే కన్సీలర్‌ను తీసుకోండి. దీన్ని నల్లనివలయాలు కనిపించకుండా చేయవచ్చు. కంటి అడుగున రాసుకుంటే చాలు.
* మంచి నీళ్లు సమృద్ధిగా తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవడం కూడా తప్పనిసరి.
* కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.
ఇలా సౌందర్య చిత్కాలతోనే కాదు ఆహారము లో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చును . విటమిన్ల లో "కే"విటమిన్క్ష్ కి ఇదే గుణము (SkinLightening) ఉంది. కంటికింద మచ్చలతో భాధపదేవారు సౌందర్య ఛిట్కాలతోపాటు ' కే ' విటమిన్ అధికంగా లభ్యమయ్యే ఆహారము తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
" కే విటమిన్ పుస్కలము గా లభించే ఆహారపార్దాలు :
క్యాలీఫ్లవర్ ,
క్యాబేజీ,
బ్రాకోలి,
క్యారెట్ ,
బీన్స్ ,
సోయాబీన్స్,
దోసకాయ ,
పచ్చిబతానీలు ,
కాలేయము(Liver) ,
చేప నూనె,
పెరుగు ,
పాలు ,
అన్ని రకాల ఆకుకూరలు - పాలకురలో ఎక్కువ ,
చికిత్స :
బుటాల్జిన్ అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున వాడినట్లయితే ఈ నడుము నొప్పి తగ్గుతుంది. అంటే వీటిని ప్రతి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి కాకపోతే బెరిన్ టాబ్లెట్లను రోజుకు రెండు చొప్పున వాడినా నడుము నొప్పి బాధ తగ్గతుంది.
దీనికి కొన్ని రకాల పైపూత మందులు(Dolorub, Zobid gel , Nobel gel etc.) కూడా వచ్చాయి. అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒకవేళ ఈ మందులు వాడినప్పటికీ నడుము నొప్పి తగ్గకపోయినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.
నడుము నొప్పికి ఆయుర్వేదం :
కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు,
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల చేయాలి 10 సార్లు రోజు,
దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు,
వాన కాలం : 7 లేక 15 రోజులకు,
చలికాలం : రోజు,
1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి...పాత బెల్లం పావు కేజి...ఆవు లేక గేద నెయ్యి పావు కేజి...అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి ,వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా 40 రోజులు చేయలి .
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద అతికించాలి, అది వుడిపోదు..
3.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి
4.వెల్లుల్లి గారెలు :మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు...అల్లం 3 గ్రాములు...ఇంగువ 3 చిటికెలు...సైంధవలవణం పావు స్పూను...అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి,
5.బాదం పప్పు పావు కేజి,మునిగేటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి..పటిక బెల్లం పావు కేజి...అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి...ఇది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి,జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది
అనేక రోగాలపై కత్తి - అత్తిపత్తి

ఈ మొక్కను మీరంతా చూసే ఉంటారు. ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుని కొంత సమయం తరువాత వాటంతట అవే మళ్ళి విచ్చుకుంటాయి. వర్షా కాలంలో మన గ్రామాల చుట్టూ నీటి తడి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళు లేని మొక్క, ముడ్లు ఉన్న మొక్క అనే రెండు రకాలు ఉంటాయి. ముడ్లున్న అత్తా పత్తి భూమి నుండి జానెడు మొదలు మూరడు వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మకుల్లగా చిన్నగా ఉంటాయి.
కొమ్మలకు ముళ్ళుంటాయి. పూలు ఎరుపు కలిసిన ఉదారంగులో ఉంటాయి. ముడ్లు లేని అట్టి పత్తి నేలపై పరచుకుని ఉంటుంది, ఇది కూడా నీరున్న ప్రాంతాలలో పెరుగుతూనే ఉంటుంది. నెల పైన రెండు ముడు గజాల దాకా పాకుతుంది. దీనికి పసుపు రంగు పూలు ఉంటాయి, సన్నటి కాయలు ఉంటాయి, కాయల్లో గింజలు లక్క రంగులో ఉంటాయి.
అత్తిపత్తి కి అనేక పేర్లు
సంస్కృతంలో లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు.

అత్తిపత్తి-గుణ గణాలు
ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ది చేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది, ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది, పాత వ్రణాలనుమాన్పుతుంది, మేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగాన్ని, స్త్రీరోగాలను హరించి వేస్తుంది.
వీర్య హినతకు – బ్రహ్మాస్త్రం
అత్తిపత్తి గింజలు, చింతగింజల పప్పు, నీరుగోబ్బి గింజలు సమంగా తీసుకుని మర్రి పాలలో ఒక రాత్రి నానా పెట్టి తరువాత గాలికి అరపెట్టి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి. రెండు పుటలా ముడు మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటు అవు పాలు కండ చెక్కర కలిపి తాగాలి.
నలబై రోజుల్ ముత్రములో వీర్యము పోవడం, శిఘ్రస్తలనం, నపుంసకత్వం, అన్గాబలహింత హరించి ధాతుపుస్టి కలుగుతుంది.
ఆహార నియమాలు: వేడి, పులుపు, కారం పదార్దాలు నిషేదించి భ్రహ్మచర్యం పాటించాలి.
ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు
ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయటం వల్ల గాని, లేక సెగ రోగామున్న వారితో సంబోగం జరపడం వల్ల గాని, ఈ సుఖ రోగం కలుగుతుంది.
ఆ సమస్యకు అత్తిపత్తిఆకు, మంచిగందం పొడి, సమంగా తీసుకుని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలు కత్తి నీడలో గాలికి బాగా ఎండబెట్టి నిలువ ఉంచుకోవాలి. రోజు రెండు పుటలా పుటకు ఒక మాత్ర మంచి నీటితో వేసుకుంటుంటే సెగ తగ్గటమే కాక విర్య వృద్ది కలుగుతుంది.
నారికురుపులు
నశించుటకు
అత్తిపత్తి ఆకులూ మెత్తగా నూరి నారి కురుపులుపై వేసి కట్టుకడుతూ ఉంటె అవి నశించి పోతాయి.
ఆహార నియమాలు: గొంగోర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.
ఆగిన బహిష్టు-మరలా వచ్చుటకు
అత్తిపత్తి ఆకు పొడి ఒక బాగము, పటిక బెల్లం పొడి రెండు బాగాలు కలిపి పుటకు అర చెంచ పొడి మంచి నీటితో సేవిస్తూ ఆగిన బహిష్టు మరల వస్తుంది, రాగానే చూర్ణం వాడటం ఆపాలి.
ఆహార నియమాలు: బెల్ల నువ్వులు, గంజి, తీపి పదార్ధాలు వాడాలి.
వీర్య స్తంభనకు
అత్తిపత్తి వేర్లను మేక పాలతో గాని, గొర్రె పాలతో గాని, గంధంలా నూరి ఆ గంధాన్ని ఫురుషులు తమ అరికాళ్ళకు మర్దించుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటి వరకు విర్యపతనం కాదు.
బోదకాలి మంట, పోటుకు
అత్తిపట్టిఆకు 5గ్రా., మిరియాలు 9 ఒక కప్పు నీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజుల పాటు సేవించాలి, దీనితో పాటు... అత్తిపత్తి ఆకును ముద్దగా నూరి బోధకాలిపై పట్టులాగా వేసి కట్టు కడుతూ ఉంటె మాట, పోటు,బాద తగ్గిపోతాయి.
ఆహార నియమాలు: మాంసం, చేపలు, నంజుపధర్ధాలు నిషేధం.
స్త్రీల యోని బిగువకు
అత్తిపత్తి ఆకు తేనెతో మెత్తగా నూరి యోనికి పట్టిస్తూ ఉంటె యోని బిగువగా మారుతుంది.
ఆహార నియమాలు: తీపి పదార్ధాలు సేవించాలి.
స్త్రీల స్తనాల బిగువుకు
అత్తిపత్తి సమూలఛుర్నం, అస్వగంద దుంపల చూర్ణం సామగా కలిపి వుంచుకుని రాత్రి పుట తగినంత పొడిని నీటితో నూరి స్తనలపై పట్టించి ఉదయం కడుగుతూ ఉంటె జారిన స్తనాలు బిగువుగా మారతాయి.
ఆహార నియమాలు: పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.
చల్ది, మశూచికములకు
అత్తిపత్తి ఆకు 30గ్రా.. మిరియాలు 2 గ్రా.. ఈ రెంటిని మెత్తగా నూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. రెండు పుటలా ఒక మాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూ చెల్దికురుపులు మసూచికంగండమాల హరించి పోతాయి.
ఆహార నియమాలు: చేపలు, మాంసం, వేడి పదార్ధాలు నిషేధం.
నీళ్ళవిరేచనాలు-రక్తమొలలు
అత్తిపత్తి సమూల చూర్ణం 3 నుండి 5 గ్రా పంచదార ఒక చెంచా కలిపి రెండు పుటల సేవిస్తుంటే అతిసారా విరేచనాలు, రక్త మొలలు హరించి పోతాయి:
ఆహారనియమాలు: విరేచనకర పదార్ధాలు నిషేధం.
సిగ్గు విడచిన – స్త్రీ పురుషులకు
సూర్య గ్రహణము లేక చంద్రగ్రహనము రోజున అత్తిపత్తి ధూపదీప నైవేద్యలతో పూజించి వేరు తెచ్చి కడిగి ఆరపెట్టి దాన్ని రాగి తాయేత్తులోపెట్టి మొలకు గాని చేతికి గాని కట్టిఉంచితే అంతకుముందువరకు సిగ్గు లేకుండా బరితెగించి ప్రవర్తిచే స్త్రీ పురుషులు క్రమంగా తమ తప్పును తామే తెలుసుకుని సిగ్గు పడతారు.
అతిముత్రమునకు-అత్తిపత్తి
పచ్చని పూలు పుసే అత్తిపత్తి చెట్టు కాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగ్గా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా అరపెట్టి రెండు పుటలా మర్రి చెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటె అతి మూత్రం హరిస్తుంది.
వ్రణాలకు-అత్తపత్తి
అత్తపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులుపైన, పుడ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటె క్రమంగా వ్రణాలు మాడిపోతాయి.
అత్తపత్తితో-అద్బుత కాటుక
అత్తపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ తెచ్చి కడిగి నలగొట్టి అందులో 4 కేజీల నీళ్ళుపోసి ఒక రాత్రి నానబెట్టి ఉదయం పొయ్యి మీద పెట్టి ఒక కేజీ కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి ఆ కషాయంలో ఒక కేజీ నువ్వుల నునే పోసి తైలం మిగిలే వరకు మళ్ళి మరగ బెట్టాలి.
తరువాత ఆ నూనెతో దీపం వెలిగించి పైన మంటతగిలేలా మట్టిముకుడు గాని, రాగి పళ్ళెం కాని పెట్టి మసి పారించాలి. తరువాత ఆ మసిని తీసి ఆవునెయ్యి కలిపితే కాటుక అవుతుంది. రోజు రాత్రి కళ్ళకు పెట్టుకుంటుంటే పొరలు, పూతలు మసకలు తగ్గిపోతాయి.
‘ఉత్తరేణి’ - ఇంటివైద్యం
TAGS:

స్ర్తి జననేంద్రియంలో నొప్పి (వల్వోడైనియా)
ఉత్తరేణి ఆకులను రెంటిని జననేంద్రియం లోపలకు ప్రవేశపెడితే వెంటనే జననేంద్రియంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. (గదనిగ్రహం)
ప్రసవానంతరం
జననేంద్రియంలో వచ్చే నొప్పి
ఉత్తరేణి వేర్లు, గలిజేరు వేర్లు వీటిని రెంటినీ ముద్దగా నూరి బాహ్యంగా ప్రయోగిస్తే ప్రసవానంతరం జననేంద్రియంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. (వృందమాధవ)
నిద్రా రాహిత్యం
ఉత్తరేణి మొక్కతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటే నిద్ర వస్తుంది. (హారీత సంహిత)
ఆంత్రక్రిమి
ఉత్తరేణి మొక్క, దిరిశెన చెక్కల రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆంత్రక్రిములు నశిస్తాయి. (సుశృత సంహిత, ఉత్తర స్థానం)
ఉత్తరేణితో గృహ చికిత్సలు
ఒంటి కణత నొప్పి
ఉత్తరేణి గింజల చూర్ణాన్ని గాఢంగా ఆఘ్రాణిస్తే ఒంటి కణత నొప్పి తగ్గుతుంది. ఉత్తరేణి గింజల గాఢమైన వాసన వల్ల తలలో చేరిన కఫం పలుచబడి వెలుపలకు వచ్చేసి, తల లోపల వత్తిడి తగ్గుతుంది.
పంటి నొప్పి, దంతశూల, పిప్పిపళ్లు
ఉత్తరేణి ఆకు రసాన్ని బాహ్యంగా ప్రయోగించాలి. ప్రయోగ విధానం తెలుసుకుందాం. ఉత్తరేణి ఆకులను గుప్పెడు తెచ్చి, రసం తీసి, దానిలో దూదిని తడిపి దంతాల మీద ఉంచితే పంటినొప్పి తగ్గుతుంది.
నోటి దుర్వాసన, దంతాలు కదలటం, చిగుళ్లవాపు
ఉత్తరేణి కొమ్మను ముఖం పుల్లగా వాడితే చిగుళ్లు గట్టిపడి దంతాలు కదలకుండా ఉంటాయి. అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యంలో కూడా దంతాలు పూర్తి ఆరోగ్యంతో తళతళ మెరుస్తాయి.
చెవుడు
ఉత్తరేణి తైలాన్ని చెవిలో వేసుకోవాలి. ప్రయోగ విధానం చాలా సులభంగా ఉంటుంది. ఉత్తరేణి మొక్కను పంచాంగ సహితంగా తెచ్చి, బాగా కడిగి ముద్దగా దంచి, రసం పిండి, దానికి సమాన భాగం నువ్వుల నూనె కలిపి, మంట మీద పక్వం చేయాలి. జలీయాంశం మొత్తం ఆవిరై కేవలం తైల భాగం మాత్రమే మిగిలేంత వరకూ ఉడకబెట్టి, ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ 2-3 చుక్కల చొప్పున కొద్దిగా వేడిచేసి రెండు చెవుల్లోనూ వేసుకుంటే చెవుల నుంచి జరిగే కర్ణస్రావాలు తగ్గుతాయి.
విసూచిక (గ్యాస్ట్రోఎంటిరైటిస్)
ఉత్తరేణి వేరును ముద్దగా నూరి నీళ్లతో తీసుకుంటే వాంతులు, విరేచనాలు ఏకకాలంలో అవ్వటం తగ్గుతుంది. (్భవప్రకాశ)
సిద్మకుష్ఠం (బూడిద గుమ్మడి పువ్వులను పోలినట్లుండే పొట్టురాలే చర్మవ్యాధి)
ముల్లంగి గింజలను ఉత్తరేణి ఆకుల స్వరంతోగాని లేదా ఉత్తరేణి వేరు ముద్దతో గాని కలిపి నూరి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మం మీద పొట్టులాగా రాలే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీని తరువాత అరటి వేరును బూడిదగా మండించి క్షారాన్ని తయారుచేసి పసుపుతో కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. (వృందమాధవ)
(క్షార ప్రక్రియ: ఒక కుండలో మూలిక భాగాలను కొద్దికొద్దిగా వేస్తూ బూడిదగా మండించాలి. దీనికి 6 రెట్లు నీళ్లు కలిపి, వడపోసి, ఆ నీటిని తిరిగి పూర్తిగా ఆవిరయ్యేలా మరిగిస్తే అడుగున ఉప్పులాంటి పదార్థం మిగులుతుంది.)
సిద్మకుష్ఠం (పొట్టురాలే చర్మవ్యాధి)
ఉత్తరేణి మొక్క క్షారాన్ని బాహ్యంగా ప్రయోగిస్తే సిద్మకుష్ఠం తగ్గుతుంది. (వైద్య మనోరమ)
మూత్ర మార్గంలో రాళ్లు తయారవటం (మూత్రపిండాల్లో రాళ్లు)
ఉత్తరేణి మొక్క, నువ్వుల కట్టె, అరటి వేరు, మోదుగ పంచాంగాలు, బార్లీమొక్కలు వీటిని బూడిదగా మండించి, క్షార ప్రక్రియతో క్షారాన్ని తయారుచేసి, 250 మి.గ్రా. నుంచి 500 మి.గ్రా. వరకూ నీళ్లతో గాని లేదా శుద్ధిచేసిన గొర్రె మూత్రంతో కలిపి గాని తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు పడిపోతాయి. (అష్టాంగ హృదయం, చికిత్సా స్థానం)
మూత్రవిసర్జన నొప్పిగా ఉండటం (డిసూరియా)
ఉత్తరేణి వేరును ముద్దగా నూరి గాని లేదా చూర్ణరూపంలో గాని పాలతో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. (వైద్య మనోరమ)
ప్రశ్న - జవాబు
సి.వినోదిని (ఏలూరు)
నాకు ఏడేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు. వాళ్లకు అప్పుడప్పుడు జలుబు, జ్వరం వచ్చి తగ్గుతుంటాయి. ముఖ్యంగా వర్షాలు పడే రోజుల్లో దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ, డెంగీ, టైఫాయిడ్ జ్వరాల గురించి పేపర్లలో చదువుతున్నాను. వీటిని నివారించడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఆయుర్వేద వైద్యంలోని మంచి మందులను తెలియజేయండి.
జ: ఆయుర్వేద శాస్త్రంలో వ్యాధుల నిర్ధారణకు లక్షణాలు ప్రధానం. తరువాత అది ఏ భాగాన్ని ఆశ్రయించిందో పరిశీలించాలి. అప్పుడు వాత, పిత్త, కఫాలలో దేని ప్రాబల్యం ఎక్కువ ఉందో తెలుస్తుంది. ఈ మూడు కలిసి ప్రకోపించి కలుగజేసిన రోగాన్ని ‘సన్నిపాతజం’ అంటారు. ఇది వ్యాధి తీవ్రతకు పరాకాష్ఠ. ముఖ్యంగా జ్వర వర్గీకరణలో సన్నిపాతజానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కొన్ని వైరస్, బాక్టీరియా వల్ల కలిగే సంక్లిష్ట జ్వరాలన్నీ సన్నిపాతజ సంబంధిత వ్యాధులే.
వ్యాధికి కారణాన్ని గుర్తించి, దానికి దూరంగా ఉండటం అనేది ఆయుర్వేద చికిత్సా సూత్రాలలో ముఖ్యమైనది. (సంక్షేపతః క్రియాయోగో నిదానస్యజ వర్ణనం). ఈ కారణాల్లో చాలావరకు ఆహార విహార నియమాలకు సంబంధించినవి ఉంటాయి. వీటినే ఆయుర్వేదం పథ్యం, అపథ్యాలుగా వివరించింది.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనిషి తత్వాన్నిబట్టి హితకరమైన, బలకరమైన ఆహార విహారాలు అలవరచుకోవాలి.
బాదం లాంటి డ్రైఫ్రూట్స్, కాలానుగుణమైన తాజా ఫలాలు శరీరానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరికాయ రసాన్ని లేదా ఆమ్లకీ రసాయనం అనే చూర్ణాన్ని రెండు పూటలా ఒక్కొక్క చెంచా తేనెతో సేవించాలి. రోజూ తగినంత వ్యాయామం, రెండు పూటలా ప్రాణాయామం చేయడం మంచిది.
గృహ చికిత్స
తిప్పతీగ (గుడూచి), అడ్డసరం ఆకులు (వాసా), వేప బెరడు (నింబ), తమలపాకులు (తాంబూల), తులసి ఆకులు.. వీటిని ఒక్కోటి పదేసి గ్రాముల చొప్పున తీసుకోవాలి. నాలుగు కప్పుల నీళ్లకు వేసి మరిగించాలి. ఒక కప్పు కషాయం మిగిలిన తరువాత దించి వడపోసుకోవాలి. దీనిని అరకప్పు ఉదయం, అరకప్పు రాత్రి, గోరు వెచ్చగా తాగాలి. అవసరమైతే తేనె కలపవచ్చు. దీనిని క్రమం తప్పకుండా వాడితే, అన్ని రకాల జ్వరాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఔషధ చికిత్స
అగస్త్య హరీతకీ రసాయనం అనే లేహ్యాన్ని, ఉదయం, సాయంత్రం ఒక్కొక్క చెంచా చప్పరించి పాలు తాగితే ఇమ్యునిటీ పెరిగి చీటిమాటికి జ్వరాలు రాకుండా ఉంటాయి.
అమృతారిష్టం అనే ఔషధ ద్రవాన్ని నాలుగేసి చెంచాల మోతాదులో, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి. దీనిని ఎన్నాళ్లు వాడినా ఫరవాలేదు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వైరస్ జ్వరాలు రాకుండా ఉండాయి.
ఇక వర్షాకాలంలో వచ్చే సాధారణ జ్వరాలకు చికిత్స. వీటిని పది రోజులపాటు, వైద్య పర్యవేక్షణలో వాడాలి. జలుబు, స్వైన్‌ఫ్లూ వంటి జ్వరాలకు నారదీయ లక్ష్మీవిలాసరస అనే మాత్రలను ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడాలి. డెంగీ జ్వరానికి చంద్రకళారస మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడాలి. టైఫాయిడ్‌కి జ్వరానికి మృత్యుంజయరస లేదా సన్నిపాత భైరవి అనే మాత్రలను ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాడాలి.
Challa Krishna Rao, syamasundarapuram
No comments:
Post a Comment