గెస్సింగ్ ఆట
ఈ ఆటకు గిన్నెలలో రకరకాల పప్పులు, జీలకర్ర, రవ్వ, బియ్యం ఇలాంటి ఐటంస్ గిన్నెలలో పోసి టేబుల్ మీద పెట్టాలి. ఒక్కొక్కరికి కళ్ళకి గంతలుకట్టి ఒక్కొక్కగిన్నెలోని వస్తువులను వారు తాకి ఆ వస్తువు పేరు చెప్పమనాలి. ఇదికూడా ఒక్కనిముషము సమయంలో చెప్పమనాలి. ఈ ఆటకి ఆడేవారు మాత్రమే అక్కడవుండాలి.
ఆడాల్సినవారు దూరంగా ఉండాలి. వారు గనక వాటిని చూస్తే సులభంగా గుర్తిస్తారు. అందరు మెంబర్స్ చేత ఆడించి ఒక్క నిముషములో ఎవరైతే ఎక్కువ గుర్తిస్తారో వారే గెలిచినట్లు.
తెలుగు పదాల ఆట
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
నలుగురు
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలో
|
|
ఆటగాళ్ళ
వయసు
|
:
|
8 సంవత్సరాల
పైన
|
ముందు పిల్లలంతా ఒక
గదిలో కూర్చోవాలి. నిమిషం టైంలో ఒక్కొక్క అక్షరంతో తమకు తెలిసినన్ని పదాలు రాయాలి.
ఉదా: "అ" అక్షరం మీద పేర్లు రాయవలసిన బాలుడు/బాలిక ఇలా రాయాలి. అరవింద్, అక్క, అత్త, అమ్మ, అల .... ఈ విధంగా నిమిషం గడువులోగా సాధ్యమైనన్ని ఎక్కువ పేర్లు రాయాలి. ఒక రౌండ్లో తక్కువ పేర్లు రాసిన వారు ఔట్ అయిపోతారు. మరల ఆట ప్రారంభమవుతుంది. ఈసారి ఇంకో అక్షరంపై రాయాలి. ఇలా ప్రతి ఆటలోనూ ఒక పిల్లాడు బయటకు వచ్చేస్తాడు. చివరగా మిగిలిన బాలుడు / బాలిక విజేత.
గమనిక : పిల్లలు రాయవలసిన మొదటి అక్షరాన్ని ఓడిపోయిన వ్యక్తి చెబుతుండాలి. ఆ ప్రకారమే రాస్తుండాలి.
నుంచోవడం - కూర్చోవడం
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
అయిదుగురు
|
|
ఆడే
స్థలం
|
:
|
ఎక్కడైనా
|
ఈ ఆట ఎంతమందైనా ఆడవచ్చు. పిల్లలను ఒక
గదిలో నించోబెట్టాలి లీడర్ వారి కెదురుగా కుర్చీలో కూర్చోని స్టాండ్, సిట్ లు
చెబుతుండాలి. స్టాండ్, చెప్పినప్పుడు నించోవడం సిట్ చెప్పినప్పుడు కూర్చోవడం చేస్తూండాలి. స్టాండ్, సిట్ లు చెబుతూ ఒక్కోసారి స్టాండ్ ను
రెండుసార్లు, మూడు సార్లు చెప్పాలి. పిల్లలు ఆటలో నిమగ్నమై స్టాండ్ తర్వాత సిట్ చెబుతారని కూర్చుంటారు. దాంతో దొరికిపోతారు. వారు ఓడిపోయినట్టే మరల అందరికి స్టాండ్, సిట్ చెప్పాలి. ఇలా చివరి దాకా మిగిలిన వారు విజేత. ఈ ఆట వలన పిల్లల్లో చురుకుదనం నడుము కాళ్ళు బలంగా తయారవుతాయి.
మ్యూజికల్ ఐటమ్
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
ఆరు
నుంచి ఎంతమందైనా
|
|
కావల్సిన
వస్తువులు
|
:
|
బంతి, రింగు, దిండు ఏదైనా ప్లాస్టిక్ వస్తువు
|
|
కావలసిన
పరికరాలు
|
:
|
ఒక టేప్ రికార్డర్, క్యాసెట్లు
|
ఆటగాళ్ళు కింద గుంపుగా కూర్చోవాలి. టేప్ రికార్డర్ ఆన్ చేయగానే పాట ప్రారంభం అవుతుంది. వెంటనే బంతినో, రింగునో, దిండునో విసురుతూ ఉండాలి. ఇలా వస్తువు రౌండ్ తిరుగుతూ ఉంటుంది. లీడర్ పాటను ఆపాలి. అయితే వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళు బయటకు వచ్చేయాలి. మరలా ఆటను ప్రారంభించాలి. ఈ సారి ఇంకొక ఆటగాడు అవుటయి పోతాడు. ఇలా చివర మిగిలిన వ్యక్తి విజేతగా నిలుస్తాడు.
పూసలు గుచ్చటం
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
ఐదుగురు.
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలో ఆడవచ్చు.
|
|
పోటి
సమయం
|
:
|
2 నిమిషాలు.
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
పూసలు, దారం.
|
|
ఆటగాళ్ల
వయస్సు
|
:
|
7 నుండి 8 సం||రాల మధ్య .
|
ఈ ఆట బాలికలకు ప్రత్యేకం. లీడర్ స్టార్ట్ అనగానే బాలికలంతా పరిగెత్తి దూరంగా ఉంచబడిన పూసలు, దారాన్ని తీసుకొని గుచ్చడం ప్రారంభించాలి. రెండు నిమిషాలలోపు అవి మొత్తం గుచ్చి, ఆ పూసల దండను మెడలో వేసుకుని, లీడర్ వద్దకు రావాలి. ముందుగా వచ్చిన వారు విజేత. పూసలను మొత్తం కూర్చకుండా వచ్చినవారు ఓడిపోయినట్టే.
ఏకపాత్రాభినయం
ఆట
|
ఎంతమంది
|
:
|
10 మంది
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలో గాని, ఆరు బయట గాని
|
|
ఆటగాళ్ళవయస్సు
|
:
|
7 నుండి 10 సంవత్సరాలలోపు
|
|
పోటీ
సమయం
|
:
|
ఒక్కొక్కరికి 5 నిమిషాలు
|
ఆటగాళ్ళు కూర్చున్నాక లీడర్ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో రకం ఏకపాత్రాభినయాన్ని చెయ్యమని చెప్పాలి. అంటే ఒకరిని డ్రిల్లు మాస్టారిలా, మరొకరిని క్రికెట్ కామెంటేటర్ లా, మరొకరిని ఇస్త్రీ చేసేవాడిలా, పోస్ట్‌మేన్‌లా, ఆటోడ్రయివర్ లా, స్కూల్ టీచర్ లా, చేపలు పట్టేవాడిలా, బస్ కండక్టర్ లా ఇలా అభినయించాలి. బాగా చేసిన వారికి మార్కులు వేయాలి. వారే విజేత.
[ వెనుకకు ]
సైగల అర్థం పోటీ
|
ఎంత
మంది పాల్గొనవచ్చు
|
:
|
10 మంది
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలోగాని, ఆరుబయటగాని
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
పేపర్లు, పెన్సిళ్ళు
|
|
ఆటగాళ్ళవయస్సు
|
:
|
6 నుండి 10 సంవత్సరాల లోపు
|
లీడర్ ఆటగాళ్ళనందరినీ కూర్చోబెట్టి అందరికీ పేపరు, పెన్సిలు ఇవ్వాలి. తాను పది రకాలైన సైగలను చేసి చూపించాలి. ప్రతి సైగను చేసాక 20 సెకన్లు ఆగి రెండవ సైగను చేయాలి. ఇలా పది సైగలు చేసిన తర్వాత, మొత్తం సైగలకు సరైన అర్థం రాసిన ఆటగాళ్ళు విజేతలవుతారు.
వేగంగా చదవడం
|
ఎంత
మంది పాల్గొనవచ్చు
|
:
|
6
|
|
ఆడే
స్థలం
|
:
|
ఆరుబయట
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
టెస్ట్ పుస్తకాలు గాని, న్యూస్ పేపర్లు
|
|
ఆటగాళ్ళ
వయస్సు
|
:
|
6 నుండి 8 సంవత్సరాలలోపు
|
|
పోటీ
సమయం
|
:
|
2 నిమిషాలు
|
ఈ పోటీలో ఆటగాళ్ళ భాషా పరిజ్ఞానాన్ని గుర్తించవచ్చు. పెంపొదించుకోవచ్చు. ముందుగా న్యూస్ పేపర్లు గాని, టెస్ట్ పుస్తకాలు గాని ఆటగాళ్ళకు తలొకటి ఇవ్వాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు స్కెచ్ పెన్‌తో మార్కు చేసిన పేరాను తప్పుల్లేకుండా చదవాలి. ఎవరు రెండు నిమిషాలలో చదవగలిగితే వారు విజేత. ఇంగ్లీషు పేపరు, పుస్తకం, చదవడం కూడా పోటీగా నిర్వహించవచ్చు.
తడిమి కనిపెట్టడం
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
ఎంతమందైనా.
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
పెన్సిలు, రుమాలు ఇలా చిన్న చిన్న వస్తువులు, ఒక సంచి.
|
|
ఆడే
స్థలం
|
:
|
ఆరుబయటగాని, ఇంట్లోగాని.
|
ఒక
సంచిలోరకరకాల వస్తువులు వేయాలి. అవి ఉంగరం, పెన్సిల్, పెన్ను, బలపం, రూపాయి బిళ్ళ, రబ్బరు, రుమాలు, టోపి, బెల్టు లాంటివి ఉంచాలి. ఆటగాళ్ళ కళ్ళకు గంతలు కట్టి సంచిలోని వస్తువు తడిమి అది ఏ వస్తువో చెప్పాలి. ఎవరు ఎక్కువ వస్తువులను సరిగ్గా చెప్పగలరో వారు విజేత.
రుచి కనుక్కోవడం
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
నలుగురు.
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
తినుబండారాలు.
|
|
ఆడే
స్థలం
|
:
|
ఆరుబయట.
|
స్వీట్లు, ఉప్పు, ఆపిల్ పండు, మిరపకాయ, టమోటా, చింతపండు, బత్తాయి,
పంచదార, తేనె, లంవంగ, ఎండుఖర్జూర పండు మొదలగునవి ఒక పళ్ళెంలో పెట్టాలి. పిల్లల కళ్ళకి గంతలు కట్టాలి. రకరకాల రుచికరమైన పదార్థాల దగ్గరకు వారిని తీసుకురావాలి. ఇవి పిల్లలకు రుచి చూపిస్తే అవి ఏమిటో పిల్లలు చెప్పాలి. ఎవరు ఎక్కువ రుచులు సరిగ్గా చెప్పగలుగుతారో వారు విజేతలు.
మ్యూజికల్ మూమెంట్స్
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
ఎంతమందైనా.
|
|
ఆడే స్థలం :
|
:
|
గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
|
|
పోటి
సమయం
|
:
|
2 నిమిషాలు.
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
టేప్ రికార్డర్.
|
|
ఆటగాళ్ల
వయస్సు
|
:
|
5 సం|| రాల నుండి.
|
ఆట
గాళ్ళను ఏం
చెయ్యమంటే అది వాళ్ళు చెయ్యాలి. గంతులెయ్యమంటే వెయ్యాలి. చప్పట్లు కొట్టమంటే కొట్టాలి. అయితే టేప్ రికార్డర్ లోంచి మ్యూజిక్ వినిపిస్తున్నంత వరకే ఆ పని చెయ్యాలి . మ్యూజిక్ ఆగిపోగానే వాళ్ళు నిశ్చలంగా నిలవాలి. మళ్ళీ ఒంటి కాలిమీద గంతులెయ్యమనీ, పాడమనీ చెప్పి మ్యుజిక్ ఆన్ చేస్తే అది వినపడే వరకు వాళ్ళు అలా చెయ్యాలి. మ్యూజిక్ ఆన్ చేస్తే అది వినపడేవరకు వాళ్ళు అలా చెయ్యాలి. మ్యూజిక్ ఆగిపోగానే మళ్ళీ నిశ్చలంగా వుండాలి. అయితే ఆటగాళ్ళంతా మ్యూజిక్ ఆగిపోయిన వెంటనే ఆగరు. ఆ సూచనని చేస్తూనే వుంటారు. అలాంటి వాళ్ళు ఓడిపోయారు. గనుక ఆటలోంచి బయటకు తీసేసి మిగిలిన వాళ్లతో ఆటని కంటిన్యూ చెయ్యాలి. చివరకు ఎవరు మిగిలితే వాళ్లు గెలిచినట్లు.
న్యూస్ పేపర్ క్విజ్
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
8మంది (నలుగురు ఒక బ్యాచ్ చొప్పున).
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలో గాని, ఆరుబయట గాని
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
న్యూస్ పేపర్లు 2.
|
|
ఆటగాళ్ల
వయస్సు
|
:
|
7 నుండి 8 సం||రాలు మధ్య.
|
ఈ ఆటలో రెండు టీమ్‌లను ఎంపికచేయాలి. రెండు ఒక దిన పత్రికలను (ఒకే రోజున) రెండు టీమ్‌ల ఆటగాళ్ళతో చదివించాలి. అనంతరం ఆ పేపర్లలో ఆ రోజు వచ్చిన వార్తలపై ప్రశ్నలు వేయాలి. ఏ టీమ్ సరైన సమాధానం చెపితే వారికి మార్కువస్తుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారు విజేతలు.
మెమరీ గేమ్
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
ఎంతమంది అయినా.
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలో గాని, ఆరుబయట గాని.
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
15 వస్తువులు, పేపరు ప్లేట్లు, కర్చీఫ్‌లు.
|
|
ఆటగాళ్ల
వయస్సు
|
:
|
ఏ వయసు వారైనా.
|
ఈ గేమ్‌కి మొదట 10 మంది 15 వస్తువులను రెండు చొప్పున తీసుకోవాలి. ఒక్కొక్క పేపర్ ప్లేట్‌లో ఒక్కొక్క వస్తువు చొప్పున పెట్టి టేబుల్ మీద పెట్టి ఎరేంజ్ చేసి వాటిమీద కర్చీఫ్ కప్పి ఉంచాలి. ఇప్పుడు అన్ని వస్తువులు రెండింటిలో ఒకటి ప్లేట్స్‌లో ఉన్నాయి. మిగిలిన వాటిని ఒక బౌల్‌లో వేసి ప్రక్కన చైర్‌లో పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి టేబుల్ దగ్గర నుంచోమనండి. వారిని కర్చీఫ్స్‌ని తీసి అన్ని వస్తువులను ఒక్కసారి చూపించి మళ్ళీ యధావిధిగా కర్చీఫ్స్ కప్పేయండి. వారు చేయవలసినది బౌల్‌లో ఒక వస్తువు తీసుకొని ఏ ప్లేటులో అయితే ఆ వస్తువు ఉందో గుర్తుంచుకొని ఆ ప్లేట్‌లో కర్చీఫ్ మీద పెట్టాలి. మీరు కర్చీఫ్ తీసి చూపించినప్పుడే వారికి గేమ్ చెప్పి గుర్తుంచుకోమని చెప్పాలి. ఇప్పుడు స్టార్ట్ చెప్పి వన్‌మినిట్‌లో కరెక్ట్ వస్తువులను కనిపెట్టి పెట్టమనండి. వన్‌మినిట్ తరువాత ఎన్ని కరెక్ట్‌గా పెట్టారో కౌంట్ చేసి వ్రాసుకోండి. అలా అందరి చేత ఆడించి ఎవరు ఎక్కువగా మెమరీలో ఉంచుకొని కరెక్ట్‌గా పెడితే వారే విన్నర్.
గమనిక: గేమ్ ఆడేటప్పుడు ఈ గేమ్‌ని ఆడేసిన వారిని మాత్రమే ప్రక్కన ఉంచాలి.
మెదడుకు పదును
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
పది
మంది
|
|
కావలసిన
వస్తువులు
|
:
|
20 రకాల చిన్నచిన్న వస్తువులు, పేపర్లు, పెన్సిళ్ళు, దుప్పటి
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలో
ఆడవచ్చు
|
|
ఆటగాళ్ళ
వయస్సు
|
:
|
5 నుండి 7 సం||రాల మధ్య
|
|
పోటీ
సమయం
|
:
|
10 నిమిషాలు
|
ముందుగా 20 రకాల చిన్న చిన్న వస్తువులను ఒక
గదిలో ఉంచాలి. పిల్లలందరిని కూర్చోబెట్టి వస్తువులను పరిశీలించమని చెప్పాలి. తరువాత లీడర్ ఆ వస్తువుల మీద దుప్పటి కప్పాలి. వెంటనే పిల్లలు తమ
దగ్గర ఉన్న పేపరు మీద పెన్సిల్‌తో తమకు గుర్తున్న వస్తువుల పేర్లు రాయాలి. 10 నిమిషాలలో అందరూ రాయాలి. ఒకరిదాంట్లో ఒకరు చూడరాదు. అన్నీ సరిగ్గా రాసినవారు విజేత.
దిక్కులను చూపించడం
|
ఎంతమంది
ఆడవచ్చు
|
:
|
ఎనిమిది
మంది
|
|
ఆడే
స్థలం
|
:
|
గదిలోగాని, బయటగాని
|
|
ఆటగాళ్ళ
వయస్సు
|
:
|
10 సం|| నుండి 14 సం||లలోపు
|
|
పోటీ
సమయం
|
:
|
10 నిమిషాలు
|
ఈ ఆట ఆడటం వల్ల పిల్లలలో బుద్ది కుశలత వికసిస్తుంది. ఎనిమిది మంది పిల్లలను రెండు టీమ్‌లుగా విడదీయాలి. 'టీమ్' కు నలుగురు చొప్పున పిల్లలు ఆడాలి. నలుగురు ఒకరి వీపు ఒకరు ఆనించి నిలుచోవాలి. అంటే + ఆకారంలో నాలుగు దిక్కులను ముఖం చూస్తున్నట్టుగా వీరు నిలుచోవాలి. పక్కన ఇంకో టీమ్ కూడ అలానే నిలుచోవాలి. లీడర్ రెండు టీ్‌లలోని వారి పేర్లను విడివిడిగా పిలుస్తూ దిక్కులు చెబుతుంటే లీడర్ చెప్పినట్టు గ్రూప్‌లోని ఆటగాళ్ళు తిరుగుతుండాలి. తప్పుల్లేకుండా 10 నిమిషాలపాటు
ఈ ఆట
ఆడిన జట్టు బాలలు విజేతలు.
No comments:
Post a Comment