Monday, 23 March 2015

మూత్రపిండరాళ్ళకు

పల్లేరు చెట్టు వేర్లు, ఆముదం చెట్టు వేర్లు, పెద్ద ములక వేర్లు, చిన్నములక వేర్లు వీటిని సమంగా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి 30 గ్రాముల యవకుట చూర్ణాన్ని 1 కప్పు పాలకు కలిపి 1 కప్పు నీళ్లు చేర్చి, పాలు మాత్రమే మిగిలేంత వరకూ మరిగించి తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల్లోని రాళ్లు పడిపోతాయి. (చరకసంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని తేనెతోనూ, మేకపాలతోనూ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి. (సుశృత సంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని స్వర్ణమాక్షీక భస్మాన్ని గేదె పాలతో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగి పడిపోతాయి. (హారీత సంహిత)
ఒక కప్పు పాలకు 5 గ్రా. ద్రాక్ష పండ్లను, 5 గ్రా. పల్లేరు కాయలను వేసి మరిగించి, 3 గ్రాముల శతావరి వేరు చూర్ణాన్ని కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలోపల జరిగే రక్తస్రావాలు తగ్గుతాయి. (వృందమాధవ)
శతావరి వేరు చూర్ణాన్ని, పల్లేరు కాయలను పాలకు కలిపి మరిగించి, వడపోసి తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం అనే సమస్య తగ్గుతుంది. (చరక సంహిత)
పల్లేరు కాయలను, కంటకారి మొక్కను బెల్లంతో కలిపి పాయసంలాగా చేసుకొని తీసుకుంటే మూత్ర విసర్జనలో నొప్పి తగ్గుతుంది. (చరక సంహిత, అష్టాంగ సంగ్రహం)
పల్లేరు కాయల కషాయం, బెల్లం, పాలు, శొంఠి, వీటిని 4 రెట్లు నువ్వుల నూనెతో కలిపి, 16 రెట్లు నీళ్లు చేర్చి తైలం మాత్రమే మిగిలేంత వరకూ మరిగించి, చల్లార్చి వడపోసి కడుపు లోపలకు, వస్తికర్మల రూపంలోనూ తీసుకుంటే మూత్రంలో నొప్పి తగ్గుతుంది. (సుశృత సంహిత)
పల్లేరు కాయల చూర్ణాన్ని యవక్షారంతో కలిపి తీసుకుంటే మూత్రంలో నొప్పి, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గుతాయి. (వృంద మాధవ, భావప్రకాశ)
పల్లేరు కాయల కషాయాన్ని తేనె, పంచదారతో కలిపి తీసుకుంటే మూత్రాశయ దోషాలు తగ్గుతాయి. (వంగసేన సంహిత)
పల్లేరు కాయలను పాలతోనూ, ఆముదం వేర్లతోనూ, శతావరి వేర్లతోనూ కలిపి పాలు, బెల్లం చేర్చి తీసుకుంటే మూత్రంలో నొప్పి తగ్గుతుంది. (వృంద మాధవ)
పల్లేరు మొక్క కషాయాన్ని పంచదార, తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల మూత్ర సంబంధ సమస్యలూ తగ్గుతాయి. (శారంగధర సంహిత, భావప్రకాశ)
పల్లేరు, ఉలిమిరిచెక్క, శొంఠి వీటి మిశ్రమంతో కషాయం తయారుచేసుకొని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గుతాయి. (్భవప్రకాశ)
పల్లేరు కాయల పేస్టును కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకుంటే మూత్ర వ్యవస్థలో నొప్పి తగ్గుతుంది. (వేద్యమనోరమ)
పల్లేరు కాయలను నువ్వు పువ్వులను సమంగా తీసుకొని తేనె, నెయ్యితో కలిపి పేస్టులాగ చేసి తలకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. (శారంగధర సంహిత)
పల్లేరు కాయల చూర్ణం, ఉసిరి చూర్ణం, తిప్పతీగ చూర్ణం వీటిని నెయ్యి, తేనెతో కలిపి తీసుకుంటే రసాది దాతువులను శక్తివంతం అవుతాయి. (అష్టాంగ హృదయం)
పల్లేరు కాయలు, చెరకు, శతావరి, దూలగొండి గింజలు, నాగబల, అతిబల వీటి చూర్ణాలను పాలతో కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది. (వృందమాధవ)
పల్లేరును పాలతో కలిపి ఉడికించి తీసుకుంటే ముసలితనంలో కూడా యవ్వనపు శక్తి వస్తుంది. (గద నిగ్రహం)
పల్లేరు కాయలను శొంఠిని నీళ్లకు వేసి మరిగించి క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ఆమవాతం, వాపులతో కూడిన కీళ్లనొప్పి తగ్గుతాయి. (చక్రదత్త)



ఎందుకు వస్తుందిరాత్రిపూట ఎక్కువగా మేల్కోవటం వలన, బాగా చల్లగా వుండే ప్రాంతాల్లో ఎక్కువ కాలం నివసించటం వల్ల ఎక్కువసేపు .సి. గదుల్లోనే కాలం గడపటం వల్ల ఎక్కువగా మత్తు పానీయాలు సేవించటం వల్ల, వ్యాధి ఏర్పడుతుంది.

చికిత్స :
1. అలాగే ఎక్కువ విశ్రాంతిగా వుండకుండ శారీరక శ్రమ చేస్తుంటే, క్రమంగా వ్యాధి నివారించబడుతుంది.
2. నల్ల వులవకట్టును తయారు చేసుకొని ప్రతిరోజూ 1 ఔంసు ప్రమాణంలో తాగుతూవుంటే అతిమూత్రవ్యాధి తగ్గిపోతుంది.
3. మునగ ఆకు చిగుళ్ళతో ఆకు కూరగా తయారు చేసుకొని గానీ, లేక మునగకాయల కూర చేసుకొని గానీ తింటూవుంటే అతి మూత్ర వ్యాధి తగ్గిపోతుంది.

పధ్యం
అతి మూత్రవ్యాధి త్వరగా తగ్గాలంటే, బాగా చల్లగా వున్న పదార్ధాలు చలిలో తిరగటం, చన్నీటి స్నానాలు చేయటం మానుకోవాలి.
మజ్జిగ, పెరుగు, దోసకాయ, గుమ్మడికాయ, నిమ్మరసం ,కూల్ డ్రింక్స్, చల్లటి అన్నం, తీపి పదార్ధాలు, చల్లటి అన్నం మానివేయాలి. రాగి జావ, ఉలవ కషాయం వాడాలి. ఉదయం పూట కొద్ది దూరం నడుస్తూ వుండాలి. కొంచమైనా వ్యాయామం చేయాలి.
Published : Monday, March 24, 2014 

పరిశుభ్రమైన చోట పెరిగిన గరికను తెచ్చి కడిగి దంచి తీసిన రసం రెండు మూడు చెంచాల మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే 20 రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపడిపోతయ్.
Published : Thursday, March 13, 2014 

మూత్రపిండాలలోని రాళ్ళను కరిగించటానికి ఔషధాలు వాడినప్పుడు, రాళ్ళు మూక్కలై క్రిందికి జారి మూత్రనాళంలో అడ్డు పడి మూత్రం బిగుసుకు పోతుంది. దానివల్ల భరించలేని బాధ కలుగుతుంది.
అలాంటి విపత్తులో పెసలు 400 గ్రాములు తీసుకుని పప్పుగా వండి, అందులో రెండు లీటర్ల నీళ్ళు పోసుకొని పాత్రను దించి కదిలించి వుంచాలి. కొంతసేపటికి పాత్రలో పప్పు క్రిందికి దిగి పెసరకట్టు నీరులాగా పైకి తేలుతుంది.
పాత్రను మెల్లగా వంచి పై నీటిని వంచుకొని తాగుతూవుంటే మూత్రనాళంలో అడ్డుపడిన రాళ్ళు  కరిగి మూత్రం ద్వారా బటకు వస్తయ్.
Published : Monday, March 10, 2014 

గత కాలంలో అతి కొద్దిమందికి మాత్రమే ఏర్పడుతున్న సమస్య ఈనాడు లక్షలాది మందిని ఎందుకు పీడిస్తుంది?

పూర్వకాలం దాదాపు అందరూ దంతధవనానికి వేపపుల్ల, ఉత్తరేణివేరు వంటి సహజమార్గాలను అనుసరించేవారు. పుల్లలలోని ఔషధశక్తి గొంతులోకి దిగుతూ, ఎల్లవేళలా గొంతులోని విశుద్ధ చక్రస్థానంలో ఉన్న థైరాయిడ్ గ్రంధిని సమతౌల్యంగా కాపాడేది.

కారణంగా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా వుంటూ, రోజూ తినే ఆహారంలోని సున్నాన్ని జీర్ణంచేస్తూ ఎములకు పుష్టినిస్తూవుండేది. కారణంగా సున్నం నిలువ వుండేది కాదు.

ఆధునికయుగంలో ఇంగ్లీష్ వారిని చూసి తెలుగు వాళ్ళు కూడా తమ తరతరాల  అరోగ్యనిధి అయిన వేప, ఉత్తరేణి పుల్లలను విడిచిపెట్టి అనేక విషవికృత రసాయనాలతొ తయారైన పేస్టులను దంతదావనానికి వాడుతున్నారు. వీటి ప్రభావం వల్ల కొంత కాలానికి థైరాయిడ్ గ్రంధిలో  లోపాలు ఏర్పడి, అది ఆహారంలోని సున్నాన్ని జీర్ణింపచేయలేని స్థితికి చేరుకుంటుంది.

రోజు కొద్దికొద్దిగా మిగిలిపోయే సున్నం క్రమక్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతూ రాళ్ళుగా మారుతుంది. సమస్య భవిష్యత్తులో అయినా సమూలంగా నిర్మూలించాలంటే మనమంతా దంతదావనానికి సాంప్రదాయ పద్ధతులను ఆచరించాలని నా ప్రియ స్నేహితులను కోరుకుంటున్నాను.


అతిగా మూత్రంపోయే వ్యాధిగ్రస్తులకు ఆకలి, దప్పిక, శరీరతాపం, బలహీనత ఎక్కువగా వుంటాయి. ఆహారపు రుచి తెలియదు. మాటిమాటికి గొంతు ఎండిపోతుంటుంది. అధిక శాతం మందికి మూత్రం తియ్యగా వుండి విసర్జించినచోట చీమలు మూగుతయ్. లక్షనాలను బట్టీ అతిమూత్ర సమస్యను గుర్తించి క్రింది అహారమార్గాల ద్వారా నివారించుకోవచ్చు.

జీలకర్రతో జీవమైన యోగం

జీలకర్రను కొంచం దోరగా వేయించి దంచి పొడిచేసి పొడితో సమంగా పాతబెల్లం లేదా తాటిబెల్లం కలిపి బాగా దంచి ముద్దను నిలువచేసుకోవాలి. రోజూ రెండూ పూటలా 10 గ్రాముల ముద్దను తింటూవుంటే, అతి మూత్రం అణగారిపోతుంది.

అల్లనేరేడు గింజలతో అద్భుత యోగం: 

అల్లనేరేడుపండ్లు తిన్న తరవాత లోపలి గింజలను ఊసివేస్తుంటాం. కానీ గింజలు చాలా విలువైనవి. గింజలను దంచి జల్లించిన పొడి నిలువచేసుకోవాలి. రోజూ రెండు పూటలా పావుచెంచా నుండీ అరచెంచా వరకు ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తుంటే అతిమూత్రం హరించిపోతుంది.

ఉసిరిపండ్లతో ఉసిగొలిపే యోగం:

పచ్చి ఉసిరికపండ్లరసం 1 ఔంసు తీసుకుని అందులో తేనె రెండు చెంచాలు కలిపి రెండుపూటలా ఆహారానికి రెండు గంటలముందు సేవిస్తుంటే, కొద్దిరోజుల్లోనే అతిమూత్రం హరించిపోయి శరీరంలోని అన్ని అవయవాలకు అమితమైన శక్తి కలుగుతుంది.


No comments:

Post a Comment